< 1 Samuel 5 >
1 Filistifo no faa Onyankopɔn Apam Adaka no akyi, wɔmaa so fii Ebeneser akono hɔ kɔɔ kuropɔn Asdod mu.
౧ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు.
2 Wɔsoaa Onyankopɔn Apam Adaka no kɔɔ Dagon abosonnan mu. Wɔde kosii ohoni Dagon nkyɛn.
౨వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు.
3 Nanso ade kyee a Asdod kurowmma no kɔhwɛe no, na Dagon ahwe fam wɔ Awurade Apam Adaka no anim a nʼanim butuw fam. Enti wɔmaa ohoni no so gyinaa hɔ bio.
౩అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు.
4 Nanso ade kyee anɔpa no, na asɛm koro no ara asi bio. Na Dagon no ahwe fam wɔ Awurade Apam Adaka no anim a nʼanim butuw fam. Saa bere yi de, na ne ti ne ne nsa abubu afi so deda ɔpon ano. Ne sin no na na aka da hɔ a ammubu.
౪ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.
5 Ɛno nti na ebesi nnɛ yi, Dagon asɔfo anaa obiara a obewura abosonnan mu hɔ no ntia aponnua no so no.
౫అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు.
6 Na Awurade maa pɔmpɔ bobɔɔ Asdodfo ne ne mpɔtam hɔfo no.
౬యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు.
7 Bere a Asdodfo huu asɛm a aba no, wɔkae se, “Yɛrentumi mma Onyankopɔn Apam Adaka no ntena yɛn nkyɛn. Otia yɛn! Ɔbɛsɛe yɛn ne yɛn nyame, Dagon nyinaa.”
౭అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు.
8 Enti wɔfrɛɛ Filistifo nkuropɔn anum mu asodifo nyinaa bisaa wɔn se, “Dɛn na yɛnyɛ Israel Nyankopɔn Apam Adaka yi?” Asodifo no susuw asɛm no ho na wobuae se, “Momfa Israel Nyankopɔn Apam Adaka no nkɔ Gat.” Enti wɔde Onyankopɔn Apam Adaka no kɔɔ Gat.
౮కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని అడిగారు. అందుకు పెద్దలు “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు.
9 Nanso Bere a Onyankopɔn Apam Adaka no duu Gat no, Awurade maa pɔmpɔ bobɔɔ kurow no mufo, mpanyin ne mmofra, na wosuroo yiye.
౯వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి.
10 Enti wɔde Onyankopɔn Apam Adaka no kɔɔ Ekron kuropɔn mu, na wɔde rewura hɔ no, Ekronfo no suu se, “Wɔde Israel Nyankopɔn Apam Adaka no reba yɛn nkyɛn de abekunkum yɛn nso.”
౧౦వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు.
11 Enti nnipa no frɛɛ Filistifo asodifo no nyinaa, srɛɛ wɔn se, “Monsan mfa Onyankopɔn Apam Adaka no mfi ha nkɔ ne man mu, anyɛ saa a, ebekunkum yɛn nyinaa.” Saa bere no na ɔyaredɔm a efi Onyankopɔn nkyɛn no afi ase dedaw ama huboa abɛtɔ kuropɔn no so.
౧౧అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.
12 Wɔn a wɔanwuwu no, wɔmaa pɔmpɔ bobɔɔ wɔn. Na agyaadwotwa baa baabiara.
౧౨చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.