< Yaratiliş 36 >
1 Esav'ın, yani Edom'un öyküsü:
౧ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది.
2 Esav şu Kenanlı kızlarla evlendi: Hititli Elon'un kızı Âda; Hivli Sivon'un torunu, Âna'nın kızı Oholivama;
౨ఏశావు హిత్తీయుడైన ఏలోను కూతురు ఆదా, హివ్వీయుడైన సిబ్యోను కూతురైన అనా కూతురు అహోలీబామా,
3 Nevayot'un kızkardeşi, İsmail'in kızı Basemat.
౩ఇష్మాయేలు కూతురు, నెబాయోతు సోదరి అయిన బాశెమతు అనే కనాను యువతులను పెళ్ళి చేసుకున్నాడు.
4 Âda Esav'a Elifaz'ı, Basemat Reuel'i,
౪ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు.
5 Oholivama Yeuş, Yalam ve Korah'ı doğurdu. Esav'ın Kenan ülkesinde doğan oğulları bunlardı.
౫అహోలీబామా యూషును, యాలామును, కోరహును కన్నది. వీరు కనాను దేశంలో ఏశావుకు పుట్టిన కొడుకులు.
6 Esav karılarını, oğullarını, kızlarını, evindeki bütün adamlarını, hayvanlarının hepsini, Kenan ülkesinde kazandığı malların tümünü alıp kardeşi Yakup'tan ayrıldı, başka bir ülkeye gitti.
౬ఏశావు తన భార్యలనూ కుమారులనూ కూతుళ్ళనూ తన ఇంటివారందరినీ తన మందలనూ పశువులనూ తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి అంతటినీ తీసుకుని తన తమ్ముడైన యాకోబు నుండి దూరంగా మరొక దేశానికి వెళ్ళిపోయాడు.
7 Birlikte yaşayamayacak kadar çok malları vardı. Yabancı olarak yaşadıkları bu topraklar davarlarına yetmiyordu.
౭వారు విస్తారమైన సంపద గలవారు కాబట్టి వారు కలిసి నివసించలేక పోయారు. వారి పశువులు అధికంగా ఉండడం వలన వారు నివసించే స్థలం వారిద్దరికీ సరిపోలేదు.
8 Esav –Edom– Seir dağlık bölgesine yerleşti.
౮కాబట్టి ఏశావు శేయీరు కొండ ప్రాంతంలో నివసించాడు. ఏశావుకు మరొక పేరు ఎదోము.
9 Seir dağlık bölgesine yerleşen Edomlular'ın atası Esav'ın soyu:
౯శేయీరు కొండ ప్రాంతంలో నివసించిన ఎదోమీయుల మూల పురుషుడైన ఏశావు వంశావళి ఇది.
10 Esav'ın oğullarının adları şunlardır: Esav'ın karılarından Âda'nın oğlu Elifaz, Basemat'ın oğlu Reuel.
౧౦ఏశావు కొడుకుల పేర్లు, ఏశావు భార్య ఆదా కొడుకు ఎలీఫజు, మరొక భార్య బాశెమతు కొడుకు రగూయేలు.
11 Elifaz'ın oğulları: Teman, Omar, Sefo, Gatam, Kenaz.
౧౧ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.
12 Timna Esav'ın oğlu Elifaz'ın cariyesiydi. Elifaz'a Amalek'i doğurdu. Bunlar Esav'ın karısı Âda'nın torunlarıdır.
౧౨ఆమె కొడుకు అమాలేకు. వీరంతా ఏశావు భార్య అయిన ఆదాకు మనుమలు.
13 Reuel'in oğulları: Nahat, Zerah, Şamma, Mizza. Bunlar Esav'ın karısı Basemat'ın torunlarıdır.
౧౩రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతుకు మనుమలు.
14 Sivon'un torunu ve Âna'nın kızı olan Esav'ın karısı Oholivama'nın Esav'a doğurduğu oğullar şunlardır: Yeuş, Yalam, Korah.
౧౪ఏశావుకున్న మరొక భార్య సిబ్యోను కూతురు అయిన అనా కూతురు అహొలీబామా. ఈమె ఏశావుకు కన్న కొడుకులు యూషు, యాలాము, కోరహు.
15 Esavoğulları'nın boy beyleri şunlardır: Esav'ın ilk oğlu Elifaz'ın oğulları: Teman, Omar, Sefo, Kenaz,
౧౫ఏశావు కొడుకుల్లో తెగల నాయకులు ఎవరంటే, ఏశావు మొదటి సంతానమైన ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, కనజు,
16 Korah, Gatam, Amalek. Bunlar Edom ülkesinde Elifaz'ın soyundan beylerdi ve Âda'nın torunlarıydı.
౧౬కోరహు, గాతాము, అమాలేకు. వీరు ఎదోము దేశంలో ఎలీఫజు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య ఆదాకు మనుమలు.
17 Esav oğlu Reuel'in oğulları şunlardır: Nahat, Zerah, Şamma, Mizza. Bunlar Edom ülkesinde Reuel'in soyundan gelen beylerdi ve Esav'ın karısı Basemat'ın torunlarıydı.
౧౭ఏశావు కొడుకైన రగూయేలు కొడుకులు నహతు, జెరహు, షమ్మా, మిజ్జా. వీరు ఎదోము దేశంలో రగూయేలు నుండి వచ్చిన నాయకులు. వీరు ఏశావు భార్య బాశెమతు మనుమలు.
18 Esav'ın karısı Oholivama'nın oğulları şunlardır: Yeuş, Yalam, Korah. Bunlar Âna'nın kızı olan Esav'ın karısı Oholivama'nın soyundan gelen beylerdi.
౧౮ఇక ఏశావు భార్య, అనా కూతురు అయిన అహొలీబామా కొడుకులు యూషు, యగ్లాము, కోరహు. వీరు అహొలీబామా పుత్రసంతానపు నాయకులు.
19 Bunların hepsi Esav'ın –Edom'un– oğullarıdır. Yukardakiler de onların beyleridir.
౧౯వీరంతా ఎదోము అనే ఏశావు కొడుకులు, వారి వారి సంతానపు తెగల నాయకులు.
20 Ülkede yaşayan Horlu Seir'in oğulları şunlardı: Lotan, Şoval, Sivon, Âna,
౨౦ఎదోము దేశంలో ఆదినుండీ నివసించిన హోరీయుడైన శేయీరు కొడుకులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
21 Dişon, Eser, Dişan. Seir'in Edom'da beylik eden Horlu oğulları bunlardı.
౨౧దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశంలోని శేయీరు కొడుకులైన హోరీయుల నాయకులు.
22 Lotan'ın oğulları: Hori, Hemam. Timna Lotan'ın kızkardeşiydi.
౨౨లోతాను కొడుకులు హోరీ, హేమాను. లోతాను సోదరి తిమ్నా.
23 Şoval'ın oğulları: Alvan, Manahat, Eval, Şefo, Onam.
౨౩శోబాలు కొడుకులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము.
24 Sivon'un oğulları: Aya ve Âna. Babası Sivon'un eşeklerini güderken çölde sıcak su kaynakları bulan Âna'dır bu.
౨౪సిబ్యోను కొడుకులు అయ్యా, అనా అనేవారు. ఈ అనా తన తండ్రి సిబ్యోనుకు చెందిన గాడిదలను మేపుతూ ఉండగా మొదటి సారిగా అరణ్యంలో ఉష్ణధారలు కనుగొన్నాడు.
25 Âna'nın çocukları şunlardı: Dişon ve Âna'nın kızı Oholivama.
౨౫అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా.
26 Dişon'un oğulları şunlardı: Hemdan, Eşban, Yitran, Keran.
౨౬దిషోను కొడుకులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను,
27 Eser'in oğulları şunlardı: Bilhan, Zaavan, Akan.
౨౭ఏసెరు కొడుకులు బిల్హాను, జవాను, అకాను.
28 Dişan'ın oğulları şunlardı: Ûs, Aran.
౨౮దీషాను కొడుకులు ఊజు, అరాను.
29 Horlu boy beyleri şunlardı: Lotan, Şoval, Sivon, Âna,
౨౯హోరీయుల నాయకులు ఎవరంటే, లోతాను, శోబాలు, సిబ్యోను, అనా,
30 Dişon, Eser, Dişan. Seir ülkesindeki Horlu boy beyleri bunlardı.
౩౦దిషోను, ఏసెరు, దీషాను. శేయీరు దేశంలోని వారి నాయకుల జాబితా ప్రకారం వీరు హోరీయుల నాయకులు.
31 İsrailliler'i yöneten bir kralın olmadığı dönemde, Edom'u şu krallar yönetti:
౩౧ఇశ్రాయేలీయుల మీద ఏ రాజూ పరిపాలన చేయక ముందే, ఎదోమును పరిపాలించిన రాజులు ఎవరంటే,
32 Beor oğlu Bala Edom Kralı oldu. Kentinin adı Dinhava'ydı.
౩౨బెయోరు కొడుకు బెల ఎదోములో పాలించాడు. అతని ఊరు దిన్హాబా.
33 Bala ölünce, yerine Bosralı Zerah oğlu Yovav geçti.
౩౩బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కొడుకు యోబాబు రాజయ్యాడు.
34 Yovav ölünce, Temanlılar ülkesinden Huşam kral oldu.
౩౪యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడు హుషాము రాజయ్యాడు.
35 Huşam ölünce, Midyan'ı Moav kırlarında bozguna uğratan Bedat oğlu Hadat kral oldu. Kentinin adı Avit'ti.
౩౫హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బదదు కొడుకు హదదు రాజయ్యాడు. అతని ఊరు అవీతు.
36 Hadat ölünce, yerine Masrekalı Samla geçti.
౩౬హదదు చనిపోయిన తరువాత మశ్రేకా వాడైన శమ్లా రాజయ్యాడు.
37 Samla ölünce, yerine Rehovot-Hannaharlı Şaul geçti.
౩౭శమ్లా చనిపోయిన తరువాత నదీతీర ప్రాంతమైన రహెబోతుకు చెందిన షావూలు రాజయ్యాడు.
38 Şaul ölünce, yerine Akbor oğlu Baal-Hanan geçti.
౩౮షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్ హానాను రాజయ్యాడు.
39 Akbor oğlu Baal-Hanan ölünce, yerine Hadat geçti. Kentinin adı Pau'ydu. Karısı, Me-Zahav kızı Matret'in kızı Mehetavel'di.
౩౯అక్బోరు కొడుకు బయల్ హానాను చనిపోయిన తరువాత హదరు రాజయ్యాడు. అతని ఊరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు మనుమరాలు అయిన మత్రేదు కూతురు.
40 Boylarına ve bölgelerine göre Esav'ın soyundan gelen beylerin adları şunlardı: Timna, Alva, Yetet,
౪౦వారివారి తెగల ప్రకారం వారివారి ప్రాంతాల్లో వారివారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లు ఏవంటే, తిమ్నా, అల్వా, యతేతు,
41 Oholivama, Ela, Pinon,
౪౧అహొలీబామా, ఏలా, పీనోను,
౪౨కనజు, తేమాను, మిబ్సారు,
43 Magdiel, İram. Sahip oldukları ülkede yaşadıkları yerlere adlarını veren Edom beyleri bunlardı. Edomlular'ın atası Esav'dı.
౪౩మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు.