< Vahiy 6 >

1 Sonra Kuzu'nun yedi mühürden birini açtığını gördüm. O anda dört yaratıktan birinin, gök gürültüsüne benzer bir sesle, “Gel!” dediğini işittim.
ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి సీలు తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి గర్జిస్తున్నట్టుగా, “ఇలా రా” అనడం విన్నాను.
2 Bakınca beyaz bir at gördüm. Binicisinin yayı vardı. Kendisine bir taç verildi ve galip gelen biri olarak zafer kazanmaya çıktı.
నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
3 Kuzu ikinci mührü açınca, ikinci yaratığın “Gel!” dediğini işittim.
గొర్రెపిల్ల రెండవ సీలు తెరచినప్పుడు రెండవ ప్రాణి, “ఇలా రా” అనడం విన్నాను.
4 O zaman kızıl renkte başka bir at çıktı ortaya. Binicisine dünyadan barışı kaldırma yetkisi verildi. Bunun sonucu olarak insanlar birbirlerini boğazlayacaklar. Atlıya ayrıca büyük bir kılıç verildi.
అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న రౌతుకు పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.
5 Kuzu üçüncü mührü açınca, üçüncü yaratığın “Gel!” dediğini işittim. Bakınca siyah bir at gördüm. Binicisinin elinde bir terazi vardı.
ఆ తరువాత గొర్రెపిల్ల మూడవ సీలు తెరిచాడు. అప్పుడు, “ఇలా రా” అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.
6 Dört yaratığın ortasında sanki bir sesin şöyle dediğini işittim: “Bir ölçek buğday bir dinara, üç ölçek arpa bir dinara. Ama zeytinyağına, şaraba zarar verme!”
నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “రోజు కూలికి ఒక కిలో గోదుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు. ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు” అని పలకడం విన్నాను.
7 Kuzu dördüncü mührü açınca, “Gel!” diyen dördüncü yaratığın sesini işittim.
గొర్రెపిల్ల నాలుగవ సీలు తెరచినప్పుడు, “ఇలా రా” అని నాలుగవ ప్రాణి చెప్పడం విన్నాను.
8 Bakınca soluk renkli bir at gördüm. Binicisinin adı Ölüm'dü. Ölüler diyarı onun ardınca geliyordu. Bunlara kılıçla, kıtlıkla, salgın hastalıkla, yeryüzünün yabanıl hayvanlarıyla ölüm saçmak için yeryüzünün dörtte biri üzerinde yetki verildi. (Hadēs g86)
అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగవ భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది. (Hadēs g86)
9 Kuzu beşinci mührü açınca, sunağın altında, Tanrı'nın sözü ve sürdürdükleri tanıklık nedeniyle öldürülenlerin canlarını gördüm.
ఆయన అయిదవ సీలు తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలిపీఠం కింద చూశాను.
10 Yüksek sesle feryat ederek şöyle diyorlardı: “Kutsal ve gerçek olan Efendimiz! Yeryüzünde yaşayanları yargılayıp onlardan kanımızın öcünü almak için daha ne kadar bekleyeceksin?”
౧౦వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, “సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్నవారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?”
11 Onların her birine beyaz birer kaftan verildi. Kendileri gibi öldürülecek olan öbür Tanrı kullarının ve kardeşlerinin sayısı tamamlanıncaya dek kısa bir süre daha beklemeleri istendi.
౧౧అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. “మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి” అని వారికి చెప్పడం జరిగింది.
12 Kuzu altıncı mührü açınca, büyük bir deprem olduğunu gördüm. Güneş keçi kılından yapılmış siyah bir çul gibi karardı. Ay baştan aşağı kan rengine döndü.
౧౨ఆయన ఆరవ సీలు తెరిచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబమంతా రక్తంలా ఎర్రగా అయింది.
13 İncir ağacı, güçlü bir rüzgarla sarsıldığında nasıl ham incirlerini dökerse, gökteki yıldızlar da öylece yeryüzüne düştü.
౧౩పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టు నుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశంలోని నక్షత్రాలు భూమిపై రాలాయి.
14 Gökyüzü dürülen bir tomar gibi ortadan kalktı. Her dağ, her ada yerinden sökülüp alındı.
౧౪ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.
15 Dünya kralları, büyükleri, komutanları, zenginleri, güçlüleri, özgürü kölesi herkes mağaralara, dağlardaki kayaların arasına gizlendiler.
౧౫అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు.
16 Dağlara, kayalara, “Üzerimize düşün!” dediler, “Tahtta oturanın yüzünden ve Kuzu'nun gazabından saklayın bizi!
౧౬వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.
17 Çünkü onların gazabının büyük günü geldi. Buna kim dayanabilir?”
౧౭వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. ఎవరు నిలబడగలరు?” అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.

< Vahiy 6 >