< 1 Samuel 4 >

1 Saa bere no, na Israelfo ne Filistifo reko. Israelfo nsraadɔm kyeree nsraban wɔ Ebeneser, na Filistifo nso kyeree nsraban wɔ Afek.
ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఎబెనెజరులో సమావేశమయ్యారు. ఫిలిష్తీయులు ఆఫెకులో ఉన్నారు.
2 Filistifo no tow hyɛɛ Israelfo nsraadɔm no so, dii wɔn so nkonim, na wokum nnipa mpem anan.
ఫిలిష్తీయులు బారులు తీరి నిలబడి ఇశ్రాయేలీయులపై యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి యుద్ధభూమిలోనే దాదాపు నాలుగు వేలమంది మరణించారు.
3 Ɔko no baa awiei, na Israel nsraadɔm no san kɔɔ wɔn nsraban mu hɔ no, Israel mpanyimfo no bisae se, “Adɛn nti na Awurade ama yɛadi nkogu nnɛ yi wɔ Filistifo anim yi? Momma yɛnkɔfa Awurade Apam Adaka no mfi Silo. Sɛ yɛde kɔ ɔsa a, ebegye yɛn afi yɛn atamfo nsam.”
ప్రజలు ఊరికి తిరిగి వచ్చాక ఇశ్రాయేలీయుల పెద్దలు “యెహోవా ఈ రోజు ఎందుకు మనలను ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయేలా చేశాడు? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొచ్చి మన మధ్యనే ఉంచుకుందాము. అది మన మధ్య ఉంటే మనలను శత్రువుల చేతిలో నుండి కాపాడుతుంది” అన్నారు.
4 Enti nnipa no somaa mmarima kɔɔ Silo, na wɔde Asafo Awurade a ɔte kerubim ntam Apam Adaka no bae. Saa bere no na Eli mmabarima baanu Hofni ne Pinehas ka wɔn a wɔsoaa Onyankopɔn Apam Adaka no kɔɔ akono hɔ no ho.
కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.
5 Bere a Israelfo no huu sɛ wɔde Awurade Apam Adaka no reba nsraban no mu no, wɔn nyinaa bɔɔ ose maa asase wosowee.
యెహోవా నిబంధన మందసాన్ని ప్రజల మధ్యకు తెచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా భూమి దద్దరిల్లి పోయేలా కేకలు వేశారు.
6 Filistifo no bisae se, “Dɛn na ɛrekɔ so yi? Dɛn osebɔ na ɛwɔ Hebrifo nsraban mu hɔ yi?” Wɔtee sɛ Awurade Apam Adaka no na abedu nsraban mu hɔ no,
ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల గుంపులో ఈ గొప్ప కేకలు ఏమిటో అని ఆరా తీసి, యెహోవా నిబంధన మందసాన్ని శిబిరంలోకి తెచ్చారని తెలుసుకున్నారు.
7 wosuroe. Na wɔkae se, “Anyame no aba wɔn nsraban mu hɔ. Ɛno de, asɛm ato yɛn! Yenhyiaa asɛm a ɛte sɛɛ bi da.
వారు భయపడి, దేవుడు శిబిరంలోకి వచ్చాడనుకుని “అయ్యో, ఇక మనకి మూడింది. ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు,
8 Hena na obegye yɛn afi saa Israel anyame atumfo yi nsam? Wɔne anyame a wɔde owu ɔyare ahorow nyinaa bi sɛee Misraimfo, bere a Israelfo wɔ sare so hɔ no.
అయ్యో, మహాశూరుడైన ఈ దేవుడి చేతిలోనుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో రకరకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తు వారిని సంహరించిన దేవుడు ఈయనే గదా.
9 Monyere mo ho, Filistifo! Munnyina sɛ mmarima; anyɛ saa a, Hebrifo no bɛfa mo nkoa sɛnea wɔyɛɛ yɛn nkoa no.”
ఫిలిష్తీయులారా, వారు మన ముందు ఓడిపోయి దాసులు అయినట్టు మనం ఈ హెబ్రీయులకి దాసులు కాకూడదు. మనమంతా ధైర్యంగా నిలబడి బలం తెచ్చుకుని యుద్ధం చేద్దాం” అని చెప్పుకున్నారు.
10 Enti Filistifo no koe anibere so, dii Israelfo no so bio. Wɔn a wokunkum wɔn no dɔɔso. Israelfo mpem aduasa na wokunkum wɔn da no. Wɔn a wonyaa wɔn ti didii mu no guan kɔɔ wɔn ntamadan mu.
౧౦ఫిలిష్తీయులు యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ పారిపోయి తమ డేరాలకు తిరిగి వచ్చారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయుల్లో 30 వేలమంది సైనికులు చనిపోయారు.
11 Wɔfaa Onyankopɔn Apam Adaka no, na wokunkum Eli mmabarima baanu no, Hofni ne Pinehas.
౧౧శత్రువులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏలీ కొడుకులు హొఫ్నీ, ఫీనెహాసు ఇద్దరినీ చంపేశారు.
12 Da no ara, ɔbarima bi fi Benyamin abusua mu guan fii akono hɔ beduu Silo. Na watetew ne ntade mu, de mfutuma ahura ne ti mu, de kyerɛ nʼawerɛhow.
౧౨ఆ రోజు బెన్యామీను గోత్రానికి చెందిన ఒకడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకొంటూ, చినిగిన బట్టలతో, తలంతా దుమ్ము కొట్టుకుపోయి షిలోహుకు వచ్చాడు.
13 Na Eli retwɛn wɔ kwankyɛn baabi, pɛ sɛ ɔte ɔko no mu nsɛm, efisɛ na ne bo ntɔ ne yam koraa wɔ Onyankopɔn Apam Adaka no ho. Ɔbɔfo no ba bɛkaa asɛm a asi no, wɔtee nteɛteɛmu bi wɔ kurow no mu nyinaa.
౧౩అతడు వచ్చినప్పుడు ఏలీ దారి పక్కన కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందసం విషయం అతనికి గుండె బద్దలౌతూ ఉంది. ఆ వ్యక్తి నగరంలోకి సమాచారం తెచ్చినప్పుడు అంతా కేకలు వేశారు.
14 Eli bisae se, “Saa nteɛteɛmu yi ase ne dɛn?” Ɔbɔfo no yɛɛ ntɛm kɔɔ Eli,
౧౪ఏలీ ఆ కేకలు విని “ఈ కేకల శబ్దం ఏమిటి?” అని అడిగాడు. ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు.
15 a na wadi mfe aduɔkron awotwe na nʼani afura no nkyɛn.
౧౫అప్పుడు ఏలీ వయసు తొంభై ఎనిమిదేళ్లు. అతనికి చూపు మందగించి కళ్ళు కనిపించడం లేదు.
16 Ɔka kyerɛɛ Eli se, “Mprempren ara na mifi akono hɔ bae. Nnɛ yi ara, na mewɔ hɔ.” Eli bisae se, “Na ekosii dɛn?”
౧౬ఆ వ్యక్తి “యుద్ధంలో నుండి వచ్చినవాణ్ణి నేనే, ఈ రోజు యుద్ధంలో నుండి పారిపోయి వచ్చాను” అని ఏలీతో చెప్పాడు. ఏలీ “నాయనా, అక్కడ ఏమి జరిగింది?” అని అడిగాడు.
17 Ɔbɔfo no buae se, “Israelfo adi nkogu. Israel nsraadɔm no mpem mpem atotɔ wɔ akono hɔ. Afei, wo mmabarima baanu a ɛyɛ Hofni ne Pinehas no nso awuwu, na Onyankopɔn Apam Adaka no nso, wɔafa.”
౧౭అందుకు అతడు “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. జనంలో చాలామంది చనిపోయారు. హొఫ్నీ, ఫీనెహాసు అనే నీ ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకున్నారు” అని చెప్పాడు.
18 Ɔbɔfo no kaa Onyankopɔn Apam Adaka no ho asɛm ara pɛ, Eli fi akongua a ɔte so mu wɔ abɔntenpon ho no te hwee nʼakyi. Ne kɔn mu bui, efisɛ na wabɔ akwakoraa a ne mu nso yɛ duru. Na wadi Israel anim mfirihyia aduanan.
౧౮దేవుని మందసం విషయం అతడు చెప్పగానే ఏలీ గుమ్మం దగ్గర ఉన్న ఆసనం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, స్థూల కాయుడు. అతడు నలభై ఏళ్లు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధికారిగా ఉన్నాడు.
19 Saa bere no na nʼasebea a ɔyɛ Pinehas yere anyinsɛn a ɔreyɛ awo. Ɔtee sɛ wɔafa Onyankopɔn Apam Adaka no, na nʼase ne ne kunu awuwu no, awo kaa no amono mu hɔ ara.
౧౯నెలలు నిండి ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న ఏలీ కోడలు ఫీనెహాసు భార్య శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకున్నారనీ, తన మామ, భర్త చనిపోయారనీ విని, నొప్పులు ఎక్కువై మోకాళ్ల మీద కూలబడి అక్కడే ప్రసవించింది.
20 Owuu wɔ awoko mu, nanso ansa na ɔrebewu no, mmea a wɔregye no awo no kae se, “Mpa abaw; woawo abarimaa.” Nanso wammua wɔn na wankasa wɔn ho nso.
౨౦ఆమె చనిపోతుండగా అక్కడ నిలబడిన స్త్రీలు ఆమెతో “భయపడకు, నీకు కొడుకు పుట్టాడు” అని చెప్పారు. ఆమె ఎలాంటి మాటా చెప్పలేదు. ఏమీ పట్టించుకోలేదు.
21 Ɔbesebesee nʼano too abarimaa no din Ikabod, “Anuonyam no wɔ he, Israel anuonyam no asa,” efisɛ wɔafa Onyankopɔn Apam Adaka no na nʼase ne ne kunu nso awuwu.
౨౧ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని “ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది.
22 Ɔkae se, “Anuonyam afi Israel mu, efisɛ wɔafa Onyankopɔn Apam Adaka no.”
౨౨“శత్రువులు దేవుని మందసాన్ని పట్టుకోవడం వలన ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని ఆమె అంది.

< 1 Samuel 4 >