< Amos 6 >
1 Nnome nka mo a mugye mo ho di wɔ Sion, ne mo a mo asom adwo mo wɔ Samaria bepɔw so, mo atitiriw a mowɔ ɔman a edi kan mu, a Israelfo ba mo nkyɛn!
౧సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.
2 Monkɔ Kalne nkɔhwɛ hɔ. Na mumfi hɔ nkɔ Hamat kɛse mu, munsian nkɔ Gat a ɛwɔ Filistia. Woye sen mo ahemman abien no? Wɔn asase no so sen mo de no ana?
౨మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి. అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి. ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి. అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా? వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
3 Mutu da bɔne hyɛ da na motwe atemmuda bɛn.
౩విపత్తు రోజు దూరంగా ఉందనుకుని దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.
4 Modeda asonse mpa so mugye mo ahome wɔ mo nnae mu, na mowe nguantenmma ne nantwimma a wɔadodɔ srade nam.
౪వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
5 Mode mo sankuten to ahuhunnwom, na mobɔ mo tirim yɛ nnwom wɔ mo nnwontode so te sɛ Dawid.
౫తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
6 Monom nsa wɔ nkora mu na mode sradehuam papa yɛ mo ho, na munni awerɛhow wɔ Yosef sɛe ho.
౬ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
7 Ɛno nti, mobɛka wɔn a wodi kan twa wɔn asu no ho; na mo aponto ne mo ahomegye to betwa.
౭కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు. సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు.
8 Otumfo Awurade aka ne ho ntam na nea Asafo Awurade Nyankopɔn se ni: “Mikyi Yakob ahomaso na mempɛ nʼaban; mede kuropɔn no bɛma ne nea ɛwɔ mu nyinaa.”
౮“యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం. వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం. కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను. నేను, ప్రభువైన యెహోవాను. నా తోడని ప్రమాణం చేశాను.” సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.
9 Sɛ wogyaw nnipa du wɔ ofi baako mu a, wɔn nso bewuwu.
౯ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.
10 Na sɛ obusuani a ɔrebɛhyew awufo no ba sɛ ɔrebɛfa wɔn afi fie hɔ na obisa obi a wakɔtɛw se, “Obi ka wo ho ana?” Na obua se, “Dabi” a, afei ɔbɛka se, “Mua wʼano!” Ɛnsɛ sɛ wɔbɔ Awurade din.
౧౦వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.
11 Na Awurade ahyɛ mmara na obebubu afi akɛse no mu asinasin ne afi nketewa no nso mu nketenkete.
౧౧ఎందుకంటే గొప్ప కుటుంబాలు, చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
12 Apɔnkɔ tu mmirika wɔ abotan a apaapae so ana? Na obi de nantwi funtum hɔ ana? Nanso moadan atɛntrenee ayɛ no awuduru. Na trenee nso ayɛ nwenweenwen.
౧౨గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
13 Mo a mo ani gye Lo-debar nkogu ho, na mubisa se, “Ɛnyɛ yɛn ahoɔden na yɛde dii Karnaim so ana?”
౧౩లొదెబారు పట్ల ఆనందించే మీరు, “మా సొంత బలంతో కర్నాయింను వశం చేసుకోలేదా?” అంటారు.
14 Nea Asafo Awurade Nyankopɔn se ni: “Mɛhwanyan ɔman bi abetia mo, Israelfo, nea ɔbɛhyɛ mo so afi Lebo Hamat akosi Araba bon mu.”
౧౪అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే, “ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను. వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ మిమ్మల్ని బాధిస్తారు.”