< Ɔsɛnkafo 10 >

1 Sɛnea nwansena funu ma aduhuam yi nka bɔne no, saa ara na nkwaseasɛm kakraa bi boro nimdeɛ ne anuonyam so no.
పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది.
2 Onyansafo koma sian kɔ nifa, nanso ɔkwasea koma kɔ benkum.
జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది.
3 Mpo sɛ ɔkwasea nam ɔkwan so a, wohu sɛ onnim nyansa na ɔma obiara hu sɛ wagyimi.
మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు.
4 Sɛ sodifo bo fuw wo a, nnyaw wʼadwuma nto hɔ; na ntoboase dwudwo mfomso kɛse ano.
యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది.
5 Bɔne bi wɔ hɔ a mahu wɔ owia yi ase ɛyɛ mfomso bi a efi sodifo:
రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను.
6 Wɔma nkwaseafo dibea a ɛkorɔn, na asikafo nya nea ɛwɔ fam.
ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం.
7 Mahu nkoa sɛ wɔtete apɔnkɔ so, na mmapɔmma nam fam sɛ nkoa.
సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది.
8 Obiara a otu amoa no betumi atɔ mu; na nea obubu ɔfasu no, ɔwɔ betumi aka no.
గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది.
9 Obiara a ɔpae abo no, abo no betumi apira no; na nea ɔpae nnua no betumi anya mu akwanhyia.
రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.
10 Sɛ abonnua ano kum na wɔansew ano a ebehia ahoɔden bebree, nanso adwumayɛ ho nimdeɛ de nkonimdi bɛba.
౧౦ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది.
11 Sɛ ɔwɔ ka obi ansa na wɔadwudwo no a nea odwudwo ɔwɔ no rennya so mfaso biara.
౧౧పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు.
12 Onyansafo anom nsɛm yɛ nyam, nanso ɔkwasea ano fafa de no kɔ ɔsɛe mu.
౧౨జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి.
13 Mfiase no, wɔn nsɛm yɛ nkwaseasɛm; awiei no, ɛyɛ adammɔ atirimɔdensɛm,
౧౩వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, వెర్రితనంతో ముగుస్తాయి.
14 na ɔkwasea woro nsɛm. Obiara nnim nea ɛreba, hena na obetumi aka nea ebesi wɔ obi akyi akyerɛ no?
౧౪ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు?
15 Ɔkwasea adwumayɛ ma ɔbrɛ; na ɛmma onhu ɔkwan a ɛkɔ kurom.
౧౫మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు.
16 Nnome nka wo, asase a na wo hene yɛ ɔsomfo na wo mmapɔmma to pon anɔpa.
౧౬ఒక దేశానికి బాలుడు రాజుగా ఉండడం, ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం.
17 Nhyira nka wo, asase a wo hene yɛ ɔdehye na wo mmapɔmma didi bere a ɛfata de pɛ ahoɔden na ɛnyɛ nsabow.
౧౭అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం.
18 Sɛ obi yɛ akwadworɔ a ne mpuran yɛ mmerɛw; sɛ ne nsa nka hwee a ne fi nwini.
౧౮సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది.
19 Wɔto pon ma serew, na nsa ma onipa ahosɛpɛw, nanso sika na ɛyɛ biribiara safe.
౧౯విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది.
20 Wʼadwene mu mpo nkasa ntia ɔhene, na wo pia mu nso nnome ɔdefo, efisɛ anomaa a ɔnam wim de wʼasɛm bɛkɔ, na anomaa a otu bɛkɔ akɔka.
౨౦నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.

< Ɔsɛnkafo 10 >