< Yakup 5 >
1 Dinleyin şimdi ey zenginler, başınıza gelecek felaketlerden ötürü feryat edip ağlayın.
౧ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి.
2 Servetiniz çürümüş, giysinizi güve yemiştir.
౨మీ సిరిసంపదలు శిథిలమైపోయాయి. మీ బట్టలు చిమ్మెటలు కొట్టేస్తున్నాయి.
3 Altınlarınız, gümüşleriniz pas tutmuştur. Onların pası size karşı tanıklık edecek, etinizi ateş gibi yiyecek. Bu son çağda servetinize servet kattınız.
౩మీ వెండి బంగారాలు తుప్పుపట్టాయి. ఆ తుప్పే మీమీద సాక్ష్యం పలుకుతూ అగ్నిలాగా మీ దేహాలను దహిస్తుంది. మీరు చివరిదినాల్లో ధనం పోగు చేసుకున్నారు.
4 İşte, ekinlerinizi biçen işçilerin haksızca alıkoyduğunuz ücretleri size karşı haykırıyor. Orakçıların feryadı Her Şeye Egemen Rab'bin kulağına erişti.
౪చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.
5 Yeryüzünde zevk ve bolluk içinde yaşadınız. Boğazlanacağınız gün için kendinizi besiye çektiniz.
౫మీరు భూమి మీద సుఖంగా బతుకుతూ భోగలాలసులై వధ దినం కోసం మీ హృదయాలను కొవ్వబెట్టుకున్నారు.
6 Size karşı koymayan doğru kişiyi yargılayıp öldürdünüz.
౬మిమ్మల్ని ఎదిరించలేని నీతిపరులకు మీరు శిక్ష విధించి చంపారు.
7 Öyleyse kardeşler, Rab'bin gelişine dek sabredin. Bakın, çiftçi ilk ve son yağmurları alıncaya dek toprağın değerli ürününü nasıl sabırla bekliyor!
౭కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ సహనంతో ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా.
8 Siz de sabredin. Yüreklerinizi güçlendirin. Çünkü Rab'bin gelişi yakındır.
౮ప్రభువు రాక దగ్గర పడింది. మీరు కూడా ఓపికగా ఉండండి. మీ హృదయాలను దిటవు చేసుకోండి.
9 Kardeşler, yargılanmamak için birbirinize karşı homurdanmayın. İşte, Yargıç kapının önünde duruyor.
౯సోదరులారా, ఒకడి మీద ఒకడు సణుక్కోకండి, అప్పుడు మీ మీదికి తీర్పు రాదు. ఇదుగో న్యాయాధిపతి వాకిట్లోకి వచ్చేశాడు.
10 Kardeşler, Rab'bin adıyla konuşmuş olan peygamberleri sıkıntılarda sabır örneği olarak alın.
౧౦నా సోదరులారా, ప్రభువు నామంలో బోధించిన ప్రవక్తలు ఎదుర్కొన్న హింసలను, ఓపికను ఆదర్శంగా తీసుకోండి.
11 Sıkıntıya dayanmış olanları mutlu sayarız. Eyüp'ün nasıl dayandığını duydunuz. Rab'bin en sonunda onun için neler yaptığını bilirsiniz. Rab çok şefkatli ve merhametlidir.
౧౧చూడండి, సహించి నిలబడిన వారిని ధన్యులని భావిస్తాము గదా? మీరు యోబు సహనాన్ని గూర్చి విన్నారు. యోబు విషయంలో దేవుని ఉద్దేశాలను తెలిసిన మీరు ఆయన ఎంతో జాలి, కరుణ ఉన్నవాడని గ్రహించారు.
12 Kardeşlerim, öncelikle şunu söyleyeyim: Ne gök üzerine, ne yer üzerine, ne de başka bir şey üzerine ant için. “Evet”iniz evet, “hayır”ınız hayır olsun ki, yargıya uğramayasınız.
౧౨నా సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. ఆకాశం తోడనీ భూమి తోడనీ మరి దేని తోడనీ ఒట్టు పెట్టుకోవద్దు. మీరు “అవునంటే అవును, కాదంటే కాదు” అన్నట్టుగా ఉంటే మీరు తీర్పు పాలు కారు.
13 İçinizden biri sıkıntıda mı, dua etsin. Sevinçli mi, ilahi söylesin.
౧౩మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
14 İçinizden biri hasta mı, kilisenin ihtiyarlarını çağırtsın; Rab'bin adıyla üzerine yağ sürüp onun için dua etsinler.
౧౪మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
15 İmanla edilen dua hastayı iyileştirecek ve Rab onu ayağa kaldıracaktır. Eğer hasta günah işlemişse, günahları bağışlanacaktır.
౧౫విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.
16 Bu nedenle, şifa bulmak için günahlarınızı birbirinize itiraf edin ve birbiriniz için dua edin. Doğru kişinin yalvarışı çok güçlü ve etkilidir.
౧౬కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.
17 İlyas da tıpkı bizim gibi insandı. Yağmur yağmaması için gayretle dua etti; üç yıl altı ay ülkeye yağmur yağmadı.
౧౭ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు.
18 Yeniden dua etti; gök yağmurunu, toprak da ürününü verdi.
౧౮అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.
19 Kardeşlerim, içinizden biri gerçeğin yolundan sapar da başka biri onu yine gerçeğe döndürürse, bilsin ki, günahkârı sapık yolundan döndüren, ölümden bir can kurtarmış, bir sürü günahı örtmüş olur.
౧౯నా సోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుంచి తొలగిపోతే మరొకడు అతన్ని తిరిగి సత్యానికి మళ్ళించినట్టయితే
౨౦అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.