< Yeremya 43 >

1 Yeremya Tanrıları RAB'bin bütün bu sözlerini –Tanrıları RAB'bin onun aracılığıyla kendilerine ilettiği her şeyi– halka bildirmeyi bitirince
వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు.
2 Hoşaya oğlu Azarya, Kareah oğlu Yohanan ve bütün küstah adamlar ona, “Yalan söylüyorsun!” dediler, “Tanrımız RAB, ‘Yerleşmek üzere Mısır'a gitmeyin’ demek için göndermedi seni bize.
అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.
3 Bizi öldürsünler, Babil'e sürsünler diye Kildaniler'in eline teslim etmek için Neriya oğlu Baruk seni bize karşı kışkırtıyor.”
మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు.
4 Böylece Kareah oğlu Yohanan, bütün ordu komutanları ve halk RAB'bin Yahuda'da kalmalarına ilişkin buyruğuna karşı geldiler.
ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.
5 Kareah oğlu Yohanan'la bütün ordu komutanları, sürüldükleri uluslardan yerleşmek üzere Yahuda'ya geri dönen Yahuda halkını alıp götürdüler.
కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు.
6 Muhafız birliği komutanı Nebuzaradan'ın Şafan oğlu Ahikam oğlu Gedalya'nın sorumluluğuna bırakmış olduğu bütün kadınları, erkekleri, çocukları, kral kızlarını da götürdüler. Peygamber Yeremya'yla Neriya oğlu Baruk'u da alıp
స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు.
7 RAB'bin sözünü dinlemeyerek Mısır'a gittiler. Tahpanhes'e vardılar.
వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు.
8 Tahpanhes'te RAB Yeremya'ya şöyle seslendi:
కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు.
9 “Yahudiler'in gözü önünde eline büyük taşlar al, Tahpanhes'te firavun sarayının girişindeki tuğla kaldırımın harcına göm.
యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
10 Onlara de ki, ‘İsrail'in Tanrısı, Her Şeye Egemen RAB şöyle diyor: İşte kulum Babil Kralı Nebukadnessar'ı buraya getirtip tahtını harca gömdüğüm bu taşların üzerine kuracağım. Nebukadnessar otağını bu taşların üzerine kuracak.
౧౦తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
11 Gelip Mısır'ı bozguna uğratacak. Ölüm için ayrılanlar ölüme, Sürgün için ayrılanlar sürgüne, Kılıç için ayrılanlar kılıca gidecek.
౧౧అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.
12 Mısır ilahlarının tapınaklarını ateşe verip yakacak, ilahları alıp götürecek. Çoban giysisiyle kendisini nasıl örterse, o da Mısır'ı öyle örtecek. Sonra oradan sağ salim çıkacak.
౧౨అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
13 Mısır'daki Güneş Tapınağı'nın dikili taşlarını kıracak, Mısır ilahlarının tapınaklarını ateşe verecek.’”
౧౩అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’”

< Yeremya 43 >