< Mezmurlar 68 >

1 Müzik şefi için - Davut'un mezmuru - İlahi Kalksın Tanrı, dağılsın düşmanları, Kaçsın önünden O'ndan nefret edenler!
ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
2 Dağıtsın onları dağılan duman gibi; Ateşin karşısında eriyen balmumu gibi Yok olsun kötüler Tanrı'nın önünde!
పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
3 Ancak doğrular sevinsin, Bayram etsinler Tanrı'nın önünde, Neşeyle coşsunlar.
నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
4 Tanrı'ya ezgiler söyleyin, adını ilahilerle övün, Çölleri geçecek biniciye yol hazırlayın; O'nun adı RAB'dir, bayram edin önünde!
దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
5 Kutsal konutundaki Tanrı, Öksüzlerin babası, dul kadınların savunucusudur.
తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
6 Tanrı kimsesizlere ev verir, Tutsakları özgürlüğe ve gönence kavuşturur, Ama başkaldıranlar kurak yerde oturur.
దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
7 Ey Tanrı, sen halkına öncülük ettiğinde, Çölde yürüdüğünde, (Sela)
దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
8 Yer sarsıldı, Göklerden yağmur boşandı Tanrı'nın önünde, Sina Dağı sarsıldı Tanrı'nın, İsrail'in Tanrısı'nın önünde.
దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
9 Bol yağmurlar yağdırdın, ey Tanrı, Canlandırdın yorgun düşen yurdunu.
దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
10 Halkın oraya yerleşti, İyiliğinle mazlumların geçimini sağladın, ey Tanrı.
౧౦నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
11 Rab buyruk verdi, Büyük bir kadın topluluğu duyurdu müjdeyi:
౧౧ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
12 “Kaçıyor, kaçıyor orduların kralları! Evi bekleyen kadınlar ganimeti paylaşıyor.
౧౨సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
13 Ağılların arasında uyurken, Kanatları gümüş, tüyleri pırıl pırıl altınla kaplı Bir güvercine benzersiniz.”
౧౩గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
14 Her Şeye Gücü Yeten, kralları dağıtırken, Sanki Salmon Dağı'na kar yağıyordu.
౧౪సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
15 Ey Başan Dağı, Tanrı Dağı! Ey Başan Dağı, dorukları ulu dağ!
౧౫బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
16 Ey ulu dağlar, niçin yan gözle bakıyorsunuz Tanrı'nın yerleşmek için seçtiği dağa? Evet, RAB orada sonsuza dek oturacaktır.
౧౬శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
17 Tanrı'nın savaş arabaları sayısızdır, Rab kutsallık içinde Sina'dan geldi.
౧౭దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
18 Sen yükseğe çıktın, tutsakları peşine taktın, İnsanlardan, başkaldıranlardan bile armağanlar aldın, Oraya yerleşmek için, ya RAB Tanrı.
౧౮నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.
19 Her gün yükümüzü taşıyan Rab'be, Bizi kurtaran Tanrı'ya övgüler olsun. (Sela)
౧౯ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
20 Tanrımız kurtarıcı bir Tanrı'dır, Ölümden kurtarış yalnız Egemen RAB'be özgüdür.
౨౦మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
21 Kuşkusuz Tanrı düşmanlarının başını, Suçlu yaşayanların kıllı kafasını ezer.
౨౧దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
22 Rab, “Onları Başan'dan, Denizin derinliklerinden geri getireceğim” der,
౨౨ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
23 “Öyle ki, ayaklarını düşmanlarının kanına batırasın, Köpeklerinin dili de onlardan payını alsın.”
౨౩నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
24 Ey Tanrı, senin zafer alayını, Tanrım'ın, Kralım'ın kutsal yere törenle gelişini gördüler:
౨౪దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
25 Başta okuyucular, arkada çalgıcılar, Ortada tef çalan genç kızlar.
౨౫చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
26 “Ey sizler, İsrail soyundan gelenler, Toplantılarınızda Tanrı'ya, RAB'be övgüler sunun!”
౨౬సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
27 Önde en küçük oymak Benyamin, Kalabalık halinde Yahuda önderleri, Zevulun ve Naftali önderleri oradalar!
౨౭మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
28 Ey Tanrı, Yeruşalim'deki tapınağından göster gücünü, Bizim için kullandığın gücünü, ey Tanrı. Krallar sana armağanlar sunacak.
౨౮నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
౨౯యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
30 Azarla kamışlar arasında yaşayan hayvanı, Halkların buzağılarıyla boğalar sürüsünü, Çiğne ayaklarınla gümüşe gönül verenleri, Dağıt savaştan zevk alan halkları!
౩౦జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.
31 Mısır'dan elçiler gelecek, Kûşlular ellerini Tanrı'ya doğru kaldırıverecek.
౩౧ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.
32 Ey yeryüzünün krallıkları, Tanrı'ya ezgiler söyleyin, İlahilerle övün Rab'bi, (Sela)
౩౨భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.
33 Göklere, kadim göklere binmiş olanı. İşte sesiyle, güçlü sesiyle gürlüyor!
౩౩అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.
34 Tanrı'nın gücünü tanıyın; O'nun yüceliği İsrail'in üzerinde, Gücü göklerdedir.
౩౪దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.
35 Ne heybetlisin, ey Tanrı, tapınağında! İsrail'in Tanrısı'na, Halkına güç, kudret veren Tanrı'ya övgüler olsun!
౩౫దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.

< Mezmurlar 68 >