< 2 Beresosɛm 10 >
1 Rehoboam kɔɔ Sekem, efisɛ na Israel nyinaa ahyia hɔ sɛ wɔrebesi no hene.
౧రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు.
2 Bere a Nebat babarima Yeroboam tee sɛ Salomo awu no, ofi Misraim bae, efisɛ oguan fii ɔhene Salomo nsam kɔtenaa Misraim.
౨సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు.
3 Israel mpanyimfo soma ma wɔkɔfaa Yeroboam, na ɔne Israel nyinaa kɔɔ sɛ wɔne Rehoboam rekɔkasa.
౩ప్రజలు అతణ్ణి పిలిపించగా యరొబాము, ఇశ్రాయేలువారు కలిసి వచ్చి రెహబాముతో “నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు.
4 Wɔkae se, “Wʼagya hyɛɛ yɛn ma yɛyɛɛ adwumaden. Yɛsrɛ wo, tew saa adwumaden ne sonkahiri adesoa duruduru a wʼagya de soaa yɛn no so. Woyɛ saa a, yɛbɛsom wo nokware mu.”
౪నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము” అని మనవి చేశారు.
5 Rehoboam buae se, “Momma me nnansa na menwene mo asɛm yi ho. Ɛno akyi, mommra mmegye me mmuae.” Enti nnipa no san kɔe.
౫అందుకు అతడు “మీరు మూడు రోజుల తరవాత నా దగ్గరికి రండి” అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.
6 Na Ɔhene Rehoboam kɔɔ ne mpanyimfo bi a na wotu nʼagya Salomo fo ne wɔn kosusuw asɛm no ho. Obisaa wɔn se, “Moka asɛm no ho dɛn? Mmuae bɛn na memfa mma saa nnipa yi?”
౬అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి “ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?” అని వారిని అడిగాడు.
7 Mpanyimfo yi buae se, “Sɛ woyɛ nnipa no yiye, na woyɛ ayamye kyerɛ wɔn ma ɛsɔ wɔn ani a, wɔn nso bɛyɛ wo nkurɔfo nokwafo.”
౭అందుకు వారు “నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని అతనితో చెప్పారు.
8 Nanso Rehoboam amfa afotu a mpanyimfo no maa no no. Mmom, ɔkɔɔ nʼatipɛnfo mmabun bi a ɔne wɔn sii so a na wotu no fo no nkyɛn.
౮అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు.
9 Obisaa wɔn se, “Mo nso mo adwene ne dɛn? Mmuae bɛn na memfa nkɔma nnipa a wɔpɛ sɛ metew adesoa a mʼagya de soaa wɔn no so?”
౯అతడు “‘నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి’ అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి” అని వారిని అడిగాడు.
10 Mmerante no buae se, “Asɛm a ɛsɛ sɛ woka kyerɛ wɔn ne se, ‘Me nsateaa ketewa no mu piw sen mʼagya asen mu. Na sɛ modwene sɛ na ɔyɛ den wɔ mo so a, montwɛn na mubehu sɛnea mete.’
౧౦అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు.
11 Yiw, na mʼagya yɛ den wɔ mo so, nanso me de, mɛyɛ nea ɛkyɛn saa. Sɛ mʼagya kaa mo mpire a, me de, mede nkekantwɛre na ɛbɛhwe mo.”
౧౧నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను’ అని చెప్పు.”
12 Nnansa akyi no, Yeroboam ne nnipa no nyinaa san baa sɛ wɔrebetie Rehoboam mmuae sɛnea ɔkae no.
౧౨“మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి” అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు.
13 Na Rehoboam de ahantan kasa kyerɛɛ wɔn. Wamfa mpanyimfo no afotu,
౧౩రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు.
14 na ɔfaa mmerante no afotu. Ɔka kyerɛɛ nnipa no se, “Na mʼagya ma moyɛ adwumaden, na me de, mɛkyɛn saa! Sɛ mʼagya kaa mo mpire a, me de, mede nkekantwɛre na ɛbɛhwe mo!”
౧౪అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను దాన్ని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను” అని చెప్పాడు.
15 Enti ɔhene no anyɛ nnipa no abisade no ho hwee. Saa nsɛm a esisii yi yɛ Onyankopɔn nhyehyɛe, efisɛ ɛmaa Awurade nkɔm a ɔnam odiyifo Ahiya a ofi Silo no hyɛɛ Nebat babarima Yeroboam no baa mu.
౧౫యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు.
16 Bere a Israel huu sɛ ɔhene no anyɛ wɔn abisade amma wɔn no, wɔteɛteɛɛ mu se, “Dawid ne nʼadedi ntoaso no mfa wɔn ho. Yɛne Yisai babarima no nni twaka biara. Israel, momma yɛnkɔ yɛn afi. Dawid, kɔhwehwɛ wʼankasa wo fi.” Enti Israel nyinaa san kɔɔ fie.
౧౬రాజు తమ మనవి అంగీకరించక పోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, “దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదూ, నీ సంతతి వారిని నువ్వే చూసుకో” అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్లిపోయారు.
17 Na Rehoboam kɔɔ so dii Israelfo a na wɔtete Yuda nkurow so no so hene.
౧౭అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు.
18 Ɔhene Rehoboam somaa Hadoram a na ɔhwɛ adwumayɛfo so no sɛ ɔnkɔhwɛ mma ɔman no nyɛ dinn, nanso Israelfo no siw no abo kum no. Bere a ɔhene Rehoboam tee saa asɛm no, ntɛm ara, ohuruw tenaa ne teaseɛnam mu, guan kɔɔ Yerusalem.
౧౮రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరకి పంపించాడు. కానీ వారు అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు.
19 Israel mmusuakuw a wɔwɔ atifi fam no ampene sɛ Dawid aseni biara bedi wɔn so, de besi nnɛ.
౧౯ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు.