< 1 Ahemfo 5 >
1 Na Tirohene Huram yɛ ɔhene Dawid adamfo nokwafo, enti bere a ɔtee sɛ wɔasra Salomo ngo sɛ ɔhene sɛ onni nʼagya Dawid ade no, ɔsomaa nʼasomafo kɔɔ Salomo nkyɛn, kɔmaa no tirinkwa.
౧తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు.
2 Salomo de saa nkra yi maa sɛ wɔnsan mfa nkɔma Huram:
౨అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు.
3 “Wo ara wunim sɛ mʼagya Dawid antumi ansi asɔredan anhyɛ Awurade ne Nyankopɔn din anuonyam, esiane akokoakoko a ɔne aman a wɔatwa ne ho ahyia no dii nti. Wantumi anyɛ kosii sɛ Awurade de nʼatamfo hyɛɛ nʼanan ase.
౩“యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి.
4 Nanso mprempren, Awurade, me Nyankopɔn ama me ahotɔ wɔ afa nyinaa, minni ɔtamfo biara na biribiara rekɔ yiye.
౪తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు.
5 Ne saa nti, mayɛ adwene sɛ mesi asɔredan ama Awurade, me Nyankopɔn sɛnea Awurade ka kyerɛɛ mʼagya Dawid se me na mɛyɛ no. ‘Wo ba a mede no bɛtena ahengua so, asi wʼanan mu no besi asɔredan ahyɛ me din anuonyam.’
౫కాబట్టి ‘నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు’ అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను.
6 “Ɛno nti, hyɛ ma wonkotwa sida a efi Lebanon mmrɛ me. Me mmarima ne wo mmarima bɛyɛ adwuma, na akatua biara a wubegye ama wɔn no, metua. Wo ara wunim sɛ, obiara nkyɛn Sidonfo wɔ nnuabu mu.”
౬లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా.
7 Bere a Huram tee Salomo nkra no, nʼani sɔɔ yiye kae se, “Ayeyi nka Awurade nnɛ, efisɛ wama Dawid ɔba nyansafo sɛ ommedi saa ɔman kɛse Israel yi so.”
౭మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను” అన్నాడు. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి “ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక” అన్నాడు.
8 Enti Huram de nkra kɔmaa Salomo se, “Me nsa aka nkra a wode brɛɛ me no, na mɛyɛ wʼabisade a ɛfa nnua no ho no. Metumi de sida nnua ne ɔpepaw nnua abrɛ wo.
౮అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ “నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను.
9 Mʼasomfo de nnua no befi Lebanon mmepɔw so aba Po Kɛse so, na mɛma atentɛn afa po ani sɛnea wɔde ayɛ ɔkorow no, de akɔ baabiara a wobɛkyerɛ. Ɛno akyi no, yɛbɛsan mu na yɛde nnua no abrɛ wo. Wobɛma me fifo aduan, sɛnea mehwehwɛ no.”
౯నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు” అన్నాడు.
10 Huram faa saa ɔkwan yi so maa Salomo sida ne ɔpepaw nnua sɛnea ɔpɛ,
౧౦హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానులను పంపించాడు.
11 na Salomo maa Huram fifo atoko tɔn 3,600 ne ngo kronkron galɔn 120,000.
౧౧సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4, 16, 350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.
12 Na Awurade maa Salomo nyansa a emu dɔ, sɛnea ɔhyɛɛ no bɔ no. Na Huram ne Salomo yɛɛ asomdwoe apam.
౧౨యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము, సొలొమోను సంధి చేసుకున్నారు, వారిద్దరి మధ్య శాంతి నెలకొంది.
13 Na ɔhene Salomo kyerɛw adwumayɛfo mpem aduasa a wofi Israel nyinaa din.
౧౩సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు.
14 Ɔsomaa wɔn akuwakuw kɔɔ Lebanon. Ɔsram biara mu, nnipa mpem du kɔ, sɛnea ɛbɛyɛ a, ɔbarima baako biara bedi ɔsram baako wɔ Lebanon, na wadi asram abien wɔ fie. Adoniram na na ɔhwɛ saa adwumayɛfo yi so.
౧౪అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు.
15 Salomo nso faa nnesoasoafo mpem aduɔson; faa abopaefo mpem aduɔwɔtwe fi bepɔw asase no so,
౧౫అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.
16 ne wɔn so sohwɛfo mpem ahaasa ne ahansia a wɔbɛhwɛ adwuma no so.
౧౬వీరంతా కాక సొలొమోను పనివారిపై 3, 300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు.
17 Ɔhene no hyɛ ma abotwafo no paee, twaa aboɔdemmo no, yiyii ho sɛnea wɔde bɛhyɛ Asɔredan no fapem.
౧౭రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి, చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు.
18 Mmarima a wofi Gebal kuropɔn mu boaa Salomo ne Huram adansifo no, ma wosiesiee nnua ne abo no maa Asɔredan no si.
౧౮ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పకారులు, గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు.