< 2 Samuel 6 >

1 Davut İsrail'deki bütün seçme adamları topladı. Sayıları otuz bin kişiydi.
దేవుని నామాన్ని వెల్లడి పరుస్తూ కెరూబుల మధ్య నివసించే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా దేవుని మందసం బాలా యెహూదాలో ఉంది.
2 Böylece Davut'la ordusu, sandığın üzerindeki Keruvlar arasında taht kuran Her Şeye Egemen RAB'bin adıyla anılan Tanrı'nın Sandığı'nı getirmek için Baale-Yahuda'ya gittiler.
ఆ మందసాన్ని అక్కడి నుండి తీసుకు రావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి ముప్ఫై వేల మందిని సమకూర్చి బయలుదేరాడు.
3 Tanrı'nın Sandığı'nı Avinadav'ın tepedeki evinden alıp yeni bir arabaya koydular. Tanrı'nın Sandığı'nı taşıyan yeni arabayı Avinadav'ın oğulları Uzza'yla Ahyo sürüyordu. Ahyo sandığın önünden yürüyordu.
వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబీనాదాబు ఇంటి నుండి తీసుకు బయలుదేరినప్పుడు అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యో కొత్త బండిని తోలారు.
4
దేవుని మందసం ఉన్న ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తెస్తున్నప్పుడు అహ్యో బండికి ముందు నడిచాడు.
5 Bu arada Davut'la bütün İsrail halkı da RAB'bin önünde lir, çenk, tef, çıngırak ve ziller eşliğinde ezgiler okuyarak var güçleriyle bu olayı kutluyorlardı.
దావీదు, ఇశ్రాయేలీయులంతా దేవదారు చెట్టుకలపతో చేసిన రకరకాల సితారాలు, సన్నాయి వాయిద్యాలు, తంబురలు, మృదంగాలు, పెద్ద డప్పులు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యం చేస్తున్నారు.
6 Nakon'un harman yerine vardıklarında öküzler tökezledi. Bu nedenle Uzza elini uzatıp Tanrı'nın Sandığı'nı tuttu.
వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు.
7 RAB Tanrı saygısızca davranan Uzza'ya öfkelenerek onu orada yere çaldı. Uzza Tanrı'nın Sandığı'nın yanında öldü.
వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు.
8 Davut, RAB'bin Uzza'yı cezalandırmasına öfkelendi. O günden bu yana oraya Peres-Uzza denilir.
యెహోవా ఉజ్జాను అంతం చేసిన ఆ చోటికి పెరెజ్‌ ఉజ్జా అని పేరు పెట్టారు.
9 Davut o gün RAB'den korkarak, “RAB'bin Sandığı nasıl olur da bana gelir?” diye düşündü.
ఇప్పటికీ దాని పేరు అదే. ఆ రోజున దావీదు భయపడి “యెహోవా మందసం నా దగ్గర ఉండడం ఎందుకు?” అనుకున్నాడు.
10 RAB'bin Sandığı'nı Davut Kenti'ne götürmek istemedi. Bunun yerine sandığı Gatlı Ovet-Edom'un evine götürdü.
౧౦కాబట్టి యెహోవా మందసాన్ని దావీదు తనతోబాటు పట్టణంలోకి తేవడానికి ఇష్టపడ లేదు. గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటికి తీసుకు వచ్చి అక్కడ ఉంచాడు.
11 RAB'bin Sandığı Gatlı Ovet-Edom'un evinde üç ay kaldı. RAB Ovet-Edom'u ve bütün ailesini kutsadı.
౧౧యెహోవా మందసం గిత్తీయుడైన ఓబేదెదోము ఇంట్లో మూడు నెలలపాటు ఉన్నప్పుడు యెహోవా ఓబేదెదోమునూ, అతని కుటుంబాన్నీ ఆశీర్వదించాడు.
12 “Tanrı'nın Sandığı'ndan ötürü RAB Ovet-Edom'un ailesini ve ona ait her şeyi kutsadı” diye Kral Davut'a bildirildi. Böylece Davut gidip Tanrı'nın Sandığı'nı Ovet-Edom'un evinden Davut Kenti'ne sevinçle getirdi.
౧౨దేవుని మందసం ఓబేదెదోము ఇంట్లో ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోముకూ, అతని కుటుంబానికీ ఉన్నదానినంతా విస్తారంగా అభివృద్ధి చెందిస్తున్నాడన్న సంగతి దావీదుకు తెలిసింది. కాబట్టి దావీదు వెళ్లి ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు పట్టణానికి ఊరేగింపుగా తీసికువచ్చాడు.
13 RAB'bin Sandığı'nı taşıyanlar altı adım atınca, Davut bir boğayla besili bir dana kurban etti.
౧౩ఎలాగంటే, యెహోవా మందసాన్ని మోసేవారు ఆరు అడుగులు ముందుకు నడచినప్పుడల్లా ఒక ఎద్దును, ఒక కొవ్విన దూడను వధించారు,
14 Keten efod kuşanmış Davut, RAB'bin önünde var gücüyle oynuyordu.
౧౪దావీదు నారతో నేసిన ఏఫోదును ధరించి పరమానందంగా యెహోవా సన్నిధిలో పరవశించి నాట్యం చేశాడు.
15 Davut'la bütün İsrail halkı, sevinç naraları ve boru sesi eşliğinde RAB'bin Sandığı'nı getiriyorlardı.
౧౫ఈ విధంగా దావీదు, ఇశ్రాయేలీయులంతా ఉత్సాహంగా తంతి వాయిద్యాలు వాయిస్తూ యెహోవా మందసాన్ని తీసుకు వచ్చారు.
16 RAB'bin Sandığı Davut Kenti'ne varınca, Saul'un kızı Mikal pencereden baktı. RAB'bin önünde oynayıp zıplayan Kral Davut'u görünce, onu küçümsedi.
౧౬యెహోవా మందసం దావీదు పట్టణానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూసింది. యెహోవా సన్నిధిలో గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న దావీదును చూసి, తన మనస్సులో అతన్ని గూర్చి నీచంగా భావించుకుంది.
17 RAB'bin Sandığı'nı getirip Davut'un bu amaçla kurduğu çadırın içindeki yerine koydular. Davut RAB'be yakmalık sunular ve esenlik sunuları sundu.
౧౭వారు యెహోవా మందసాన్ని తీసుకువచ్చి దావీదు దాని కోసం ఏర్పాటు చేసిన గుడారంలో ఉంచినప్పుడు, దావీదు యెహోవా సన్నిధిలో హోమబలులు, శాంతిబలులు అర్పించాడు.
18 Yakmalık sunuları ve esenlik sunularını sunmayı bitirince, Her Şeye Egemen RAB'bin adıyla halkı kutsadı.
౧౮హోమబలులు, శాంతిబలులు అర్పించడం ముగిసిన తరువాత దావీదు సైన్యాలకు అధిపతి అయిన యెహోవా పేరట ప్రజలను ఆశీర్వదించాడు.
19 Ardından kadın erkek herkese, bütün İsrail topluluğuna birer somun ekmekle birer hurma ve üzüm pestili dağıttı. Sonra herkes evine döndü.
౧౯సమావేశమైన ఇశ్రాయేలీయుల్లో స్త్రీ పురుషులందరికీ రొట్టె, మాంసం, ఎండు ద్రాక్షముద్ద ఒక్కొక్కటి చొప్పున పంచిపెట్టాడు. తరువాత ప్రజలంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
20 Davut ailesini kutsamak için eve döndüğünde, Saul'un kızı Mikal onu karşılamaya çıktı. Davut'a şöyle dedi: “İsrail Kralı bugün ne güzel bir ün kazandırdı kendine! Değersiz biri gibi, kullarının cariyeleri önünde soyundun.”
౨౦దావీదు తన ఇంటివారిని దీవించడానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె “ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుటా సేవకుల ఎదుటా ఈ రోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు! ఎవడో పనికిమాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేసాడు” అంది. అప్పుడు దావీదు,
21 Davut, “Baban ve bütün soyu yerine beni seçen ve halkı İsrail'e önder atayan RAB'bin önünde oynadım!” diye karşılık verdi, “Evet, RAB'bin önünde oynayacağım.
౨౧“నీ తండ్రినీ, అతని సంతానాన్నీ తోసిపుచ్చి ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించడానికి నన్ను ఎన్నుకొన్న యెహోవా సన్నిధిలో నేను అలా చేశాను. యెహోవా సన్నిధిలో నాట్యం చేశాను.
22 Üstelik kendimi bundan daha da küçük düşüreceğim, hiçe sayacağım. Ama sözünü ettiğin o cariyeler beni onurlandıracaklar.”
౨౨నేను ఇంతకన్నా మరింత హీనంగా నా దృష్టికి నేను తక్కువ వాడనై నువ్వు చెబుతున్న బానిస స్త్రీల దృష్టిలో గొప్పవాడినవుతాను” అని మీకాలుతో అన్నాడు.
23 Saul'un kızı Mikal'ın ölene dek çocuğu olmadı.
౨౩సౌలు కుమార్తె మీకాలుకు ఆమె చనిపోయేంత వరకూ పిల్లలు పుట్టలేదు.

< 2 Samuel 6 >