< 1 Tarihler 26 >
1 Kapı nöbetçilerinin bölükleri: Korahlılar'dan: Asafoğulları'ndan Kore oğlu Meşelemya.
౧ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు.
2 Meşelemya'nın oğulları: İlk oğlu Zekeriya, ikincisi Yediael, üçüncüsü Zevadya, dördüncüsü Yatniel,
౨మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు.
3 beşincisi Elam, altıncısı Yehohanan, yedincisi Elyehoenay.
౩ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు.
4 Ovet-Edom'un oğulları: İlk oğlu Şemaya, ikincisi Yehozavat, üçüncüsü Yoah, dördüncüsü Sakâr, beşincisi Netanel,
౪దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు,
5 altıncısı Ammiel, yedincisi İssakar, sekizincisi Peulletay. Çünkü Tanrı Ovet-Edom'u kutsamıştı.
౫అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు.
6 Ovet-Edom'un oğlu Şemaya'nın oğulları vardı. Bunlar yetenekli olduklarından boy başlarıydılar.
౬అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు.
7 Şemaya'nın oğulları: Otni, Refael, Ovet, Elzavat. Şemaya'nın akrabaları Elihu ile Şemakya da yiğit adamlardı.
౭షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా.
8 Bunların tümü Ovet-Edom soyundandı. Onlar da, oğullarıyla akrabaları da yiğit, görevlerinde becerikli kişilerdi. Ovet-Edom soyundan 62 kişi vardı.
౮ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు.
9 Meşelemya'nın 18 becerikli oğlu ve akrabası vardı.
౯మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది.
10 Merarioğulları'ndan Hosa'nın oğulları: İlki Şimri'ydi. –Şimri ilk oğul olmadığı halde babası onu önder atamıştı.–
౧౦మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు.
11 İkincisi Hilkiya, üçüncüsü Tevalya, dördüncüsü Zekeriya. Hosa'nın oğullarıyla akrabalarının toplamı 13 kişiydi.
౧౧రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు.
12 RAB'bin Tapınağı'nda Levili kardeşleri gibi görev yapan kapı nöbetçisi bölükler ve başlarındaki adamlar bunlardır.
౧౨ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది.
13 Her kapı için her aile büyük, küçük ayırmadan kura çekti.
౧౩చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు.
14 Kurada Doğu Kapısı Şelemya'ya düştü. Sonra bilge bir danışman olan oğlu Zekeriya için kura çekildi. Ona Kuzey Kapısı düştü.
౧౪తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది.
15 Güney Kapısı Ovet-Edom'a, depo için çekilen kura da oğullarına düştü.
౧౫ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది.
16 Batı Kapısı ile yukarı yol üzerindeki Şalleket Kapısı için çekilen kuralar Şuppim'le Hosa'ya düştü. Her ailenin nöbet zamanları sırayla birbirini izliyordu.
౧౬షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది.
17 Doğu Kapısı'nda günde altı, Kuzey Kapısı'nda dört, Güney Kapısı'nda dört, depolarda da ikişerden dört Levili nöbetçi vardı.
౧౭తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ,
18 Batı Kapısı'na bakan avlu içinse, yolda dört, avluda iki nöbetçi bekliyordu.
౧౮బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు.
19 Korah ve Merari soyundan gelen kapı nöbetçilerinin bölükleri bunlardı.
౧౯కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి.
20 Levili Ahiya Tanrı'nın Tapınağı'nın hazinelerinden ve Tanrı'ya adanmış armağanlardan sorumluydu.
౨౦చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది.
21 Ladanoğulları: Ladan soyundan gelen Gerşonoğulları, Ladan boyunun boy başları Gerşonlu Yehieli ve oğullarıydı.
౨౧ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది.
22 Yehieli'nin oğulları: Zetam'la kardeşi Yoel. Bunlar RAB'bin Tapınağı'nın hazinelerinden sorumluydu.
౨౨యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు.
23 Amram, Yishar, Hevron, Uzziel soylarından şu kişilere görev verildi:
౨౩ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది.
24 Musa oğlu Gerşom'un soyundan Şevuel tapınak hazinelerinin baş sorumlusuydu.
౨౪మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది.
25 Eliezer soyundan gelen kardeşleri: Rehavya Eliezer'in oğluydu, Yeşaya Rehavya'nın oğluydu, Yoram Yeşaya'nın oğluydu, Zikri Yoram'ın oğluydu, Şelomit Zikri'nin oğluydu.
౨౫ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే, అతని కొడుకు రెహబ్యా, రెహబ్యా కొడుకు యెషయా, యెషయా కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు జిఖ్రీ, జిఖ్రీ కొడుకు షెలోమీతు.
26 Şelomit'le kardeşleri boy başlarının, Kral Davut'un binbaşılarının, yüzbaşılarının ve öbür ordu komutanlarının verdiği armağanların saklandığı hazinelerden sorumluydular.
౨౬రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు.
27 Bunlar savaşta yağmalanan mallardan bir kısmını RAB'bin Tapınağı'nın onarımı için ayırdılar.
౨౭యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు.
28 Bilici Samuel'in, Kiş oğlu Saul'un, Ner oğlu Avner'in, Seruya oğlu Yoav'ın verdiği armağanlarla öbür armağanlardan da Şelomit'le kardeşleri sorumluydu.
౨౮ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు.
29 Yisharlılar'dan: Kenanya ile oğulları İsrail'de memur ve yargıç olarak tapınak dışındaki işlere bakmakla görevlendirildiler.
౨౯ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు.
30 Hevronlular'dan: Haşavya ile kardeşleri –bin yedi yüz yiğit adam– RAB'bin işlerine ve kralın hizmetine bakmak için İsrail'in Şeria Irmağı'nın batı yakasında kalan bölgesine atanmıştı.
౩౦ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు.
31 Aile soy kütüğündeki kayıtlara göre Yeriya Hevronlular'ın boy başıydı. Davut'un krallığının kırkıncı yılında kayıtlar incelendi ve Gilat'taki Yazer'de Hevronlular arasında yiğit savaşçılar bulundu.
౩౧ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు.
32 Yeriya'nın aile başları olan iki bin yedi yüz akrabası vardı. Kral Davut bu yiğit adamları Tanrı'nın ve kralın işlerine bakmaları için Rubenliler'e, Gadlılar'a, Manaşşe oymağının yarısına yönetici olarak atadı.
౩౨పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు.