< Mezmurlar 31 >
1 Müzik şefi için - Davut'un mezmuru Ya RAB, sana sığınıyorum. Utandırma beni hiçbir zaman! Adaletinle kurtar beni!
౧ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు.
2 Kulak ver bana, Çabuk yetiş, kurtar beni; Bir kaya ol bana sığınmam için, Güçlü bir kale ol kurtulmam için!
౨నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు.
3 Madem kayam ve kalem sensin, Öncülük et, yol göster bana Kendi adın uğruna.
౩నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు.
4 Bana kurdukları tuzaktan uzak tut beni, Çünkü sığınağım sensin.
౪నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే.
5 Ruhumu ellerine bırakıyorum, Ya RAB, sadık Tanrı, kurtar beni.
౫నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.
6 Değersiz putlara bel bağlayanlardan tiksinirim, RAB'be güvenirim ben.
౬నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం.
7 Sadakatinden ötürü sevinip coşacağım, Çünkü düşkün halimi görüyor, Çektiğim sıkıntıları biliyorsun,
౭నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు.
8 Beni düşman eline düşürmedin, Bastığım yerleri genişlettin.
౮నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు.
9 Acı bana, ya RAB, sıkıntıdayım, Üzüntü gözümü, canımı, içimi kemiriyor.
౯యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
10 Ömrüm acıyla, Yıllarım iniltiyle tükeniyor, Suçumdan ötürü gücüm zayıflıyor, Kemiklerim eriyor.
౧౦నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి.
11 Düşmanlarım yüzünden rezil oldum, Özellikle komşularıma. Tanıdıklarıma dehşet salar oldum; Beni sokakta görenler benden kaçar oldu.
౧౧నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు.
12 Gönülden çıkmış bir ölü gibi unutuldum, Kırılmış bir çömleğe döndüm.
౧౨చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను.
13 Birçoğunun fısıldaştığını duyuyorum, Her yer dehşet içinde, Bana karşı anlaştılar, Canımı almak için düzen kurdular.
౧౩చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.
14 Ama ben sana güveniyorum, ya RAB, “Tanrım sensin!” diyorum.
౧౪అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.
15 Hayatım senin elinde, Kurtar beni düşmanlarımın pençesinden, Ardıma düşenlerden.
౧౫నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు.
16 Yüzün kulunu aydınlatsın, Sevgi göster, kurtar beni!
౧౬నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు.
17 Utandırma beni, ya RAB, sana sesleniyorum; Kötüler utansın, ölüler diyarında sesleri kesilsin. (Sheol )
౧౭యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ. (Sheol )
18 Sussun o yalancı dudaklar; Doğru insana karşı Gururla, tepeden bakarak, Küçümseyerek konuşan dudaklar.
౧౮అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.
19 İyiliğin ne büyüktür, ya RAB, Onu senden korkanlar için saklarsın, Herkesin gözü önünde, Sana sığınanlara iyi davranırsın.
౧౯నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
20 İnsanların düzenlerine karşı, Koruyucu huzurunla üzerlerine kanat gerersin; Saldırgan dillere karşı Onları çardağında gizlersin.
౨౦మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
21 RAB'be övgüler olsun, Kuşatılmış bir kentte Sevgisini bana harika biçimde gösterdi.
౨౧ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక.
22 Telaş içinde demiştim ki, “Huzurundan atıldım!” Ama yardıma çağırınca seni, Yalvarışımı işittin.
౨౨నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు.
23 RAB'bi sevin, ey O'nun sadık kulları! RAB kendisine bağlı olanları korur, Büyüklenenlerin ise tümüyle hakkından gelir.
౨౩యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు.
24 Ey RAB'be umut bağlayanlar, Güçlü ve yürekli olun!
౨౪యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.