< Luka 4 >

1 Kutsal Ruh'la dolu olarak Şeria Irmağı'ndan dönen İsa, Ruh'un yönlendirmesiyle çölde dolaştırılarak kırk gün İblis tarafından denendi. O günlerde hiçbir şey yemedi. Dolayısıyla bu süre sonunda acıktı.
యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు.
2
అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది.
3 Bunun üzerine İblis O'na, “Tanrı'nın Oğlu'ysan, şu taşa söyle ekmek olsun” dedi.
సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు.
4 İsa, “‘İnsan yalnız ekmekle yaşamaz’ diye yazılmıştır” karşılığını verdi.
యేసు, “‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
5 Sonra İblis İsa'yı yükseklere çıkararak bir anda O'na dünyanın bütün ülkelerini gösterdi.
అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు.
6 O'na, “Bütün bunların yönetimini ve zenginliğini sana vereceğim” dedi. “Bunlar bana teslim edildi, ben de dilediğim kişiye veririm.
“ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను.
7 Bana taparsan, hepsi senin olacak.”
కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు.
8 İsa ona şu karşılığı verdi: “‘Tanrın Rab'be tapacak, yalnız O'na kulluk edeceksin’ diye yazılmıştır.”
అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
9 İblis O'nu Yeruşalim'e götürüp tapınağın tepesine çıkardı. “Tanrı'nın Oğlu'ysan, kendini buradan aşağı at” dedi.
ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు.
10 “Çünkü şöyle yazılmıştır: ‘Tanrı, seni korumaları için Meleklerine buyruk verecek.’
౧౦‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
11 ‘Ayağın bir taşa çarpmasın diye Seni elleri üzerinde taşıyacaklar.’”
౧౧నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.
12 İsa ona şöyle karşılık verdi: “‘Tanrın Rab'bi denemeyeceksin!’ diye buyrulmuştur.”
౧౨అయితే యేసు, “‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది” అని జవాబిచ్చాడు.
13 İblis, İsa'yı her bakımdan denedikten sonra bir süre için O'nun yanından ayrıldı.
౧౩సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
14 İsa, Ruh'un gücüyle donanmış olarak Celile'ye döndü. Haber bütün bölgeye yayıldı.
౧౪అప్పుడు యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
15 Oranın havralarında öğretiyor, herkes tarafından övülüyordu.
౧౫ఆయన వారి సమాజ మందిరాల్లో బోధిస్తుంటే అందరూ ఆయనను మెచ్చుకున్నారు.
16 İsa, büyüdüğü Nasıra Kenti'ne geldiğinde her zamanki gibi Şabat Günü havraya gitti. Kutsal Yazılar'ı okumak üzere ayağa kalkınca O'na Peygamber Yeşaya'nın Kitabı verildi. Kitabı açarak şu sözlerin yazılı olduğu yeri buldu:
౧౬ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళి చదవడానికి నిలబడ్డాడు.
౧౭యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే,
18 “Rab'bin Ruhu üzerimdedir. Çünkü O beni yoksullara Müjde'yi iletmek için meshetti. Tutsaklara serbest bırakılacaklarını, Körlere gözlerinin açılacağını duyurmak için, Ezilenleri özgürlüğe kavuşturmak Ve Rab'bin lütuf yılını ilan etmek için Beni gönderdi.”
౧౮“ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,
౧౯ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు” అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
20 Sonra kitabı kapattı, görevliye geri verip oturdu. Havradakilerin hepsi dikkatle O'na bakıyordu.
౨౦ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు.
21 İsa, “Dinlediğiniz bu Yazı bugün yerine gelmiştir” diye konuşmaya başladı.
౨౧సమాజ మందిరంలో ఉన్న వారంతా ఆయనను తేరి చూశారు. “మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది” అని ఆయన వారితో అన్నాడు.
22 Herkes İsa'yı övüyor, ağzından çıkan lütufkâr sözlere hayran kalıyordu. “Yusuf'un oğlu değil mi bu?” diyorlardı.
౨౨అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. “ఈయన యోసేపు కొడుకు గదా?” అని చెప్పుకున్నారు.
23 İsa onlara şöyle dedi: “Kuşkusuz bana şu deyimi hatırlatacaksınız: ‘Ey hekim, önce kendini iyileştir! Kefarnahum'da yaptıklarını duyduk. Aynısını burada, kendi memleketinde de yap.’”
౨౩ఆయన వారితో, “వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు” అన్నాడు.
24 “Size doğrusunu söyleyeyim” diye devam etti İsa, “Hiçbir peygamber kendi memleketinde kabul görmez.
౨౪ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు.
25 Yine size gerçeği söyleyeyim, gökyüzünün üç yıl altı ay kapalı kaldığı, bütün ülkede korkunç bir kıtlığın baş gösterdiği İlyas zamanında İsrail'de çok sayıda dul kadın vardı.
౨౫ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా,
26 İlyas bunlardan hiçbirine gönderilmedi; yalnız Sayda bölgesinin Sarefat Kenti'nde bulunan dul bir kadına gönderildi.
౨౬దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరకీ పంపలేదు. సీదోను ప్రాంతంలో సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక వితంతువు దగ్గరకే పంపాడు.
27 Peygamber Elişa'nın zamanında İsrail'de çok sayıda cüzamlı vardı. Bunlardan hiçbiri iyileştirilmedi; yalnız Suriyeli Naaman iyileştirildi.”
౨౭ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్టురోగులున్నా, సిరియా వాడైన నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు.”
28 Havradakiler bu sözleri duyunca öfkeden kudurdular.
౨౮సమాజ మందిరంలో ఉన్నవారంతా ఆ మాటలు విని
29 Ayağa kalkıp İsa'yı kentin dışına kovdular. O'nu uçurumdan aşağı atmak için kentin kurulduğu tepenin yamacına götürdüler.
౨౯ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండ కొమ్ము వరకూ తీసికెళ్ళారు. వారి ఊరు కొండ పైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
30 Ama İsa onların arasından geçerek oradan uzaklaştı.
౩౦అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్ళిపోయాడు.
31 Sonra İsa Celile'nin Kefarnahum Kenti'ne gitti. Şabat Günü halka öğretiyordu.
౩౧అప్పుడాయన గలిలయ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.
32 Yetkiyle konuştuğu için O'nun öğretişine şaşıp kaldılar.
౩౨వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు.
33 Havrada cinli, içinde kötü ruh olan bir adam vardı. Adam yüksek sesle, “Ey Nasıralı İsa, bırak bizi! Bizden ne istiyorsun?” diye bağırdı. “Bizi mahvetmeye mi geldin? Senin kim olduğunu biliyorum, Tanrı'nın Kutsalı'sın sen!”
౩౩ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు,
౩౪“నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి.”
35 İsa, “Sus, çık adamdan!” diyerek cini azarladı. Cin adamı herkesin önünde yere vurduktan sonra, ona hiç zarar vermeden içinden çıktı.
౩౫యేసు, “ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా” అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది.
36 Herkes şaşkına dönmüştü. Birbirlerine, “Bu nasıl söz? Güç ve yetkiyle kötü ruhlara çıkmalarını buyuruyor, onlar da çıkıyor!” diyorlardı.
౩౬అందరూ ఆశ్చర్య పడ్డారు. “ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
37 İsa'yla ilgili haber o bölgenin her yanında yankılandı.
౩౭అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
38 İsa havradan ayrılarak Simun'un evine gitti. Simun'un kaynanası hastaydı, ateşler içindeydi. Onun için İsa'dan yardım istediler.
౩౮ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు.
39 İsa kadının başucunda durup ateşi azarladı, kadının ateşi düştü. Kadın hemen ayağa kalkıp onlara hizmet etmeye başladı.
౩౯ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.
40 Güneş batarken herkes çeşitli hastalıklara yakalanmış akrabalarını İsa'ya getirdi. İsa her birinin üzerine ellerini koyarak onları iyileştirdi.
౪౦పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.
41 Birçoğunun içinden cinler de, “Sen Tanrı'nın Oğlu'sun!” diye bağırarak çıkıyordu. Ne var ki, İsa onları azarladı, konuşmalarına izin vermedi. Çünkü kendisinin Mesih olduğunu biliyorlardı.
౪౧వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
42 Sabah olunca İsa dışarı çıkıp ıssız bir yere gitti. Halk ise O'nu arıyordu. Bulunduğu yere geldiklerinde O'nu yanlarında alıkoymaya çalıştılar.
౪౨తెల్లవారినప్పుడు ఆయన బయలుదేరి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయనను వెదుకుతూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయనను ఆపాలని చూశారు.
43 Ama İsa, “Öbür kentlerde de Tanrı'nın Egemenliği'yle ilgili Müjde'yi yaymam gerek” dedi. “Çünkü bunun için gönderildim.”
౪౩అయితే ఆయన, “నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాడు” అని వారితో చెప్పాడు.
44 Böylece Yahudiye'deki havralarda Tanrı sözünü duyurmaya devam etti.
౪౪ఆపైన ఆయన యూదయ ప్రాంతమంతటా ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటిస్తూ వచ్చాడు.

< Luka 4 >