< 2 Ahemfo 22 >

1 Bere a Yosia dii hene wɔ Yuda no, na wadi mfirihyia awotwe, na odii ade wɔ Yerusalem mfe aduasa baako. Na ne na din de Yedida a ɔyɛ Adaia a ofi Boskat no babea.
యోషీయా ఏలడం ఆరంభించినప్పుడు, అతని వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతు ఊరివాడైన అదాయా కూతురు.
2 Ɔyɛɛ nea ɛsɔ Awurade ani, yɛɛ nea ne tete agya Dawid yɛe no bi. Wamfi adetreneeyɛ ho.
అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.
3 Ɔhene Yosia dii mfirihyia dunwɔtwe wɔ nʼahenni mu no, ɔsomaa Asalia babarima Safan, asennii kyerɛwfo Mesulam nena, kɔɔ Awurade Asɔredan mu. Ɔka kyerɛɛ no se,
రాజైన యోషీయా పరిపాలనలో 18 వ సంవత్సరంలో, అతడు మెషుల్లాముకు పుట్టిన అజల్యా కొడుకూ, శాస్త్రి అయిన షాఫానును యెహోవా మందిరానికి వెళ్ళమన్నాడు. రాజు అతనితో,
4 “Kɔ ɔsɔfopanyin Hilkia nkyɛn, na ma ɔnkan sika a aponanohwɛfo no agyigye afi nnipa no nkyɛn wɔ Awurade Asɔredan mu no.
“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.
5 Fa saa sika yi hyɛ nnipa a wɔayi wɔn sɛ wɔnhwɛ asɔredan no ho asiesie no nsa. Na wɔde atua adwumayɛfo a wobesiesie Awurade Asɔredan no ho ka.
యెహోవా మందిరపు పనికి అధికారులుగా ఉండి పని జరిగించేవాళ్ళ చేతికి ఆ డబ్బు అప్పగించాలి. ఆ తరువాత యెహోవా మందిరంలో శిథిలమైన స్థలాలను బాగుచేయడానికి యెహోవా మందిరపు పనిచేసే కూలివాళ్లకు వారు ఆ డబ్బు ఇవ్వాలి.
6 Ɛho behia sɛ wɔbɛfa nnua adwumfo, adansifo ne abohyehyɛfo. Afei, ma wɔntɔ nnua ne abo a wɔatwa a wɔde besiesie asɔredan no.
వడ్రంగి వాళ్ళకూ, శిల్పకారులకూ, తాపీ పని వాళ్ళకూ, మందిరాన్ని బాగు చెయ్యడానికి మానులు, చెక్కిన రాళ్ళు కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పు” అన్నాడు.
7 Nanso ɛho nhia sɛ adansi no sohwɛfo bebu sika a wɔn nsa bɛka no ho akontaa, efisɛ wɔyɛ nokwafo.”
ఆ అధికారులు నమ్మకస్థులు గనుక వాళ్ళ చేతికి అప్పగించిన డబ్బు గురించి వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవలసిన పని లేదు.
8 Ɔsɔfopanyin Hilkia ka kyerɛɛ asennii kyerɛwfo Safan se, “Mahu Mmara Nhoma no wɔ Awurade Asɔredan mu hɔ.” Na Hilkia de nhoma mmobɔwee no maa Safan, na ɔkenkanee.
అప్పుడు, ప్రధానయాజకుడైన హిల్కీయా “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథాన్ని, షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి
9 Safan san kɔɔ ɔhene no nkyɛn kɔkae se, “Wo mpanyimfo no de sika a wogyigyee wɔ Awurade asɔredan no mu no ahyɛ adwumayɛfo no ne sohwɛfo a wɔwɔ asɔredan no ho no nsa.”
రాజు దగ్గరికి తిరిగి వచ్చి “మీ సేవకులు మందిరంలో దొరికిన డబ్బు సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులుగా ఉండి, పని జరిగించేవాళ్ళ చేతికి అప్పగించారు” అని వార్త చెప్పి,
10 Safan san ka kyerɛɛ ɔhene no se, “Ɔsɔfo Hilkia de nhoma mmobɔwee bi ama me.” Na Safan kenkan kyerɛɛ ɔhene no.
౧౦“యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించాడు” అని రాజుతో చెప్పి ఆ గ్రంథం రాజు సముఖంలో చదివాడు.
11 Bere a ɔhene no tee nsɛm a ɛwɔ Awurade Mmara Nhoma no mu no, ɔde ahometew sunsuan ne ntade mu.
౧౧రాజు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.
12 Na ɔhyɛɛ ɔsɔfo Hilkia, Safan babarima Ahikam ne Mikaia babarima Akbor ne asennii kyerɛwfo Safan ne ɔhene fotufo Asaia se,
౧౨తరువాత రాజు యాజకుడైన హిల్కీయా, షాఫాను కొడుకు అహీకాము, మీకాయా కొడుకు అక్బోరు అనే వాళ్ళనూ, షాఫాను అనే శాస్త్రినీ, అశాయా అనే రాజసేవకుల్లో ఒకణ్ణి పిలిచి వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు.
13 “Monkɔ asɔredan no mu, na monkɔkasa nkyerɛ Awurade mma me, mma nnipa no ne Yuda nyinaa. Mummisa no nsɛm a wɔakyerɛw agu nhoma mmobɔwee no a wahu no ho asɛm. Awurade abufuwhyew aba yɛn so, efisɛ yɛn agyanom anni nhoma yi mu nsɛm so. Ɛnyɛ nea nhoma yi ka sɛ yɛnyɛ no na yɛyɛ.”
౧౩“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.
14 Enti ɔsɔfo Hilkia, Ahikam, Akbor, Safan ne Asaia kɔɔ Yerusalem Fa Foforo Misne kohuu odiyifo Hulda. Na ɔyɛ Tikwa babarima Salum yere, a na ɔyɛ Harhas a ɔhwɛ ntade adaka a ɛwɔ asɔredan mu so no nso nena.
౧౪కాబట్టి యాజకుడైన హిల్కీయా, అహికాము, అక్బోరు, షాఫాను, అశాయా, స్త్రీ ప్రవక్త హుల్దా దగ్గరికి వచ్చారు. ఈమె వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు పుట్టిన తిక్వా కొడుకు షల్లూము భార్య. ఈమె యెరూషలేములో రెండో భాగంలో కాపురం ఉంది. ఈమె దగ్గరికి వారు వచ్చి మాటలాడారు.
15 Ɔka kyerɛɛ wɔn se, “Awurade, Israel Nyankopɔn akasa. Monkɔka nkyerɛ onipa a ɔsomaa mo no se,
౧౫ఆమె వాళ్ళతో “మిమ్మల్ని నా దగ్గరికి పంపిన వానితో ఈ మాట చెప్పండి.
16 ‘Sɛnea Awurade se ni: Mɛsɛe kuropɔn yi ne mu nnipa, sɛnea makyerɛw wɔ nhoma mmobɔwee a mokenkan no mu no.
౧౬యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.
17 Efisɛ me nkurɔfo agyaw me, na wɔsom anyame huhuw, na biribiara a wɔayɛ no, ahyɛ me abufuw. Mʼabufuwhyew redɛw wɔ ha, na ɛrennum.’
౧౭ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.
18 Na monkɔ Yudahene a ɔsomaa mo sɛ monkɔhwehwɛ Awurade no nkyɛn, na monka nkyerɛ no se, Sɛɛ na Awurade, Israel Nyankopɔn, ka fa asɛm a motee mprempren no ho.
౧౮యెహోవాను సంప్రదించడానికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియపరచండి.
19 Wotee asɛm a meka de tiaa kuropɔn no ne emu nnipa no sɛ, wɔbɛdome saa asase yi na ada mpan no, ɛyɛɛ wo yaw, ma wobrɛɛ wo ho ase Awurade anim. Wode ahometew sunsuan wo ntade mu, suu wɔ mʼanim ahonu mu. Enti nokware, Awurade se, ‘mate wo sufrɛ.
౧౯ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.
20 Amanehunu a mehyɛɛ ho bɔ de tiaa kuropɔn yi no bɛba wo wu ne wusie akyi. Worenhu amane a mede bɛba kuropɔn yi so no.’” Enti wɔsan de ne nkra no kɔmaa ɔhene no.
౨౦నేను నిన్ను నీ పితరుల దగ్గరికి చేరుస్తాను. నీవు ప్రశాంతంగా సమాధికి వెళ్తావు. నేను ఈ స్థలం మీదకి రప్పించే కీడును నీవు నీ కళ్ళతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు” అని చెప్పింది. అప్పుడు, వారు ఈ వార్త రాజు దగ్గరికి తెచ్చారు.

< 2 Ahemfo 22 >