< Zekeriya 6 >
1 Yine gözlerimi kaldırıp baktım, iki tunç dağın arasından çıkıp gelen dört savaş arabası gördüm.
౧నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతాలు ఇత్తడివి.
2 Birinci savaş arabasının kızıl, ikincisinin siyah,
౨మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,
3 üçüncüsünün beyaz, dördüncüsünün benekli atları vardı. Atların hepsi güçlüydü.
౩మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలుగల బలమైన గుర్రాలు పూన్చి ఉన్నాయి.
4 Benimle konuşan meleğe, “Bunlar ne, efendim?” diye sordum.
౪“స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను.
5 Melek şöyle karşılık verdi: “Bunlar bütün dünyanın Rabbi'ne hizmet ettikleri yerden çıkan göğün dört ruhudur.
౫అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు.
6 Siyah atların çektiği savaş arabası bölgenin kuzeyine, beyaz atlarınki batıya, benekli atlarınki de güneye doğru gidiyor.”
౬నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.”
7 Yola çıktıklarında güçlü atlar yeryüzünü dolaşmak üzere gitmek istiyorlardı. Melek, “Gidin, yeryüzünü dolaşın!” deyince, gidip yeryüzünü dolaştılar.
౭బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతట సంచరించడానికి సిద్ధంగా ఉండగా “పోయి లోక మంతటా సంచరించండి” అని అతడు చెప్పాడు. అప్పుడు అవి లోకమంతా సంచరించాయి.
8 Sonra melek bana seslendi: “Bak, bölgenin kuzeyine gidenler, orada öfkemi yatıştırdılar.”
౮అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు.
9 RAB bana şöyle seslendi:
౯యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
10 “Armağanları sürgünden dönenlerden –Babil'den gelen Helday, Toviya ve Yedaya'dan– al ve aynı gün Sefanya oğlu Yoşiya'nın evine git.
౧౦చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి
11 Aldığın altınla gümüşten bir taç yaparak Yehosadak oğlu Başkâhin Yeşu'nun başına tak.
౧౧వారినడిగి వెండి బంగారాలు తీసుకుని, కిరీటం చేసి ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి
12 Ona Her Şeye Egemen RAB şöyle diyor de: ‘İşte Dal adındaki adam! Bulunduğu yerde filizlenecek ve RAB'bin Tapınağı'nı kuracak.
౧౨అతనితో ఇలా చెప్పు. “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు. అతడు యెహోవా ఆలయం కడతాడు.
13 Evet, RAB'bin Tapınağı'nı kuracak olan odur. Görkemle kuşanacak, tahtında oturup egemenlik sürecek. Tahtında oturan kâhin olacak. İkisi arasında tam bir uyum olacak.’
౧౩అతడే యెహోవా ఆలయం కడతాడు. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి.
14 Helday'ın, Toviya'nın, Yedaya'nın, Sefanya oğlu Yoşiya'nın anısına taç RAB'bin Tapınağı'na konulacak.
౧౪ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. హేలెముకు, టోబీయాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడు హేనుకు స్మారక చిహ్నంగా ఉంటుంది.
15 Uzaktakiler de gelip RAB'bin Tapınağı'nın yapımında çalışacak. Böylece beni size Her Şeye Egemen RAB'bin gönderdiğini anlayacaksınız. Tanrınız RAB'bin sözüne özenle uyarsanız bütün bunlar gerçekleşecektir.”
౧౫దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”