< 5 Mose 12 >

1 Eyinom ne mmara ne ahyɛde a ɛsɛ sɛ mohwɛ na mudi so, mmere dodow a mote asase a Awurade, mo agyanom Nyankopɔn, de ama mo no so.
“మీరు స్వాధీనం చేసుకోడానికి మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకిచ్చిన దేశంలో మీ జీవితకాలమంతా మీరు పాటించాల్సిన కట్టడలు, విధులు ఇవి.
2 Sɛ mutu aman a wɔtete hɔ no fi hɔ a, mosɛe mmeae ahorow bi sɛ mmepɔw atifi, nkoko so, ne nnua a atrɛtrɛw no ase a wɔsom wɔn anyame no nyinaa.
మీరు స్వాధీనం చేసుకోబోయే జాతుల ప్రజలు గొప్ప పర్వతాల మీదా మెట్టల మీదా పచ్చని చెట్ల కిందా ఎక్కడెక్కడ వారి దేవుళ్ళను పూజించారో ఆ స్థలాలన్నిటినీ మీరు పూర్తిగా ధ్వంసం చేయాలి.
3 Mummubu wɔn afɔremuka nyinaa na monyam wɔn ɔsom adum no. Momfa ogya nhyew wɔn abosompɔw na mommobɔ wɔn ahoni a wɔayeyɛ no. Mompepa wɔn ahoni no din mfi mmeae ahorow a ɛwɔ no.
వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.
4 Mommfa wɔn akwan no so nsom Awurade, mo Nyankopɔn.
వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.
5 Na mmom, monhwehwɛ faako a Awurade, mo Nyankopɔn, beyi afi mo mmusuakuw mu ama mo no na munnyina ne din wɔ hɔ sɛ nʼatenae. Beae hɔ na ɛsɛ sɛ mokɔ.
మీ దేవుడు యెహోవా మీ గోత్రాలన్నిటిలో నుండి తన పేరుకు నివాసస్థానంగా ఏర్పాటు చేసుకునే స్థలాన్ని వెదికి అక్కడికి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి.
6 Ɛhɔ na momfa mo hyew afɔrebɔde mmra mmɛbɔ a mo ntotoso du du, akyɛde sononko, ade a moaka ho ntam sɛ mode bɛba ne afɔrebɔde a efi mo pɛ mu, mo anantwi ne mo nguan mu mmakan nso nka ho.
మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.
7 Ɛhɔ, Awurade, mo Nyankopɔn no anim hɔ no, na mo ne mo abusuafo bedidi na mo ani agye wɔ biribiara a mode mo nsa aka ho, efisɛ Awurade, mo Nyankopɔn, ahyira mo.
అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.
8 Nnɛ yi, nea mopɛ biara na moyɛ, nanso ɛnsɛ sɛ ɛba saa,
ఈ రోజు మనమిక్కడ చేస్తున్నట్టు మీలో ప్రతివాడూ తనకిష్టమైనట్టు చేయకూడదు.
9 efisɛ munnuu ahomegyebea ne agyapade a Awurade, mo Nyankopɔn, de rebɛma mo no hɔ ɛ.
నీ దేవుడు యెహోవా మీకిస్తున్న విశ్రాంతిని, స్వాస్థ్యాన్ని మీరింతకు ముందు పొందలేదు.
10 Nanso mubetwa Asubɔnten Yordan akɔtena asase a Awurade, mo Nyankopɔn, de rema mo sɛ agyapade no so. Na ɔbɛma mo ahomegye ne bammɔ afi mo atamfo a wɔatwa mo ho ahyia no nsam na moatena ase dwoodwoo.
౧౦మీరు యొర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో స్థిరపడిన తరువాత ఆయన మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి మీకు విశ్రాంతినిచ్చి నెమ్మది కలిగిస్తాను.
11 Momfa biribiara a mehyɛ mo sɛ momfa mmra sɛ ɛyɛ mo ɔhyew afɔrebɔde, ntotoso du du, akyɛde sononko ne mo ɔma ahorow no mfa nhyɛ mo ntanka no mu kena wɔ beae a Awurade, mo Nyankopɔn, beyi ama mo a sɛ monsɔre ne din wɔ hɔ no.
౧౧నేను మీకు ఆజ్ఞాపించేవాటన్నిటిననీ, అంటే మీ హోమ బలులు, బలులు, దశమ భాగాలు, ప్రతిష్ఠిత నైవేద్యాలు, మీరు యెహోవాకు చేసే శ్రేష్ఠమైన మొక్కుబళ్లను మీ దేవుడైన యెహోవా తన పేరుకు నివాసంగా ఏర్పాటు చేసుకునే స్థలానికే మీరు తీసుకురావాలి.
12 Mo ne mo mmabarima, mo mmabea ne mo nkoa nyinaa nnye mo ani wɔ hɔ wɔ Awurade, mo Nyankopɔn no, anim. Na monkae Lewifo a wɔtete mo nkurow so no a wonni wɔn ankasa agyapade no.
౧౨మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసులు, దాసీలు, మీలో స్వాస్థ్యం లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడు యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
13 Monhwɛ yiye na moammɔ mo hyew afɔre wɔ baabiara a mopɛ.
౧౩మీరు చూసిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకూడదు.
14 Mommɔ wɔ baabi pɔtee a Awurade ayi afi mo mmusua asase bi mu ama mo no nkutoo. Ɛhɔ na monyɛ biribiara a mehyɛ mo sɛ monyɛ no.
౧౪కేవలం యెహోవా మీ గోత్రాల్లో ఒకదాని మధ్య ఏర్పాటు చేసుకునే స్థలంలోనే మీ హోమబలులు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించే సమస్తాన్నీ అక్కడే జరిగించాలి.
15 Nanso kurow biara a mopɛ so no, mutumi kum mmoa we sɛnea mukum atwe ne adabɔ no. Mutumi we nam dodow biara a Awurade, mo Nyankopɔn, de behyira mo no. Wɔn a wɔn ho tew ne wɔn a wɔn ho ntew no nyinaa tumi we bi.
౧౫అయితే మీ దేవుడు యెహోవా మిమ్మల్ని దీవించిన కొలది మీ ఇళ్ళలో మీకిష్టమైన దాన్ని చంపి తినవచ్చు. పవిత్రులైనా, అపవిత్రులైనా ఎర్రజింకను, చిన్న దుప్పిని తినవచ్చు.
16 Nanso ɛnsɛ sɛ mudi mogya no. Muntwa ngu fam te sɛ nsu.
౧౬వాటి రక్తం మాత్రం తినకూడదు. దాన్ని నీళ్లలాగా నేల మీద పారబోయాలి.
17 Ɛnsɛ sɛ mudi mo afɔre, ntotoso du du a efi mo atoko mu, mo nsa foforo ne ngo anaa mo anantwi ne mo nguan abakan wɔ mo kurow mu. Biribiara a moaka ho ntam sɛ mode bɛma Awurade anaa nea mufi mo koma mu ahyɛ ho bɔ anaa akyɛde sononko biara no, ɛnsɛ sɛ mudi.
౧౭మీ ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో, దశమ భాగం, మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో తొలిచూలు పిల్లల్లో, మీరు చేసే మొక్కుబళ్లలో స్వేచ్ఛార్పణలు, ప్రతిష్ఠార్పణలు మీ ఇంట్లో తినకూడదు.
18 Mmom, ɛsɛ sɛ mudi wɔ Awurade, mo Nyankopɔn, anim wɔ faako a Awurade, mo Nyankopɔn no, bɛkyerɛ mo a mo, mo mmabarima ne mo mmabea, mo nkoa ne mo mfenaa ne Lewifo a wofi mo nkurow mu ka ho no, munnye mo ani wɔ Awurade, mo Nyankopɔn no, anim wɔ biribiara a mobɛyɛ no ho.
౧౮వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసుకునే స్థలం లోనే మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు దాసదాసీలు, మీ ఇంట్లో ఉండే లేవీయులు, అందరూ మీ యెహోవా దేవుని సన్నిధిలో తిని, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో సంతోషించాలి.
19 Monhwɛ yiye na moanyi Lewifo no mu wɔ mmere dodow a mote mo asase so no.
౧౯మీరు మీ దేశంలో జీవించిన కాలమంతటిలో లేవీయులను విడిచిపెట్టకూడదు.
20 Sɛ Awurade, mo Nyankopɔn, trɛw mo hye mu sɛnea wahyɛ mo ho bɔ no, na sɛ mo kɔn dɔ nam ka se, “Yenya nam bi a anka yɛbɛwe” a, ɛno de, mubetumi awe nam dodow biara a mopɛ.
౨౦మీ దేవుడు యెహోవా తాను మీ కిచ్చిన మాట ప్రకారం మీ సరిహద్దులను విశాలపరచిన తరువాత తప్పకుండా మాంసం తినాలని కోరుకుంటావు. అప్పుడు నీకిష్టమైన మాంసం తినవచ్చు.
21 Sɛ faako a Awurade, mo Nyankopɔn no, ayi ama mo sɛ monkamfo ne din hɔ no ne mmeae a mowɔ no ntam ware a, mutumi kum mo anantwi anaa nguan a Awurade de ama mo no dodow biara a mopɛ no wɔ mo afi mu sɛnea mahyɛ mo no.
౨౧నీ దేవుడు యెహోవా తన సన్నిధిని నిలిపి ఉంచడానికి ఎన్నుకున్న స్థలం మీకు దూరంగా ఉన్నట్లయితే,
22 Monwe sɛnea mowe atwe anaa adabɔ. Wɔn a wɔn ho ntew ne wɔn a wɔn ho tew no nyinaa tumi we bi.
౨౨యెహోవా మీకిచ్చిన ఆవుల్లో గాని, గొర్రెలు, మేకల్లో గాని దేనినైనా నేను మీకాజ్ఞాపించినట్టు చంపి నీ ఇంట్లో తినవచ్చు. జింకను, దుప్పిని తిన్నట్టుగానే దాన్ని తినవచ్చు. పవిత్రులు, అపవిత్రులు అనే భేదం లేకుండ ఎవరైనా తినవచ్చు.
23 Monhwɛ sɛ morenni mogya no, efisɛ mogya no ne nkwa no, na ɛnsɛ sɛ mudi nkwa no ne nam no.
౨౩అయితే వాటి రక్తాన్ని మాత్రం తినకూడదు, జాగ్రత్త సుమా. ఎందుకంటే రక్తమే ప్రాణం. మాంసంతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు.
24 Munni mogya no; mmom, munhwie ngu fam sɛ nsu.
౨౪మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి.
25 Munnni mogya no na asi mo ne mo mma yiye, efisɛ moyɛ saa a na moayɛ nea ɛteɛ wɔ Awurade ani so.
౨౫మీరు దాన్ని తినకుండా యెహోవా దృష్టికి ఇష్టమైనదాన్ని చేసినందుకు మీకు, మీ సంతానానికి మేలు కలుగుతుంది.
26 Momfa mo nneɛma a moatew ho ne nea moaka ho ntam sɛ mobɛma biara no, na monkɔ beae a Awurade bɛpaw no.
౨౬మీకు నియమించిన ప్రతిష్టితార్పణలు, మొక్కుబడులను మాత్రం యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలానికే మీరు తీసుకువెళ్ళాలి.
27 Momfa mo ɔhyew afɔre, nam ne mogya no nyinaa, ngu Awurade, mo Nyankopɔn no, afɔremuka so. Ɛsɛ sɛ muhwie mo afɔrebɔde no mogya no gu Awurade, mo Nyankopɔn no, afɔremuka no nkyɛn. Mmom, mubetumi awe nam no.
౨౭మీ దహనబలులనూ వాటి రక్తమాంసాలనూ మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద అర్పించాలి. మీ బలుల రక్తాన్ని మీ దేవుడు యెహోవా బలిపీఠం మీద పోయాలి. వాటి మాంసం మీరు తినాలి.
28 Monhwɛ sɛ mubedi mmara ahorow a mede rema mo yi nyinaa so, na asi mo ne mo mma a wɔbɛba wɔ mo akyi no yiye, efisɛ ɛno na ɛbɛyɛ nea eye ne nea ɛteɛ wɔ Awurade, mo Nyankopɔn no ani so.
౨౮నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలన్నిటినీ మీరు జాగ్రత్తగా విని పాటిస్తే మీ దేవుడైన యెహోవా దృష్టికి మంచిదాన్నీ, యుక్తమైనదాన్నీ మీరు చేసినందుకు మీకు, మీ తరువాత మీ సంతతి వారికి ఎల్లప్పుడూ సుఖశాంతులు కలుగుతాయి.
29 Na Awurade, mo Nyankopɔn no, bedi mo anim kan akɔsɛe aman a morekɔtoa wɔn no na mopam wɔn. Na sɛ mopam wɔn kɔtena wɔn nsase no so,
౨౯మీరు స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న దేశ ప్రజలను మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుండి నాశనం చేసిన తరువాత, మీరు ఆ దేశంలో నివసించేటప్పుడు, మీరు వారిని అనుసరించాలనే శోధనలో చిక్కుకోవద్దు.
30 na sɛ wonya di mo anim sɛe wɔn a, monhwɛ yiye na moammisa wɔn anyame no ase anka se, “Ɔkwan bɛn so na saa aman yi fa som wɔn anyame? Yɛpɛ sɛ yɛyɛ saa bi,” amfa so ankɔtɔ afiri mu.
౩౦ఈ ప్రజలు తమ దేవుళ్ళను పూజిస్తున్నట్టే మేము కూడా వారి దేవుళ్ళను పూజిస్తాము అనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.
31 Mommfa wɔn kwan so nsom Awurade, mo Nyankopɔn no, efisɛ wɔn anyame no som mu no, wɔyɛ akyiwade ahorow a Awurade kyi no nyinaa mpɛ. Mpo, wɔhyew wɔn mmabarima ne wɔn mmabea wɔ ogya sɛ wɔde rebɔ afɔre ama wɔn anyame no.
౩౧వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
32 Monhwɛ sɛ mubedi nea mahyɛ mo no nyinaa so; mommfa bi nka ho na munnyi bi nso mfi mu.
౩౨నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”

< 5 Mose 12 >