< 2 Beresosɛm 31 >
1 Afahyɛ no twaa mu no, Israelfo a wɔkɔɔ bi no kɔɔ Yuda, Benyamin, Efraim ne Manase nkurow nyinaa so, kɔsɛee afadum kronkron no, twitwaa Asera nnua no, yiyii abosonsomfo nsɔree so ne afɔremuka no. Eyi akyi, Israelfo no san kɔɔ wɔn nkurow so ne wɔn afi mu.
౧ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.
2 Hesekia kyekyɛɛ asɔfo no ne Lewifo no mu akuwakuw, sɛ wɔmmɔ ɔhyew afɔre ne asomdwoe afɔre, sɛ wɔnsom, na wɔmfa aseda ne nkamfo mma Awurade wɔ Asɔredan no apon ano.
౨హిజ్కియా యాజకులకూ, లేవీయులకూ వారి వారి సేవాధర్మం ప్రకారం, వారి వారి వరసలు నియమించాడు. దహనబలులూ సమాధాన బలులూ, శాంతి బలులూ అర్పించడానికీ, ఇతర సేవలూ చేయడానికీ యెహోవా మందిర గుమ్మాల దగ్గర కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికీ, స్తుతులు చెల్లించడానికీవారిని నియమించాడు.
3 Ɔhene no ankasa fii nea ɔwɔ mu maa anɔpa ne anwummere, nnaawɔtwe homeda afahyɛ ne Ɔsram Foforo Afahyɛ no ne afirihyia afɔre a aka no ɔhyew afɔrebɔde, sɛnea wɔakyerɛw wɔ Awurade Mmara no mu no.
౩యెహోవా ధర్మశాస్త్రంలో రాసినట్టుగా ఉదయ సాయంత్రాలు అర్పించవలసిన దహనబలుల కోసం విశ్రాంతిదినాలకూ, అమావాస్యలకూ నియామక కాలాలకూ అర్పించవలసిన దహనబలుల కోసం తన సొంత ఆస్తిలోనుంచి రాజు ఒక భాగాన్ని ఏర్పాటు చేశాడు.
4 Ɔhyɛɛ sɛ nnipa a wɔwɔ Yerusalem no mfa nea wonya mu kyɛfa a mmara no ka no bɛma asɔfo no ne Lewifo no, sɛnea ɛbɛma wɔde wɔn ho nyinaa ahyɛ Awurade Mmara no mu.
౪యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం యాజకులూ, లేవీయులూ తమ పని శ్రద్ధగా జరుపుకొనేలా, వారికి చెందవలసిన భాగం ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు అతడు ఆజ్ఞాపించాడు.
5 Nnipa no tiee no aso pa mu, na wofi koma pa mu de atoko, nsa foforo, ngo, ɛwo ne wɔn nnɔbae nkae mu nea edi kan nyinaa bae. Wɔde wɔn ahode biara mu ntotoso du du bae.
౫ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.
6 Nnipa a wotu fii Israel baa Yuda no ne Yudafo no ankasa de wɔn anantwi ne wɔn nguan so ntotoso du du ne nneɛma a wɔahyira so ama Awurade, wɔn Nyankopɔn no so ntotoso du du bae. Wɔboaa ano ma ɛyɛɛ akuw akɛseakɛse.
౬యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇశ్రాయేలువారు, యూదావారు ఎద్దులు గొర్రెల్లో పదవవంతు, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో పదవ వంతు తీసుకు వచ్చి కుప్పలుగా పోశారు.
7 Wɔde saa ntotoso du du a edi kan no baa ɔsram a ɛto so abiɛsa no awiei mu, na nneɛma no anoboa kɔɔ so kosii ɔsram a ɛto so ason no mfiase mu.
౭వారు మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టి ఏడవ నెలలో ముగించారు.
8 Bere a Hesekia ne ne mpanyimfo behuu nneɛma no dodow no, wɔdaa Awurade ne ne nkurɔfo Israel ase.
౮హిజ్కియా, అతని అధికారులూ వచ్చి ఆ కుప్పలను చూసి యెహోవాను స్తుతించి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను దీవించారు.
9 Hesekia bisaa asɔfo no ne Lewifo no se, “Ɛhe na eyinom nyinaa fi bae?”
౯హిజ్కియా ఆ కుప్పలను గురించి యాజకులను లేవీయులను ప్రశ్నించాడు. సాదోకు సంతతివాడు ప్రధానయాజకుడైన అజర్యా అతనికి ఇలా జవాబిచ్చాడు.
10 Na ɔsɔfopanyin Asaria a ofi Sadok abusua mu buae se, “Efi bere a ɔmanfo fii ase sɛ wɔde akyɛde reba Awurade Asɔredan mu no, yɛanya bebree a yebedi ama bi aka, efisɛ Awurade ahyira ne nkurɔfo.”
౧౦“యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”
11 Hesekia yɛɛ nʼadwene sɛ obenya adekoradan wɔ Awurade Asɔredan no mu, na wɔyɛe.
౧౧హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచాలని ఆజ్ఞ ఇచ్చాడు.
12 Na wodii nokware de akyɛde no ne ntotoso du du no nyinaa baa Asɔredan no mu. Wɔde hyɛɛ Lewini Kenania nsa maa ne nua Simei yɛɛ ne boafo.
౧౨తరువాత వారు కానుకలనూ పదవ భాగాలనూ ప్రతిష్ట చేసిన వస్తువులనూ నమ్మకంగా లోపలకు తెచ్చారు. లేవీయుడైన కొనన్యా వాటికి నిర్వహణాధికారి. అతని సోదరుడైన షిమీ అతనికి సహకారి.
13 Na Yehiel, Asasia, Nahat, Asahel, Yerimot, Yosabad, Eliel, Ismakia, Mahat ne Benaia yɛ wɔn a wɔhwɛ hɔ no aboafo. Ɔhene Hesekia ne Asaria a na ɔyɛ wɔn a na wɔhwɛ Onyankopɔn Asɔredan no mu so panyin no na wɔkyekyɛɛ saa dibea ahorow yi.
౧౩యెహీయేలు, అజజ్యా, నహతు. అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యా, మహతు, బెనాయా అనేవారు కొనన్యా చేతి కింద, అతని సోదరుడు షిమీ చేతి కింద తనిఖీ చేసేవారుగా ఉన్నారు. రాజైన హిజ్కియా దేవుని మందిరానికి అధికారిగా ఉన్న అజర్యా వారిని నియమించారు.
14 Lewini Yimna babarima Kore a ɔyɛ Apuei Pon ano hwɛfo no na wɔde hyɛɛ ne nsa sɛ ɔnkyekyɛ Onyankopɔn ayamye afɔrebɔde a ɛyɛ akyɛde ne nneɛma a wɔde ama Awurade no.
౧౪తూర్పువైపు గుమ్మం దగ్గర పాలకుడూ లేవీయుడైన ఇమ్నా కొడుకు కోరే, దేవునికి సమర్పించిన స్వేచ్ఛార్పణల మీద అధికారి. ప్రజలు యెహోవాకు తెచ్చిన కానుకలనూ ప్రతిష్టిత వస్తువులనూ పంచిపెట్టడం అతని పని.
15 Nʼaboafo nokwafo no ne Eden, Miniamin, Yesua, Semaia, Amaria ne Sekania. Na wɔkyekyɛɛ nneɛma no maa asɔfo mmusua a wɔwɔ wɔn nkurow so sɛnea wɔn nkyekyɛmu te, na wɔkyɛɛ nneɛma no pɛpɛɛpɛ maa mmofra ne mpanyin.
౧౫అతని చేతి కింద ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా, షెకన్యా అనేవారున్నారు. వారు నమ్మకమైనవారు కాబట్టి యాజకుల పట్టణాల్లో ప్రముఖులనీ సామాన్యులనీ తేడా లేకుండా తమ సోదరులకు వరస క్రమాల ప్రకారం వారి భాగాలను పంచిపెట్టడానికి వారిని నియమించారు.
16 Na wɔkyɛɛ mmarimaa a wɔadi mfe abiɛsa rekɔ nyinaa akyɛde no bi a wɔn din wɔ wɔn anato nhoma mu, na da biara wɔkɔ Awurade Asɔredan mu, kɔyɛ wɔn nnwuma a wɔde ahyɛ wɔn kuw no nsa no.
౧౬అంతేకాక మూడేళ్ళు మొదలు అంతకు పైవయసుండి వంశవృక్షాల్లో నమోదైన మగపిల్లలకు కూడా వంతుల ప్రకారం పంచిపెట్టారు. వారి వారి వరసల ప్రకారం బాధ్యతల ప్రకారం సేవచేయడానికి ప్రతిరోజూ యెహోవా మందిరంలోకి వచ్చేవారందరికీ పంచిపెట్టారు.
17 Na wɔkyɛɛ nneɛma no maa asɔfo a wɔakyerɛw wɔn din wɔ wɔn anato nhoma mu ne Lewifo a wɔadi mfe aduonu ne nea ɛboro saa, a wɔahyehyɛ wɔn din sɛnea wɔn nnwuma ne wɔn nkyekyɛmu te no.
౧౭ఇరవై ఏళ్ళు మొదలు అంతకు పై వయసుండి వంతుల ప్రకారం సేవచేయడానికి తమ తమ పూర్వీకుల వంశాల ప్రకారం యాజకుల్లో సరిచూడబడిన లేవీయులకు పంచిపెట్టారు.
18 Na wɔmaa abusuafo a wɔakyerɛw wɔn din wɔ anato nhoma mu a nkokoaa, ɔyerenom ne mmabarima ne mmabea nso ka ho nnuan. Efisɛ na wɔadi nokware adwira wɔn ho.
౧౮అంటే నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకునిన లేవీయులకు తమ పిల్లలతో భార్యలతో కొడుకులతో కూతుర్లతో
19 Na asɔfo, Aaron asefo a na wɔtete nkuraa a atwa nkurow no ho ahyia no anaa nkurow no mu no de, woyiyii nnipa ma wɔkyɛɛ ɔbarima biara a ɔfra asɔfo no mu ne Lewifo a wɔakyerɛw wɔn din anato mu no nneɛma no bi.
౧౯సమాజమంతా సరిచూడబడినవారికి, ఆ యా పట్టణాలకు చేరిన గ్రామాల్లో ఉన్న అహరోను వంశస్థులైన యాజకులకు, వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు. పేరుల ప్రకారం చెప్పబడిన ఆ ప్రజలు యాజకుల్లో పురుషులందరికి, లేవీయుల్లో వంశాల ప్రకారం సరిచూడబడిన వారందరికి వంతులు ఏర్పరచడానికి వారిని నియమించారు.
20 Saa ɔkwan yi so na Hesekia fa kyɛɛ nneɛma wɔ Yudaman no mu nyinaa, na ɔyɛɛ nea ɛfata na ɛsɔ Awurade, ne Nyankopɔn ani.
౨౦హిజ్కియా యూదా దేశమంతటా ఇలా జరిగించాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా యధార్థంగా నమ్మకం గా ప్రవర్తించాడు.
21 Nea Hesekia yɛɛ nyinaa de som wɔ Onyankopɔn Asɔredan no mu, ne mmɔden a ɔbɔɔ sɛ obedi ne mmara ne nʼahyɛde so no, ɔde ne koma nyinaa hwehwɛɛ ne Nyankopɔn. Ne saa nti, ɛma onyaa nkɔso bebree.
౨౧దేవుని మందిర సేవకోసం, ధర్మశాస్త్రం కోసం, ఆజ్ఞల కోసం మొదలుపెట్టిన ప్రతి పనిలో అతడు తన దేవుణ్ణి వెతికి అనుసరించాడు. హృదయపూర్వకంగా అనులు జరిగించాడు గనక వర్ధిల్లాడు.