< Mezmurlar 113 >

1 Övgüler sunun RAB'be! Övgüler sunun, ey RAB'bin kulları, RAB'bin adına övgüler sunun!
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
2 Şimdiden sonsuza dek RAB'bin adına şükürler olsun!
ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
3 Güneşin doğduğu yerden battığı yere kadar RAB'bin adına övgüler sunulmalı!
సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
4 RAB bütün uluslara egemendir, Görkemi gökleri aşar.
యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
5 Var mı Tanrımız RAB gibi, Yücelerde oturan,
ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
6 Göklerde ve yeryüzünde olanlara Bakmak için eğilen?
ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
7 Düşkünü yerden kaldırır, Yoksulu çöplükten çıkarır;
ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
8 Soylularla, Halkının soylularıyla birlikte oturtsun diye.
ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
9 Kısır kadını evde oturtur, Çocuk sahibi mutlu bir anne kılar. RAB'be övgüler sunun!
ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

< Mezmurlar 113 >