< Yeşaya 41 >
1 RAB diyor ki, “Susun karşımda, ey kıyı halkları! Halklar güçlerini tazelesin, Öne çıkıp konuşsunlar. Yargı için bir araya gelelim.
౧“ద్వీపాల్లారా, నా ఎదుట మౌనంగా ఉండి వినండి. జాతులు వచ్చి నూతన బలం పొందండి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడాలి. రండి, మనం కలిసి చర్చించి వివాదం తీర్చుకుందాం.
2 “Doğudan adaleti harekete geçiren, Hizmete koşan kim? Ulusları önüne katıyor, krallara baş eğdiriyor. Kılıcıyla toz ediyor onları, Yayıyla savrulan samana çeviriyor.
౨నీతియుతమైన పరిచర్య జరిగించే ఇతణ్ణి తూర్పు నుండి ప్రేరేపించి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి రాజ్యాలను అప్పగిస్తున్నాడు, రాజులను అతనికి లోబరుస్తున్నాడు. అతని ఖడ్గానికి వారిని ధూళిలాగా అప్పగిస్తున్నాడు. అతని విల్లుకి వారిని ఎగిరిపోయే పొట్టులాగా అప్పగిస్తున్నాడు.
3 Kovalıyor onları, Ayak basmadığı bir yoldan esenlikle geçiyor.
౩అతడు వారిని తరుముతున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని దారైనా సురక్షితంగా దాటిపోతున్నాడు.
4 Bunları yapıp gerçekleştiren, Kuşakları başlangıçtan beri çağıran kim? Ben RAB, ilkim; sonuncularla da yine Ben olacağım.”
౪దీన్ని ఎవడు ఆలోచించి జరిగించాడు? ఆదినుండి మానవ జాతులను పిలిచిన వాడినైన యెహోవా అనే నేనే. నేను మొదటివాడిని, చివరి వారితో ఉండేవాణ్ణి.
5 Kıyı halkları bunu görüp korktu. Dünyanın dört bucağı titriyor. Yaklaşıyor, geliyorlar.
౫ద్వీపాలు చూసి దిగులు పడుతున్నాయి. భూదిగంతాలు వణకుతున్నాయి, ప్రజలు వచ్చి చేరుకుంటున్నారు.
6 Herkes komşusuna yardım ediyor, Kardeşine, “Güçlü ol” diyor.
౬వారు ఒకడికొకడు సహాయం చేసుకుంటారు. ‘ధైర్యంగా ఉండు’ అని ఒకడితో ఒకడు చెప్పుకుంటారు.
7 Zanaatçı kuyumcuyu yüreklendiriyor, Madeni çekiçle düzleyen, “Lehim iyi oldu” diyerek örse vuranı yüreklendiriyor. Kımıldamasın diye putu yerine çiviliyor.
౭‘అది బాగా ఉంది’ అని చెబుతూ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తాడు. సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవాణ్ణి ప్రోత్సాహపరుస్తాడు ఆ విగ్రహం కదిలిపోకుండా వారు మేకులతో దాన్ని బిగిస్తారు.
8 “Ama sen, ey kulum İsrail, Seçtiğim Yakup soyu, Dostum İbrahim'in torunları!
౮నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
9 Sizleri dünyanın dört bucağından topladım, En uzak yerlerden çağırdım. Dedim ki, ‘Sen kulumsun, seni seçtim, Seni reddetmedim.’
౯భూదిగంతాల నుండి నేను నిన్ను తీసుకువచ్చాను. దూరంగా ఉన్న అంచుల నుండి నిన్ను పిలిచాను.
10 Korkma, çünkü ben seninleyim, Yılma, çünkü Tanrın benim. Seni güçlendireceğim, evet, sana yardım edeceğim; Zafer kazanan sağ elimle sana destek olacağım.
౧౦నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.
11 “Sana öfkelenenlerin hepsi utanacak, rezil olacak. Sana karşı çıkanlar hiçe sayılıp yok olacak.
౧౧నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు. నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు
12 Seninle çekişenleri arasan da bulamayacaksın. Seninle savaşanlar hiçten beter olacak.
౧౨నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు. నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.
13 Çünkü sağ elinden tutan, ‘Korkma, sana yardım edeceğim’ diyen Tanrın RAB benim.
౧౩నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.
14 “Ey Yakup soyu, toprak kurdu, Ey İsrail halkı, korkma! Sana yardım edeceğim” diyor RAB, Seni kurtaran İsrail'in Kutsalı.
౧౪పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’” అని యెహోవా సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు.
15 “İşte, seni dişli, keskin, yepyeni bir harman düveni yaptım. Harman edip ufalayacaksın dağları, Tepeleri samana çevireceksin.
౧౫“ఇదిగో చూడు, నిన్ను పదునైన కొత్త నూర్పిడి బల్లగా నియమించాను. నువ్వు పర్వతాలను నూర్చి, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు.
16 Onları savurduğunda rüzgar alıp götürecek, Darmadağın edecek hepsini kasırga. Sense RAB'de sevinç bulacak, İsrail'in Kutsalı'yla övüneceksin.
౧౬నువ్వు వాటిని ఎగరేసినప్పుడు గాలికి అవి కొట్టుకుపోతాయి. సుడిగాలికి అవి చెదరిపోతాయి. నువ్వు యెహోవాను బట్టి సంతోషిస్తావు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి బట్టి అతిశయపడతావు.
17 “Düşkünlerle yoksullar su arıyor, ama yok. Dilleri kurumuş susuzluktan. Ben RAB, onları yanıtlayacağım, Ben, İsrail'in Tanrısı, onları bırakmayacağım.
౧౭దీనులు, అవస్థలో ఉన్నవారు నీటి కోసం వెదుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పికతో ఎండిపోతున్నది. యెహోవా అనే నేను వారికి జవాబిస్తాను. ఇశ్రాయేలు దేవుడినైన నేను వారిని విడిచిపెట్టను.
18 Çıplak tepeler üzerinde ırmaklar, Vadilerde su kaynakları yapacağım. Çölü havuza, Kurak toprağı pınara çevireceğim.
౧౮ఇది యెహోవా చేతి కార్యమనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే దీన్ని కలిగించాడనీ మనుషులు గ్రహించి స్పష్టంగా తెలుసుకుంటారు.
19 Çölü sedir, akasya, Mersin ve iğde ağaçlarına kavuşturacağım. Bozkıra çam, köknar Ve selviyi bir arada dikeceğim.
౧౯నేను చెట్లు లేని ఎత్తు స్థలాల మీద నదులను పారిస్తాను. లోయల మధ్యలో ఊటలు ఉబికేలా చేస్తాను. అరణ్యాన్ని నీటి మడుగుగా, ఎండిపోయిన నేలను నీటిబుగ్గలుగా చేస్తాను.
20 Öyle ki, insanlar görüp bilsinler, Hep birlikte düşünüp anlasınlar ki, Bütün bunları RAB'bin eli yapmış, İsrail'in Kutsalı yaratmıştır.”
౨౦నేను అరణ్యంలో దేవదారు వృక్షాలు, తుమ్మచెట్లు, గొంజిచెట్లు, తైలవృక్షాలు నాటిస్తాను. ఎడారిలో తమాల వృక్షాలు, సరళ వృక్షాలు, నేరేడు చెట్లు నాటిస్తాను.
21 “Davanızı sunun” diyor RAB, “Kanıtlarınızı ortaya koyun” diyor Yakup'un Kralı,
౨౧మీ వాదంతో రండి” అని యెహోవా అంటున్నాడు. “మీ రుజువులు చూపించండి” అని యాకోబు రాజు చెబుతున్నాడు.
22 “Putlarınızı getirin de olacakları bildirsinler bize. Olup bitenleri bildirsinler ki düşünelim, Sonuçlarını bilelim. Ya da gelecekte olacakları duyursunlar bize.
౨౨జరగబోయే వాటిని విశదపరచి మాకు తెలియజెప్పండి. గతంలో జరిగిన వాటిని మేం పరిశీలించి వాటి ఫలాన్ని తెలుసుకునేలా వాటిని మాకు తెలియజెప్పండి.
23 Ey putlar, bundan sonra olacakları bize bildirin de, İlah olduğunuzu bilelim! Haydi bir iyilik ya da kötülük edin de, Hepimiz korkup dehşete düşelim.
౨౩ఇకముందు జరగబోయే సంగతులను తెలియజెప్పండి. అప్పుడు మీరు దేవుళ్ళని మేం ఒప్పుకుంటాం. మేము విస్మయం చెందేలా మేలైనా, కీడైనా, ఏదైనా పని చేయండి.
24 Siz de yaptıklarınız da hiçten betersiniz, Sizi yeğleyen iğrençtir.
౨౪మీకు ఉనికి లేదు. మీ పనులు శూన్యం. మిమ్మల్ని ఆశించేవారు అసహ్యులు.
25 “Kuzeyden birini harekete geçirdim, geliyor, Gün doğusundan beni adımla çağıran biri. Çömlekçinin balçığı çiğnediği gibi, Önderleri çamur gibi çiğneyecek ayağıyla.
౨౫ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు. అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు.
26 Hanginiz bunu başlangıçtan bildirdi ki, bilelim, Kim önceden bildirdi ki, ‘Haklısın’ diyelim? Konuştuğunuzu bildiren de Duyuran da Duyan da olmadı hiç.
౨౬జరిగినదాన్ని మొదటి నుండి మాకు చెప్పి మమ్మల్ని ఒప్పించినవాడేడీ? “అతడు చెప్పింది సరైనదే” అని మేము చెప్పేలా పూర్వకాలంలో దాన్ని మాకు చెప్పింది ఎవరు? ఎవరూ వినిపించలేదు, వినడానికి మీరెవరికీ చెప్పలేదు.
27 Siyon'a ilk, ‘İşte, geldiler’ diyen benim. Yeruşalim'e müjdeci gönderdim.
౨౭వినండి, “ఇదిగో, ఇవే అవి” అని మొదట సీయోనుతో నేనే చెప్పాను. యెరూషలేముకు సందేశం ప్రకటించడానికి నేనే ఒకణ్ణి పంపించాను.
28 Bakıyorum, aralarında öğüt verebilecek kimse yok ki, Onlara danışayım, onlar da yanıtlasınlar.
౨౮నేను చూసినప్పుడు ఎవ్వరూ లేరు. నేను వారిని ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పడానికి, మంచి సలహా ఇవ్వడానికి ఎవరూ లేరు.
29 Hepsi bomboş, yaptıkları da bir hiç. Halkın putları yalnızca yeldir, sıfırdır.”
౨౯వారంతా మోసగాళ్ళు. వారు చేసేది మాయ. వారి విగ్రహాలు శూన్యం. అవి వట్టి గాలిలాంటివి.