< Ɛster 6 >

1 Saa anadwo no, ɔhene no antumi anna, nti ɔmaa ɔsomfo bi kɔfaa nʼahemman mu abakɔsɛm nkrataa bae sɛ wɔnkenkan nkyerɛ no.
ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. అతడు తన పరిపాలన విశేషాలు రాసి ఉండే గ్రంథం తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు తెచ్చి దాన్ని రాజుకు చదివి వినిపించారు.
2 Ohuu sɛnea Mordekai kɔdaa pɔwbɔ bi adi, nea Bigtana ne Teres a na wɔyɛ piamfo baanu a na wɔwɛn ɔhene no apon ano no pamee wɔ nkrataa no mu. Wɔpam ɔhene no ti so sɛ wobekum no.
ద్వారపాలకులు బిగ్తాను, తెరెషు అనే ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపడానికి కుట్ర పన్నిన సంగతి మొర్దెకై బయట పెట్టి తెలియజేసినట్టు అందులో రాసి ఉంది.
3 Ɔhene no bisae se, “Dɛn akatua anaa nkae ade bɛn na wɔde ama Mordekai wɔ eyi ho?” Asomfo no buae se, “Wɔnyɛɛ hwee mmaa no ɛ.”
రాజు ఆ సంగతి విని “మరి దీని కోసం మొర్దెకైకి సన్మానంగా, గుర్తింపుగా ఏదైనా చేశామా?” అని అడిగాడు. రాజు సేవకులు “అతనికేమీ చేయలేదు” అని జవాబిచ్చారు.
4 Ɔhene no bisae se, “Hena na ɔhyɛ akyi hɔ adiwo hɔ no?” Ɛbae sɛ, na afei na Haman abedu ahemfi adiwo a ɛwɔ akyi hɔ no a ɔrebɛka akyerɛ ɔhene no, na wasɛn Mordekai wɔ dua a wasi no so.
అప్పుడు “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని రాజు అడిగాడు. అప్పటికి హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయించడానికి రాజు అనుమతి అడగడానికి రాజ భవంతి ఆవరణంలోకి వచ్చి ఉన్నాడు.
5 Nʼasomfo no buaa ɔhene no se, “Haman na ɔhyɛ hɔ.” Ɔhene no kae se, “Momfa no mmra mu.”
రాజ సేవకులు “అయ్యా, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడు” అని రాజుతో చెప్పారు. రాజు “అతన్ని రానియ్యండి” అన్నాడు. హామాను లోపలికి వచ్చాడు.
6 Enti Haman kɔɔ mu, maa ɔhene no bisae se, “Dɛn na menyɛ mfa nhyɛ ɔbarima a nokware, ɔsɔ mʼani no anuonyam?” Haman bisaa ne ho se, “Hena na ɔfata sɛ ɔhene hyɛ no anuonyam sen me?”
“రాజు ఎవరినైనా గొప్ప చేసి సత్కరించాలనుకుంటే ఏమి చేయాలి?” అని రాజు అతన్ని అడిగాడు. హామాను “నన్ను గాక రాజు మరి ఇంకెవరిని గొప్ప చేయాలనుకుంటాడు?” అని తనలో తాను అనుకుని రాజుతో ఇలా అన్నాడు,
7 Enti obuae se, “Sɛ ɔhene pɛ sɛ ɔhyɛ obi anuonyam a,
“రాజు సత్కరించాలని కోరిన వాడికి ఇలా చెయ్యాలి.
8 ɛsɛ sɛ ɔde nʼankasa ahentade mu baako ne nʼankasa pɔnkɔ a adehye nsɛnkyerɛnne bɔ ne moma so no ba.
రాజు ధరించుకునే రాజవస్త్రాలను, రాజు ఎక్కే గుర్రాన్ని, రాజు తన తలపై పెట్టుకునే రాజకిరీటాన్ని తేవాలి.
9 Ka kyerɛ mmapɔmma no mu baako a odi mu yiye, na ɔmfa ahentade nhyɛ no, na onni nʼanim mfa no mmra aguabɔbea hɔ a ɔte ɔhene no ankasa pɔnkɔ so. Ɛsɛ sɛ mmapɔmma no gye no akurum se, ‘Saa na ɔhene yɛ wɔn a ɔpɛ sɛ ɔhyɛ wɔn anuonyam no!’”
ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీరాజు ఉన్నతాధికారుల్లో ఒకడికి అప్పగించాలి. రాజు గొప్ప చేయాలని కోరుకున్న వ్యక్తికి ఆ వస్త్రాలు తొడిగి ఆ గుర్రం మీద అతణ్ణి ఎక్కించి రాజవీధిలో ఊరేగిస్తూ ‘రాజు గొప్ప చేయాలని కోరిన వాడికి ఈ విధంగా చేస్తారు’ అని అతని ముందు నడుస్తూ చాటించాలి.”
10 Ɔhene no ka kyerɛɛ Haman se, “Eye koraa! Ka wo ho kɔfa ahentade no ne me pɔnkɔ no, na yɛ sɛnea wopɛ sɛ woyɛ no ma Yudani Mordekai a ɔte ahemfi pon ano no. Mma wo werɛ mmfi sɛ wobɛyɛ biribiara a woaka ho asɛm no.”
౧౦వెంటనే రాజు “అయితే తొందరగా వెళ్లి నువ్వు చెప్పినట్టే ఆ వస్త్రాలనూ ఆ గుర్రాన్నీ తీసుకుని రాజ ద్వారం దగ్గర కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి ఆ విధంగా చెయ్యి. నువ్వు చెప్పిన వాటిలో ఏదీ తక్కువ కానియ్యకుండా అంతా చెయ్యి” అని హామానుకు ఆజ్ఞాపించాడు.
11 Enti Haman faa ahentade no de hyɛɛ Mordekai, de no tenaa Ɔhene no ankasa pɔnkɔ so, de no kɔɔ kurow no aguabɔbea hɔ a na ɔpae di nʼanim se, “Saa na ɔhene yɛ wɔn a ɔpɛ sɛ ɔhyɛ wɔn anuonyam no.”
౧౧హామాను ఆ వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి ఆ బట్టలు తొడిగి ఆ గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు.
12 Akyiri no, Mordekai san kɔɔ ahemfi hɔ pon no ano, na Haman de ɔyaw a ano yɛ den ne aniwu yɛɛ ntɛm kɔɔ fie.
౧౨తరువాత మొర్దెకై రాజు ద్వారం దగ్గరికి తిరిగి వచ్చాడు. హామాను మాత్రం తలపై గుడ్డ కప్పుకుని హతాశుడై గబగబా ఇంటికి వెళ్లి పోయాడు.
13 Bere a Haman bɔɔ ne yere Seres ne ne nnamfonom nyinaa amanneɛ no, wɔkae se, “Esiane sɛ Mordekai a oguu wʼanim ase yi yɛ Yudani nti, nhyehyɛe biara a wobɛyɛ atia no no renyɛ yiye. Sɛ wotoa so tia no a, ɛbɛkɔ no bɔne ama wo.”
౧౩హామాను తనకు పట్టిన గతి తన భార్య జెరెషుకు, తన స్నేహితులందరికీ చెప్పాడు. అతని దగ్గర ఉన్న జ్ఞానులు, అతని భార్య జెరెషు “ఎవరి ఎదుట నీవు పడిపోవడం మొదలయిందో ఆ మొర్దెకై యూదు జాతివాడైతే గనక అతన్ని నీవు ఓడించలేవు. అతని చేతుల్లో నీకు పతనం తప్పదు” అని అతనితో అన్నారు.
14 Bere a wogu so rekasa no, ɔhene piamfo no bae sɛ wɔrebɛfa Haman akɔ Ɛster aponto a wasiesie no ase.
౧౪వారు ఇంకా మాట్లాడుతూ ఉండగానే రాజుగారి ఉద్యోగులు వచ్చి ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రమ్మని హామానును తొందర పెట్టారు.

< Ɛster 6 >