< Yuhanna 3 >
1 Yahudiler'in Nikodim adlı bir önderi vardı. Ferisiler'den olan bu adam bir gece İsa'ya gelerek, “Rabbî, senin Tanrı'dan gelmiş bir öğretmen olduğunu biliyoruz. Çünkü Tanrı kendisiyle olmadıkça kimse senin yaptığın bu mucizeleri yapamaz” dedi.
౧నికోదేము అనే పేరు గల ఒక పరిసయ్యుడు ఉన్నాడు. అతడు యూదుల చట్ట సభలో సభ్యుడు.
౨అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు.
3 İsa ona şu karşılığı verdi: “Sana doğrusunu söyleyeyim, bir kimse yeniden doğmadıkça Tanrı'nın Egemenliği'ni göremez.”
౩దానికి జవాబుగా యేసు అతనితో, “ఎవరైనా కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేరని కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.
4 Nikodim, “Yaşlanmış bir adam nasıl doğabilir? Annesinin rahmine ikinci kez girip doğabilir mi?” diye sordu.
౪అందుకు నికోదేము, “మనిషి ముసలివాడయ్యాక మళ్ళీ ఎలా పుడతాడు? రెండవ సారి పుట్టడానికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించలేడు గదా! అలా ప్రవేశిస్తాడా?” అని ఆయనను అడిగాడు.
5 İsa şöyle yanıt verdi: “Sana doğrusunu söyleyeyim, bir kimse sudan ve Ruh'tan doğmadıkça Tanrı'nın Egemenliği'ne giremez.
౫అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
6 Bedenden doğan bedendir, Ruh'tan doğan ruhtur.
౬శరీర మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ.
7 Sana, ‘Yeniden doğmalısınız’ dediğime şaşma.
౭నువ్వు కొత్తగా పుట్టాలని చెప్పినందుకు అదొక విడ్డూరంగా భావించవద్దు.
8 Yel dilediği yerde eser; sesini işitirsin, ama nereden gelip nereye gittiğini bilemezsin. Ruh'tan doğan herkes böyledir.”
౮గాలి తనకిష్టమైన వైపుకు వీస్తుంది. నువ్వు దాని శబ్దాన్ని మాత్రం వినగలవు, కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా పుట్టినవాడు అలాగే ఉన్నాడు.”
9 Nikodim İsa'ya, “Bunlar nasıl olabilir?” diye sordu.
౯దానికి జవాబుగా నికోదేము, “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అన్నాడు.
10 İsa ona şöyle yanıt verdi: “Sen İsrail'in öğretmeni olduğun halde bunları anlamıyor musun?
౧౦యేసు ఇలా అన్నాడు, “నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడివై ఉండీ ఈ సంగతులు అర్థం చేసుకోలేవా?
11 Sana doğrusunu söyleyeyim, biz bildiğimizi söylüyoruz, gördüğümüze tanıklık ediyoruz. Sizler ise bizim tanıklığımızı kabul etmiyorsunuz.
౧౧మాకు తెలిసిన సంగతులను చెబుతున్నాం, మేము చూసిన వాటి గురించి వివరిస్తున్నాం. అయినా మీరు మా సాక్షాన్ని ఒప్పుకోరని కచ్చితంగా చెబుతున్నాను.
12 Sizlere yeryüzüyle ilgili şeyleri söylediğim zaman inanmazsanız, gökle ilgili şeyleri söylediğimde nasıl inanacaksınız?
౧౨భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?
13 Gökten inmiş olan İnsanoğlu'ndan başka hiç kimse göğe çıkmamıştır.
౧౩పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
14 Musa çölde yılanı nasıl yukarı kaldırdıysa, İnsanoğlu'nun da öylece yukarı kaldırılması gerekir.
౧౪అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో,
15 Öyle ki, O'na iman eden herkes sonsuz yaşama kavuşsun. (aiōnios )
౧౫అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి. (aiōnios )
16 “Çünkü Tanrı dünyayı o kadar çok sevdi ki, biricik Oğlu'nu verdi. Öyle ki, O'na iman edenlerin hiçbiri mahvolmasın, hepsi sonsuz yaşama kavuşsun. (aiōnios )
౧౬“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. (aiōnios )
17 Tanrı, Oğlu'nu dünyayı yargılamak için göndermedi, dünya O'nun aracılığıyla kurtulsun diye gönderdi.
౧౭తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
18 O'na iman eden yargılanmaz, iman etmeyen ise zaten yargılanmıştır. Çünkü Tanrı'nın biricik Oğlu'nun adına iman etmemiştir.
౧౮ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.
19 Yargı da şudur: Dünyaya ışık geldi, ama insanlar ışık yerine karanlığı sevdiler. Çünkü yaptıkları işler kötüydü.
౧౯ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు.
20 Kötülük yapan herkes ışıktan nefret eder ve yaptıkları açığa çıkmasın diye ışığa yaklaşmaz.
౨౦దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు.
21 Ama gerçeği uygulayan kişi yaptıklarını, Tanrı'ya dayanarak yaptığını göstermek için ışığa gelir.”
౨౧అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”
22 Bundan sonra İsa'yla öğrencileri Yahudiye diyarına gittiler. İsa onlarla birlikte orada bir süre kalarak vaftiz etti.
౨౨ఇదయ్యాక యేసు తన శిష్యులతో కూడా యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బాప్తిసం ఇస్తూ, తన శిష్యులతో కాలం గడుపుతూ ఉన్నాడు.
23 Yahya da Salim yakınındaki Aynon'da vaftiz ediyordu. Çünkü orada bol su vardı. İnsanlar gelip vaftiz oluyorlardı.
౨౩సలీము అనే ప్రాంతం దగ్గర ఉన్న ఐనోను అనే స్చోట నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ప్రజలు అక్కడికి వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు.
24 Yahya henüz hapse atılmamıştı.
౨౪అప్పటికి యోహానును ఇంకా చెరసాల్లో వేయలేదు.
25 O sıralarda Yahya'nın öğrencileriyle bir Yahudi arasında temizlenme konusunda bir tartışma çıktı.
౨౫అప్పుడు శుద్ధి ఆచారాల గురించి యోహాను శిష్యులకీ ఒక యూదుడికీ వివాదం పుట్టింది.
26 Öğrencileri Yahya'ya gelerek, “Rabbî” dediler, “Şeria Irmağı'nın karşı yakasında birlikte olduğun ve kendisi için tanıklık ettiğin adam var ya, işte O vaftiz ediyor, herkes de O'na gidiyor.”
౨౬వారు యోహాను దగ్గరికి వచ్చారు. “బోధకా, యొర్దాను నది అవతల నీతో ఒక వ్యక్తి ఉన్నాడే, ఆయన గురించి నువ్వు సాక్ష్యం కూడా చెప్పావు. చూడు, ప్రస్తుతం ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకే వెళ్తున్నారు” అని చెప్పారు.
27 Yahya şöyle yanıt verdi: “İnsan, kendisine gökten verilmedikçe hiçbir şey alamaz.
౨౭అందుకు యోహాను ఇలా అన్నాడు, “పరలోకం నుండి ఇస్తేనే గానీ ఎవరూ ఏదీ పొందలేరు.
28 ‘Ben Mesih değilim, ama O'nun öncüsü olarak gönderildim’ dediğime siz kendiniz tanıksınız.
౨౮నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు.
29 Gelin kiminse, güvey odur. Ama güveyin yanında duran ve onu dinleyen dostu onun sesini işitince çok sevinir. İşte benim sevincim böylece tamamlandı.
౨౯పెళ్ళి కొడుక్కే పెళ్ళి కూతురు ఉంటుంది. అయితే పెళ్ళి కొడుకు స్నేహితుడు నిలబడి పెళ్ళికొడుకు స్వరం వింటూ ఎంతో సంతోషిస్తాడు. అందుకే నా సంతోషం సంపూర్ణం అయింది.
30 O büyümeli, bense küçülmeliyim.”
౩౦ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.”
31 Yukarıdan gelen, herkesten üstündür. Dünyadan olan dünyaya aittir ve dünyadan söz eder. Gökten gelen ise, herkesten üstündür.
౩౧పై నుండి వచ్చిన వాడు అందరికంటే పైవాడే. భూమి నుండి వచ్చిన వాడు భూసంబంధి గనక భూ సంబంధమైన సంగతులే మాట్లాడతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికీ పైనున్నవాడు.
32 Ne görmüş ne işitmişse ona tanıklık eder, ama tanıklığını kimse kabul etmez.
౩౨ఆయన తాను చూసిన వాటిని గురించీ విన్నవాటిని గురించీ సాక్ష్యం ఇస్తాడు కానీ ఎవరూ ఆయన సాక్షాన్ని అంగీకరించరు.
33 O'nun tanıklığını kabul eden, Tanrı'nın gerçek olduğuna mührünü basmıştır.
౩౩ఆయన సాక్షాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని నిరూపిస్తున్నాడు.
34 Tanrı'nın gönderdiği kişi Tanrı'nın sözlerini söyler. Çünkü Tanrı, Ruh'u ölçüyle vermez.
౩౪దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు.
35 Baba Oğul'u sever; her şeyi O'na teslim etmiştir.
౩౫తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. సమస్తాన్నీ ఆయన చేతులకు అప్పగించాడు.
36 Oğul'a iman edenin sonsuz yaşamı vardır. Ama Oğul'un sözünü dinlemeyen yaşamı görmeyecektir. Tanrı'nın gazabı böylesinin üzerinde kalır. (aiōnios )
౩౬కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.” (aiōnios )