< 1 Beresosɛm 6 >
1 Na Lewi mmabarima yɛ: Gerson, Kohat ne Merari.
౧లేవి కొడుకులు గెర్షోను, కహాతు, మెరారీ.
2 Na Kohat asefo nso yɛ: Amram, Ishar, Hebron ne Usiel.
౨కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనే వాళ్ళు.
3 Na Amram mma yɛ: Aaron, Mose ne Miriam. Na Aaron mmabarima yɛ: Nadab, Abihu, Eleasar ne Itamar.
౩అమ్రాము కొడుకులు అహరోను, మోషే. కూతురు పేరు మిర్యాము. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
4 Eleasar woo Pinehas. Pinehas woo Abisua.
౪ఎలియాజరుకు ఫీనెహాసు పుట్టాడు. ఫీనెహాసుకు అబీషూవ పుట్టాడు.
5 Abisua woo Buki, na Buki woo Usi.
౫అబీషూవకు బుక్కీ పుట్టాడు. బుక్కీకి ఉజ్జీ పుట్టాడు.
6 Usi woo Serahia. Serahia woo Meraiot.
౬ఉజ్జీకి జెరహ్యా పుట్టాడు. జెరహ్యాకి మెరాయోతు పుట్టాడు.
7 Meraiot woo Amaria, na Amaria woo Ahitub.
౭మెరాయోతుకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
8 Ahitub woo Sadok, na Sadok woo Ahimaas.
౮అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి అహిమయస్సు పుట్టాడు.
9 Ahimaas woo Asaria. Asaria woo Yohanan.
౯అహిమయస్సుకి అజర్యా పుట్టాడు. అజర్యాకి యోహానాను పుట్టాడు.
10 Yohanan woo Asaria a ɔno na na ɔyɛ ɔsɔfopanyin wɔ asɔredan a Salomo sii wɔ Yerusalem no mu.
౧౦యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.
11 Asaria woo Amaria. Amaria woo Ahitub.
౧౧అజర్యాకి అమర్యా పుట్టాడు. అమర్యాకి అహీటూబు పుట్టాడు.
12 Ahitub woo Sadok. Sadok woo Salum.
౧౨అహీటూబుకి సాదోకు పుట్టాడు. సాదోకుకి షల్లూము పుట్టాడు.
13 Salum woo Hilkia. Hilkia woo Asaria.
౧౩షల్లూముకి హిల్కీయా పుట్టాడు. హిల్కీయాకి అజర్యా పుట్టాడు.
14 Asaria woo Seraia. Seraia woo Yehosadak.
౧౪అజర్యాకి శెరాయా పుట్టాడు. శెరాయాకి యెహోజాదాకు పుట్టాడు.
15 Wotwaa Yehosadak asu bere a Awurade de Yudafo ne Yerusalemfo kɔɔ nnommum mu a na wɔhyɛ Nebukadnessar ase no.
౧౫యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదావాళ్ళనూ యెరూషలేము వాళ్ళనూ చెరలోకి బందీలుగా తీసుకు వెళ్లినప్పుడు ఈ యెహోజాదాకు కూడా చెరలోకి వెళ్ళాడు.
16 Na Lewi mmabarima din de Gersom, Kohat ne Merari.
౧౬లేవి కుమారులు గెర్షోను, కహాతూ, మెరారీలు.
17 Na Libni ne Simei ka Gersom asefo ho.
౧౭గెర్షోను కొడుకులు లిబ్నీ, షిమీలు.
18 Na Amram, Ishar, Hebron ne Usiel ka Kohat asefo no ho.
౧౮కహాతు కొడుకులు అమ్రామూ, ఇస్హారూ, హెబ్రోనూ, ఉజ్జీయేలూ అనేవాళ్ళు.
19 Na Mahli ne Musi ka Merari asefo no ho. Eyinom ne Lewifo mmusua sɛnea wɔn mpanyimfo nnidiso te.
౧౯మెరారి కొడుకులు మహలీ, మూషి. పూర్వీకుల వంశావళి ప్రకారం లేవీయుల కుటుంబాలు ఏవంటే,
20 Na Gerson asefo yɛ: Libni, Yahat, Sima,
౨౦గెర్షోను కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు యహతు, యహతు కొడుకు జిమ్మా.
21 Yoa, Ido, Serah ne Yeaterai.
౨౧జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఇద్దో, ఇద్దో కొడుకు జెరహు, జెరహు కొడుకు యెయతిరయి.
22 Na Kohat asefo ne Aminadab, Kora, Asir,
౨౨కహాతు కొడుకుల్లో ఒకడు అమ్మీనాదాబు. ఇతని కొడుకు కోరహు, కోరహు కొడుకు అస్సీరు,
23 Elkana, Ebiasaf, Asir,
౨౩అస్సీరు కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కొడుకు అస్సీరు,
24 Tahat, Uriel, Usia ne Saulo.
౨౪అస్సీరు కొడుకు తాహెతు, తాహెతు కొడుకు ఊరియేలు, ఊరియేలు కొడుకు ఉజ్జియా, ఉజ్జియా కొడుకు షావూలు.
25 Na Elkana asefo ne: Amasai, Ahimot,
౨౫ఎల్కానా కొడుకులు అమాశై, అహీమోతు.
౨౬ఎల్కానా కొడుకుల్లో ఒకడు జోపై. జోపై కొడుకు నహతు,
27 Eliab, Yeroham, Elkana ne Samuel.
౨౭నహతు కొడుకు ఏలీయాబు, ఏలీయాబు కొడుకు యెరోహాము, యెరోహాము కొడుకు ఎల్కానా.
28 Na Samuel mmabarima din ne: Yoel a ɔyɛ ɔpanyin ne Abiya a ɔto so abien no.
౨౮సమూయేలు కొడుకులు ఎవరంటే, పెద్దవాడు యోవేలు, మరొకడు అబీయాయు.
29 Na Merari mma ne: Mahli, Libni, Simei, Usa,
౨౯మెరారి కొడుకుల్లో ఒకడు మహలి. మహలి కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు షిమీ. షిమీ కొడుకు ఉజ్జా.
30 Simea, Hagia ne Asaia.
౩౦ఉజ్జా కొడుకు షిమ్యా. షిమ్యా కొడుకు హగ్గీయా. హగ్గీయా కొడుకు అశాయా.
31 Dawid maa saa nnipa a wɔn din didi so yi dii Awurade fi nnwom anim, bere a wɔde Apam Adaka no sii hɔ no.
౩౧నిబంధన మందసాన్ని యెహోవా మందిరంలో ఉంచిన తరువాత మందిరంలో సంగీత సేవ కోసం దావీదు నియమించిన వాళ్ళు వీళ్ళే.
32 Wɔde nnwom kaa wɔn som ho wɔ Ahyiae Ntamadan no mu hɔ kosii sɛ Salomo sii Awurade asɔredan no wɔ Yerusalem. Afei, wɔnam mmara a wɔde maa wɔn so dii wɔn dwuma wɔ hɔ.
౩౨సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని నిర్మించే సమయంలో వీళ్ళు ప్రత్యక్ష గుడారం ఆవరణలో సంగీత సేవ చేస్తూ ఉన్నారు.
33 Saa mmarima yi na wɔne wɔn mma som wɔ hɔ no. Heman, dwom ho nimdefo no, na ofi Kohat abusua mu. Wɔto nʼabusua ana fi Yoel, Samuel,
౩౩ఈ విధంగా వీళ్ళు తమ కొడుకులతో కలసి పరిచర్య చేసినవాళ్ళు. కహాతీయుల కొడుకుల్లో గాయకుడైన హేమాను. ఇతను సమూయేలు కొడుకైన యోవేలుకి పుట్టాడు.
34 Elkana, Yeroham, Eliel, Yoa,
౩౪సమూయేలు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యెరోహాముకి పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకి పుట్టాడు. ఎలీయేలు తోయహుకి పుట్టాడు.
35 Suf, Elkana, Mahat, Amasai
౩౫తోయహు సూపుకి పుట్టాడు. సూపు ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా మహతుకి పుట్టాడు. మహతు అమాశైకి పుట్టాడు.
36 Elkana, Yoel, Asaria, Sefania,
౩౬అమాశై ఎల్కానాకి పుట్టాడు. ఎల్కానా యోవేలుకి పుట్టాడు. యోవేలు అజర్యాకి పుట్టాడు. అజర్యా జెఫన్యాకి పుట్టాడు.
37 Tahat, Asir, Ebiasaf, Kora,
౩౭జెఫన్యా తాహతుకి పుట్టాడు. తాహతు అస్సీరుకి పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.
38 Ishar, Kohat, Lewi ne Israel ase.
౩౮కోరహు ఇస్హారుకి పుట్టాడు. ఇస్హారు కహాతుకి పుట్టాడు. కహాతు లేవికి పుట్టాడు. లేవి ఇశ్రాయేలుకి పుట్టాడు.
39 Herman abediakyiri a odi kan no din de Asaf, a na ofi Gerson abusua mu. Wɔto Asaf abusua ana fi Berekia, Simea,
౩౯హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా షిమ్యా కొడుకు.
40 Mikael, Baaseia, Malkia,
౪౦షిమ్యా మిఖాయేలు కొడుకు. మిఖాయేలు బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు.
౪౧మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు.
౪౨అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు.
43 Yahat, Gersom ne Lewi ase.
౪౩షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవి కొడుకు.
44 Herman abediakyiri a ɔto so abien no din de Etan, a na ofi Merari abusua mu. Wɔto Etan abusua ana fi Kisi, Abdi, Maluk,
౪౪హేమానుకి ఎడమవైపున మెరారీయులు నిలుచుని ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏతాను కీషీ కొడుకు. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు. మల్లూకు హషబ్యా కొడుకు.
45 Hasabia, Amasia, Hilkia,
౪౫హషబ్యా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు.
౪౬హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షమెరు కొడుకు.
47 Mahli, Musi, Merari ne Lewi ase.
౪౭షమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు. మూషి మెరారి కొడుకు. మెరారి లేవి కొడుకు.
48 Wɔmaa wɔn abusuafo a wɔyɛ Lewifo no nso dwuma ahorow bi dii wɔ Ahyiae Ntamadan a ɛyɛ Onyankopɔn fi no mu.
౪౮వీళ్ళ సోదరులైన ఇతర లేవీయులను దేవుని మందిరానికి సంబంధించిన అన్ని పనులకు నియమించారు.
49 Aaron ne nʼasefo nko na wɔsom sɛ asɔfo. Na wɔde afɔrebɔde gu ɔhyew afɔremuka ne ohuam afɔremuka so, na wodi dwuma biara a ɛfa kronkron mu kronkron hɔ ho. Wɔnam mmara a Onyankopɔn somfo Mose de maa wɔn no so, yɛɛ mpata maa Israel.
౪౯అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.
50 Na Aaron asefo yɛ: Eleasar, Pinehas, Abisua,
౫౦అహరోను సంతానం ఎవరంటే, అహరోను కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు ఫీనెహాసు. ఫీనెహాసు కొడుకు అబీషూవ.
౫౧అబీషూవ కొడుకు బుక్కీ. బుక్కీ కొడుకు ఉజ్జీ. ఉజ్జీ కొడుకు జెరహ్య.
52 Meraiot, Amaria, Ahitub,
౫౨జెరహ్య కొడుకు మెరాయోతు. మెరాయోతు కొడుకు అమర్యా. అమర్యా కొడుకు అహీటూబు.
౫౩అహీటూబు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు అహిమయస్సు.
54 Eyi ne abakɔsɛm a ɛfa nkurow ne asase a wɔnam ntontobɔ kronkron so de maa Aaron ne nʼasefo a wofi Kohat abusua mu no.
౫౪అహరోను వారసులకు కేటాయించిన స్థలాలు ఇవి. దీనికోసం చీటీలు వేసినప్పుడు మొదటి చీటీ కహాతీయుల కుటుంబాల పైన పడింది.
55 Na Hebron ne mmoa adidibea nsase a atwa ho ahyia wɔ Yuda no ka ho.
౫౫దాని ప్రకారం యూదా దేశంలోని హెబ్రోనూ దాని చుట్టూ ఉన్న పచ్చిక మైదానాలూ వారికి అప్పగించడం జరిగింది.
56 Nanso mfuw ne nkuraa a atwa ho ahyia no de, wɔde maa Yefune babarima Kaleb.
౫౬అయితే ఆ పట్టణం చుట్టూ ఉన్న పొలాలనూ దాని చుట్టుపక్కల గ్రామాలనూ యెఫున్నె కొడుకు కాలేబుకి ఇచ్చారు.
57 Enti saa nkurow yi a mmoa adidibea atwa biara ho ahyia na wɔde maa Aaron asefo: Hebron, a ɛyɛ guankɔbea kurow, Libna, Yatir, Estemoa,
౫౭అహరోను వారసులకు వచ్చిన పట్టణాలేవంటే, ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, లిబ్నా దాని పచ్చిక మైదానాలూ, యత్తీరూ, ఎష్టేమో దాని పచ్చిక మైదానాలూ,
౫౮హీలేనూ, దాని పచ్చిక మైదానాలూ, దెబీరూ దాని పచ్చిక మైదానాలూ.
59 Asan, Yuta ne Bet-Semes.
౫౯అహరోను వారసులకు వీటితో పాటు ఆషానూ దాని పచ్చిక మైదానాలూ, బేత్షెమెషూ దాని పచ్చిక మైదానాలూ కూడా దక్కాయి.
60 Na wɔmaa wɔn Gibeon, Geba, Alemet ne Anatot fii Benyamin asase mu a mmoa adidibea ka emu biara ho. Enti nkurow dumiɛnsa na wɔde maa Aaron asefo.
౬౦ఇంకా బెన్యామీను గోత్ర ప్రదేశాల్లో నుండి గెబా దాని పచ్చిక మైదానాలూ, అల్లెమెతు దాని పచ్చిక మైదానాలూ, అనాతోతూ, దాని పచ్చిక మైదానాలూ కూడా వీరికి వచ్చాయి. ఇలా కహాతీయుల కుటుంబాలు మొత్తం పదమూడు పట్టణాలను పొందాయి.
61 Na Kohat asefo a wɔkae no nso, wonyaa nkurow du a wɔnam ntontobɔ kronkron so fii Manase abusua fa no asase so.
౬౧కహాతు వారసుల్లో మిగిలిన వాళ్లకు వారికి పడిన చీటీ ప్రకారం మనష్షే అర్థగోత్ర ప్రదేశాల్లో నుండి పది పట్టణాలు వచ్చాయి.
62 Gerson asefo nam ntontobɔ kronkron so nyaa nkurow dumiɛnsa fii Isakar, Aser ne Naftali nsase so. Wonyaa bi nso fii Basan pɔw mu a ɛyɛ Manase de, a ɛwɔ Yordan apuei fam no.
౬౨గెర్షోను వారసులకు వాళ్ళ వివిధ తెగల ప్రకారం పదమూడు పట్టణాలు వచ్చాయి. ఇవి ఇశ్శాఖారూ, ఆషేరూ, నఫ్తాలీ, గోత్రాల ప్రదేశాల నుండీ బాషానులో ఉన్న మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండీ ఇవ్వడం జరిగింది.
63 Merari asefo nam ntontobɔ kronkron so, nyaa nkurow dumien fii Ruben, Gad ne Sebulon nsase so.
౬౩మెరారీయులకు పడిన చీటీ ప్రకారం వాళ్ళ తెగలకు పన్నెండు పట్టణాలు వచ్చాయి. ఈ పట్టణాలను రూబేనూ, గాదూ, జెబూలూనూ గోత్రాల ప్రదేశాల నుండి ఇవ్వడం జరిగింది.
64 Enti Israelfo de saa nkurow yi ne mmoa adidibea yi nyinaa maa Lewifo.
౬౪ఈ విధంగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణాలనూ వాటి పచ్చిక మైదానాలనూ ఇచ్చారు.
65 Wɔnam ntontobɔ kronkron so na wɔde nkurow a ɛwowɔ Yuda, Simeon ne Benyamin nsase so mae sɛnea wɔaka dedaw no.
౬౫వాళ్ళు చీటీ వేసి, ముందు పేర్కొన్న పట్టణాలను యూదా, షిమ్యోనూ, బెన్యామీను గోత్ర ప్రదేశాల నుండి వాటిని కేటాయించారు.
66 Saa nkurow yi ne ɛho mmoa adidibea na Kohat asefo nya fii Efraim asase so:
౬౬కహాతీయుల తెగలో కొందరికి ఎఫ్రాయిము గోత్రానికి చెందిన కొన్ని పట్టణాలను ఇచ్చారు.
67 Sekem (guankɔbea kurow) a ɛwɔ Efraim bepɔw asase no so, Geser,
౬౭ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని ఆశ్రయ పట్టణమైన షెకెము, దాని పచ్చిక మైదానాలనూ, గెజెరున దాని పచ్చిక మైదానాలనూ,
౬౮యొక్మెయాము దాని పచ్చిక మైదానాలనూ, బేత్‌హోరోను దాని పచ్చిక మైదానాలనూ,
౬౯అయ్యాలోను దాని పచ్చిక మైదానాలనూ, గత్రిమ్మోను దాని పచ్చిక మైదానాలనూ, వాళ్ళకి ఇచ్చారు.
70 Kohat asefo nkae no, wɔde saa nkurow a efi Manase abusua fa no mu na ɛmaa wɔn: Aner ne Bileam a emu biara mmoa adidibea ka ho.
౭౦అలాగే మనష్షే అర్థగోత్ర ప్రదేశాల నుండి ఆనేరు దాని పచ్చిక మైదానాలనూ బిలియాము దాని పచ్చిక మైదానాలనూ, కహాతీయులకు ఇచ్చారు.
71 Gerson asefo nyaa kurow a wɔfrɛ no Golan a ɛwɔ Basan no fii Manase abusua fa asase so a Astarot ka ho, a ne nyinaa mmoa adidibea da ho.
౭౧అలాగే మనష్షే అర్థగోత్రం వాళ్ళ నుండి గెర్షోనీయులకు బాషానులో ఉన్న గోలాను ప్రాంతం, దాని పచ్చిక మైదానాలూ, అష్తారోతూ దాని పచ్చిక మైదానాలూ,
72 Isakar asase so nso, wɔmaa wɔn Kedes, Daberat,
౭౨ఇశ్శాఖారు గోత్రం నుండి కెదెషూ, దాని పచ్చిక మైదానాలూ, దాబెరతు, దాని పచ్చిక మైదానాలూ,
73 Ramot ne Anem a wɔn mmoa adidibea ka ho.
౭౩రామోతూ దాని పచ్చిక మైదానాలూ, ఆనేమూ దాని పచ్చిక మైదానాలూ,
74 Aser asase so, wonyaa Masal, Abdon,
౭౪ఆషేరుగోత్రం నుండి మాషాలూ దాని పచ్చిక మైదానాలూ, అబ్దోనూ దాని పచ్చిక మైదానాలూ,
75 Hukok ne Rehob a na emu biara mmoa adidibea ka ho.
౭౫హుక్కోకూ దాని పచ్చిక మైదానాలూ, రెహోబూ దాని పచ్చిక మైదానాలూ,
76 Naftali asase so, wɔde Kedes a ɛwɔ Galilea, Hamon ne Kiriataim maa wɔn, a na mmoa adidibea ka emu biara ho.
౭౬నఫ్తాలి గోత్రం నుండి గలిలయలో ఉన్న కెదెషు దాని పచ్చిక మైదానాలూ, హమ్మోనూ దాని పచ్చిక మైదానాలూ, కిర్యతాయిమూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
77 Merari asefo nkae no nyaa Yokneam, Karta, Rimon ne Tabor nkurow, fi Sebulon asase so, a na mmoa adidibea ka biara ho.
౭౭ఇంకా మిగిలిన లేవీయుల్లో మెరారీ వారసులకు జెబూలూను గోత్రం నుండి రిమ్మోను దాని పచ్చిక మైదానాలూ, తాబోరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
78 Ruben asase a ɛda Asubɔnten Yordan apuei fam a ɛne Yeriko di nhwɛanim no nso, wonyaa Beser a ɛyɛ nweatam kurow, Yahas,
౭౮ఇంకా వారికి యెరికోకి అవతల వైపు యొర్దానుకి తూర్పుగా ఉండే రూబేను గోత్ర ప్రదేశాల నుండి అరణ్యంలోని బేసెరు దాని పచ్చిక మైదానాలూ, యహజా దాని పచ్చిక మైదానాలూ,
79 Kedemot ne Mefaat a mmoa adidibea ka emu biara ho.
౭౯కెదేమోతూ దాని పచ్చిక మైదానాలూ, మేఫాతూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.
80 Na Gad asase so nso, wonyaa Ramot a ɛwɔ Gilead, Mahanaim,
౮౦అలాగే గాదు గోత్ర ప్రదేశాల నుండి గిలాదులోని రామోతూ దాని పచ్చిక మైదానాలూ, మహనయీము దాని పచ్చిక మైదానాలూ,
81 Hesbon ne Yaser a mmoa adidibea ka biara ho.
౮౧హెష్బోనూ దాని పచ్చిక మైదానాలూ, యాజెరూ దాని పచ్చిక మైదానాలూ ఇచ్చారు.