< Süleyman'In Özdeyişleri 25 >

1 Bundan sonrakiler de Süleyman'ın özdeyişleridir. Bunları Yahuda Kralı Hizkiya'nın adamları derledi.
ఇవికూడా సొలొమోను సామెతలే. యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు.
2 Tanrı'yı gizli tuttuğu şeyler için, Krallarıysa açığa çıkardıkları için yüceltiriz.
విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత.
3 Göğün yüksekliği, yerin derinliği gibi, Kralların aklından geçen de kestirilemez.
ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం.
4 Cürufu gümüşten ayırınca, Kuyumcunun işleyeceği madde kalır.
వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.
5 Kötüleri kralın huzurundan uzaklaştırırsan Kralın tahtı adaletle pekişir.
రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.
6 Kralın önünde kendini yüceltme, Önemli kişiler arasında yer edinmeye çalışma.
రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.
7 Çünkü kralın seni bir soylunun önünde alaşağı etmesindense, Sana, “Yukarıya gel” demesi yeğdir.
నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా.
8 Gördüklerinle hemencecik mahkemeye başvurma; Çünkü başkası seni utandırabilir, Sonra ne yapacağını bilemezsin.
అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా.
9 Davanı doğrudan komşunla gör; Başkasının sırrını açıklama.
నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.
10 Yoksa işiten seni utandırabilir Ve bu kötü ün yakanı bırakmaz.
౧౦అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు.
11 Yerinde söylenen söz, Gümüş oymalardaki altın elma gibidir.
౧౧సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది.
12 Altın küpe ya da altın bir süs neyse, Dinleyen kulak için bilgenin azarlaması da öyledir.
౧౨బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు.
13 Hasatta kar serinliği nasılsa, Güvenilir ulak da kendisini gönderenler için öyledir. Böyle biri efendilerinin canına can katar.
౧౩నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు.
14 Yağmursuz bulut ve yel nasılsa, Vermediği armağanla övünen kişi de öyledir.
౧౪ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం.
15 Sabırla bir hükümdar bile ikna edilir, Tatlı dil en güçlü direnci kırar.
౧౫సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు.
16 Bal buldun mu yeteri kadar ye, Fazla doyarsan kusarsın.
౧౬నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో.
17 Başkalarının evine seyrek git, Yoksa onları bezdirir, nefretini kazanırsın.
౧౭మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో.
18 Başkasına karşı yalancı tanıklık eden Topuz, kılıç ya da sivri ok gibidir.
౧౮తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు.
19 Sıkıntılı günde haine güvenmek, Çürük dişe ya da sakat ayağa güvenmek gibidir.
౧౯కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం.
20 Dertli kişiye ezgi söylemek, Soğuk günde giysilerini üzerinden almaya, Ya da sodaya sirke katmaya benzer.
౨౦దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం.
21 Düşmanın acıkmışsa doyur, Susamışsa su ver.
౨౧నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు.
22 Bunu yapmakla onu utanca boğarsın Ve RAB seni ödüllendirir.
౨౨అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు.
23 Kuzeyden esen rüzgar nasıl yağmur getirirse, İftiracı dil de öfkeli bakışlara yol açar.
౨౩ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది.
24 Kavgacı kadınla aynı evde oturmaktansa, Damın köşesinde oturmak yeğdir.
౨౪గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి.
25 Susamış kişi için soğuk su neyse, Uzak ülkeden gelen iyi haber de öyledir.
౨౫దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా.
26 Kötünün önünde pes eden doğru kişi, Suyu bulanmış pınar, kirlenmiş kuyu gibidir.
౨౬కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే.
27 Fazla bal yemek iyi değildir; Hep yüceltilmeyi beklemek de...
౨౭తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే.
28 Kendini denetleyemeyen kişi Yıkılmış sursuz kent gibidir.
౨౮ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే.

< Süleyman'In Özdeyişleri 25 >