< 2 Ahemfo 19 >
1 Bere a ɔhene Hesekia tee eyinom no, osunsuan ne ntade mu, na ofuraa atweaatam, na ɔkɔɔ Awurade asɔredan mu.
౧వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.
2 Na ɔsomaa Eliakim a ɔhwɛ ahemfi ntotoe so, Sebna, a ɔyɛ ɔkyerɛwfo ne asɔfo akunini a wɔn nyinaa furafura atweaatam, kɔɔ Amos babarima Odiyifo Yesaia nkyɛn.
౨గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.
3 Wɔka kyerɛɛ no se, “Sɛnea ɔhene Hesekia ka ni: Saa da yi yɛ ɔhaw, animka ne animguase da. Ayɛ te sɛ nea mmofra awo du so, na ahoɔden a wɔde bɛwo wɔn nni hɔ.
౩వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు.
4 Nanso ebia Awurade, mo Nyankopɔn ate sɛ Asiria nanmusini no regu Onyankopɔn teasefo no anim ase, na wɔbɛtwe nʼaso wɔ ne nsɛnkeka no ho. Enti bɔ mpae ma yɛn a yɛaka no!”
౪జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”
5 Na ɔhene Hesekia mpanyimfo no kɔkaa ɔhene nkra no kyerɛɛ Yesaia,
౫రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు,
6 na Yesaia buae se, “Ka kyerɛ wo wura se, ‘Sɛnea Awurade se ni: Mma abususɛm a Asiriahene asomafo no ka tiaa me no nhaw wo.
౬యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.
7 Muntie! Mede honhom bi rebɛhyɛ ne mu, sɛnea ɛbɛyɛ a sɛ ɔte asɛm bi a ɔbɛsan akɔ ne man mu na hɔ na mɛma wɔde afoa akum no.’”
౭అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
8 Bere a ɔsahene no tee sɛ Asiriahene afi Lakis no, ɔsan nʼakyi kohuu sɛ ɔhene no ne Libna reko.
౮అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు.
9 Ankyɛ, ɔhene Sanaherib nyaa nkra se, Etiopiahene Tirhaka adi asraafo anim, rebɛko atia no. Na ansa na ɔbɛsan akohyia asraafo no, ɔde saa nkra yi maa sɛ wɔmfa nkɔma Hesekia wɔ Yerusalem.
౯అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.
10 “Monka nkyerɛ Yudahene Hesekia se: Mma onyame a wode wo ho ato no so no nnaadaa mo nka se, ‘Wɔremfa Yerusalem mma Asiriahene.’
౧౦“యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.
11 Moate nea Asiria ahemfo ayɛ amanaman no nyinaa. Wɔasɛe wɔn pasaa. Na mo de, wobegye mo ana?
౧౧చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?
12 Anyame a wɔwɔ aman a me nenanom sɛee wɔn no, aman te sɛ, Gosan, Haran, Resef ne Edenfo a na wɔwɔ Telasar no anyame gyee wɔn ana?
౧౨నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?
13 Nsɛm bɛn na ɛtotoo Hamathene ne Arpadhene? Nsɛm bɛn nso na ɛtotoo Sefarwaim, Hena ne Iwa ahemfo?”
౧౩హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు.
14 Hesekia nsa kaa krataa a abɔfo no de bae no, ɔkenkanee. Afei ɔforo kɔɔ Awurade asɔredan no mu kɔtrɛw mu wɔ Awurade anim.
౧౪హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,
15 Na Hesekia bɔɔ mpae kyerɛɛ Awurade se, “Asafo Awurade, Israel Nyankopɔn a wɔasi wo hene wɔ Kerubim ntam. Wo nko ara na woyɛ Onyankopɔn wɔ asase so ahenni nyinaa so. Wo na wobɔɔ ɔsoro ne asase.
౧౫యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.
16 Brɛ wʼaso ase, Awurade, na tie! Bue wʼani, Awurade, na hwɛ. Tie nsɛm a Sanaherib asoma de abɛsopa Onyankopɔn teasefo no.
౧౬యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.
17 “Awurade, ɛyɛ nokware sɛ Asiria ahemfo asɛe aman yi nyinaa, sɛnea nkra no ka no.
౧౭యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి
18 Na wɔatow anyame a wɔwɔ saa aman yi so no agu gya mu, ahyew wɔn, efisɛ wɔnyɛ anyame, na mmom wɔyɛ nnua ne abo a nnipa de wɔn nsa ayɛ.
౧౮వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.
19 Afei, Awurade, yɛn Nyankopɔn, gye yɛn fi ne tumi ase, na ɛbɛma ahenni a ɛwɔ asase so nyinaa ahu sɛ wo nko ara, Awurade, na woyɛ Onyankopɔn.”
౧౯యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.
20 Na Amos babarima Yesaia de saa nkra yi kɔmaa Hesekia se, “Sɛɛ na Awurade, Israel Nyankopɔn se: Esiane sɛ woabɔ me mpae afa Asiriahene Sanaherib ho nti,
౨౦అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.
21 eyi ne asɛm a Awurade aka atia no: “‘Ɔbabeabun Sion sopa wo, na ɔserew wo. Ɔbabea Yerusalem di wo ho fɛw, na ɔwosow ne ti bere a woreguan.
౨౧అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
22 Hena na wugye di sɛ woyeyaw no, di ne ho fɛw nso? Hena na womaa wo nne so tiaa no na wohwɛɛ no ahantan so? Ɛyɛ Israel ɔkronkronni no!
౨౨నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు?
23 Wonam wʼasomafo so adi Awurade ho fɛw. Na woaka se, “Me nteaseɛnam dodow nti maforo mmepɔw atenten. Yiw Lebanon mmepɔw a ɛwoware pa ara no. Matwitwa ne sida dua atenten no, ne nʼapepaw a ɛyɛ fɛ no agu fam. Madu ne mmepɔw a ɛwɔ akyirikyiri no so, ne ne kwaeberentuw mu.
౨౩ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.
24 Matutu mmura wɔ ahɔho nsase bebree so de ne nsu pa no adwudwo me ho. Mpo, mepaee Misraim nsubɔnten mu sɛnea mʼakofo betumi atwa!”
౨౪నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను.
25 “‘Na Montee ɛ? Bere tenten a atwam, na mehyɛ too hɔ. Bere bi a atwam no na medwenee ho; afei mama aba mu sɛ, moadan ɔman a mosɛe nkuropɔn a wɔabɔ ho ban.
౨౫నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.
26 Wɔn nkurɔfo a tumi afi wɔn nsa no ho adwiriw wɔn, na animguase aka wɔn. Wɔte sɛ afuw so nnua, ne afifide foforo a ɛyɛ mmrɛw. Wɔte sɛ sare a efifi ɔdan atifi a ɛhyew ansa na anyin.
౨౬కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
27 “‘Nanso minim nea wote bere a woba ne bere a wokɔ ne sɛnea wo bo huru tia me.
౨౭నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు.
28 Na esiane sɛ wo bo huru tia me na wʼahantan adu mʼasom nti, mede me darewa bɛhyɛ wo hwenem, na mede akwankyerɛ dade ahyɛ wʼanom, mɛma wo afa ɔkwan a wofaa so bae no so asan wʼakyi.’
౨౮నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.
29 “Eyi na ɛbɛyɛ nsɛnkyerɛnne ama wo, Hesekia: “Saa afe yi wubedi nea ɛno ankasa fifii. Afe a ɛto so abien no, wubedi nea efi mu ba. Nanso afe a ɛto so abiɛsa no de, wo ara dua na twa, yɛ bobe nturo na di so aba.
౨౯హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు.
30 Bio, nkae bi a ofi Yuda fi begye ntin wɔ fam na wasow aba wɔ soro.
౩౦యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.
31 Na nkae bi befi Yerusalem aba, na nkae dɔm afi Bepɔw Sion so. Asafo Awurade pɛ mu na eyi bɛyɛ.
౩౧ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
32 “Eyi ne asɛm a Awurade ka fa Asiriahene ho: “Ɔrenhyɛn saa kuropɔn yi mu na ɔrentow bɛmma wɔ ha. Ɔremfa nkatabo mmegyina kuropɔn no akyi na ɔrensi pie ntua nʼano.
౩౨కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
33 Ɔhene no kwan a ɔfaa so bae no ara so na ɔbɛsan afa akɔ nʼankasa man mu. Awurade ka se, ɔrenwura saa kurow yi mu.
౩౩ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు.
34 Esiane mʼankasa mʼanuonyam ne mʼakoa Dawid nti, mɛbɔ ho ban.”
౩౪నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
35 Saa anadwo no, Awurade bɔfo kɔɔ Asiria nsraban mu, kokum Asiria asraafo no mpem ɔha aduɔwɔtwe anum. Asiriafo a wɔkae no nyan anɔpa no, wohuu sɛ afunu gugu mmɔnten so baabiara.
౩౫ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.
36 Na Asiriahene Sanaherib gyaee ɔko no, kɔɔ nʼankasa nʼasase so. Ɔkɔtenaa nʼahenkurow Ninewe mu.
౩౬అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు.
37 Da koro bi a ɔresom wɔ ne nyame Nisrok abosonnan mu no, ne mmabarima Adramelek ne Sareser de wɔn afoa kokum no. Woguan fii hɔ kɔtenaa Ararat asase so, na ne babarima foforo Esarhadon bedii nʼade sɛ Asiriahene.
౩౭అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.