< 2 Ahemfo 20 >
1 Saa nna no mu no, Hesekia yaree owuyare, na Amos babarima Odiyifo Yesaia kɔɔ ne nkyɛn kɔkae se, “Sɛnea Awurade se ni: Toto wʼakwan yiye, efisɛ worebewu; na wo ho renyɛ wo den bio.”
౧ఆ రోజుల్లో, హిజ్కియాకు జబ్బు చేసి చావుబతుకుల్లో ఉన్నాడు. ఆమోజు కొడుకూ ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చి “నీవు చనిపోతున్నావు. ఇక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా చెప్తున్నాడు” అని చెప్పాడు.
2 Bere a Hesekia tee asɛm yi, otwaa nʼani hwɛɛ ɔfasu, bɔɔ Awurade mpae se,
౨హిజ్కియా తన ముఖాన్ని గోడవైపు తిప్పుకుని,
3 “Kae, Awurade, sɛnea manantew wʼanim nokware mu na mede me koma ayɛ nea ɛfata wɔ wʼanim.” Na Hesekia suu bebree.
౩“యెహోవా, యథార్థ హృదయంతో, సత్యంతో నీ సన్నిధిలో నేనెలా నడుచుకున్నానో, నీ దృష్టిలో అనుకూలంగా అంతా నేనెలా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో” అని కన్నీళ్ళతో యెహోవాను ప్రార్థించాడు.
4 Na ansa na Yesaia befi adiwo no mfimfini no, Awurade de asɛm yi besii ne so se,
౪యెషయా మధ్య ప్రాంగణంలోనుంచి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై,
5 “San kɔ Hesekia a ɔyɛ me nkurɔfo kannifo no nkyɛn, na kɔka kyerɛ no se, ‘Sɛɛ na Awurade a ɔyɛ wʼagya Dawid Nyankopɔn se: Mate wo mpaebɔ no, ahu wo nusu no. Mɛsa wo yare, na nnansa akyi no, wobɛsɔre afi mpa so, na woakɔ Awurade Asɔredan mu.
౫“నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.
6 Mede mfe dunum bɛka wo mfe ho, na megye wo ne saa kuropɔn yi afi Asiriahene nsam. Me somfo Dawid nti, mɛyɛ eyi de agye mʼanuonyam.’”
౬ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్షు నీకు ఇస్తాను. ఇంకా నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం ఈ పట్టణాన్ని నేను కాపాడుతూ, నిన్నూ, ఈ పట్టాణాన్నీ, అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను” అన్నాడు.
7 Na Yesaia ka kyerɛɛ Hesekia asomfo no se, “Momfa borɔdɔma nyɛ ngo, na momfa nsrasra pɔmpɔ no so.” Wɔyɛɛ saa, na Hesekia nyaa ahoɔden.
౭తరువాత యెషయా “అంజూరపుపళ్ళ ముద్ద తెప్పించండి” అని చెప్పాడు. వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగు పడ్డాడు.
8 Ansa na ɔrebenya ayaresa no, Hesekia bisaa Yesaia se, “Nsɛnkyerɛnne bɛn na Awurade bɛyɛ, de akyerɛ sɛ ɔbɛsa me yare, na matumi akɔ Awurade Asɔredan mu nnansa so?”
౮“యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా
9 Yesaia buae se, “Eyi ne nsɛnkyerɛnne a Awurade bɛyɛ akyerɛ wo sɛ obedi ne bɔhyɛ so. Wopɛ sɛ sunsuma no kɔ nʼanim anammɔntu du anaa ɛsan nʼakyi anammɔntu du?”
౯“తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు.
10 Hesekia buae se, “Honhom no kɔ nʼanim bere biara. Na mmom, ma ɛnkɔ nʼakyi.”
౧౦అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు.
11 Enti Yesaia srɛɛ Awurade sɛ ɔnyɛ eyi, na ɔmaa sunsuma no tetew san nʼakyi anammɔntu du wɔ Ahas atrapoe no so.
౧౧ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
12 Saa bere yi mu na Babiloniahene Baladan babarima Merodak-Baladan soma ma wɔkɔmaa Hesekia tirinkwa ne akyɛde, efisɛ na wate sɛ ɔyare dennen bi bɔɔ Hesekia.
౧౨ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.
13 Hesekia gyee Babilonia ananmusifo yi, kyerɛɛ wɔn biribiara a ɔwɔ wɔ nʼadekoradan mu a ɛyɛ dwetɛ, sikakɔkɔɔ, nnuhuam ne ngo a ɛyɛ huam. Afei nso, ɔde wɔn kɔɔ nʼadekorabea, san kyerɛɛ wɔn nʼadekoradan mu biribiara. Biribiara nni nʼahemfi hɔ anaa nʼaheman mu hɔ a Hesekia ankyerɛ wɔn.
౧౩వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.
14 Afei Odiyifo Yesaia kɔɔ ɔhene Hesekia nkyɛn, kobisaa no se, “Asɛm bɛn na saa mmarima no kae na he na wofi bae?” Hesekia buae se, “Wofi akyirikyiri asase bi so. Wofi Babilonia, na wɔbaa me nkyɛn.”
౧౪తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు.
15 Odiyifo no bisae se, “Dɛn na wohuu wɔ wʼahemfi hɔ?” Hesekia buae se, “Wohuu biribiara a ɛwɔ mʼahemfi ha. Biribiara nni mʼademude mu a mamfa ankyerɛ wɔn.”
౧౫“నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.
16 Na Yesaia ka kyerɛɛ Hesekia se, “Tie saa asɛm a efi Awurade nkyɛn yi:
౧౬అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను.
17 Nokware, bere bi bɛba a, wɔbɛsoa biribiara a ɛwɔ wʼahemfi ne agyapade a wʼagyanom akora de abedu nnɛ no akɔ Babilonia. Biribiara renka, sɛɛ na Awurade se.
౧౭రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు.
18 Wʼankasa wʼasefo bi mpo, wɔbɛfa wɔn nnommum. Wɔbɛyɛ piamfo a wɔbɛsom wɔ Babiloniahene ahemfi.”
౧౮ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.
19 Na Hesekia ka kyerɛɛ Yesaia se, “Saa asɛm yi a efi Awurade nkyɛn a woaka akyerɛ me yi yɛ asɛm papa.” Nanso na ɔhene no redwene sɛ, ne bere so de, obenya asomdwoe ne bammɔ.
౧౯అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.
20 Nsɛm a esisii Hesekia ahenni mu nkae no a ne tumidi ka ho, ne sɛnea ɔyɛɛ subun, twaa suka maa nsu baa kurow no mu no nyinaa, wɔankyerɛw angu Yuda Ahemfo Abakɔsɛm Nhoma no mu ana?
౨౦హిజ్కియా చేసిన ఇతర పనులు గురించీ, అతని పరాక్రమం అంతటి గురించీ, అతడు కొలను తవ్వించి, కాలువ వేయించి పట్టణంలోకి నీళ్లు రప్పించిన దాన్ని గురించీ, యూదారాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.
21 Bere a Hesekia wui no, ne babarima Manase na odii nʼade sɛ ɔhene.
౨౧హిజ్కియా తన పూర్వీకులతోబాటు చనిపోయాడు. అతని కొడుకు మనష్షే అతని స్థానంలో రాజయ్యాడు.