< రోమీయులకు 11 >
1 ౧ అలాగైతే నేనడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచి పెట్టేశాడా? కానే కాదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను.
Afei mibisa se, Onyankopɔn atow ne man akyene ana? Dabi da. Mʼankasa meyɛ Israelni na meyɛ Abraham aseni a mifi Benyamin abusua mu.
2 ౨ తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచి పెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది మీకు తెలియదా? అదేవిధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో విన్నవించుకొన్నాడో తెలియదా?
Onyankopɔn ampo ne nkurɔfo a oyii wɔn mfiase no. Munim nea Kyerɛwsɛm no ka fa Elia ho sɛnea ɔkasa tiaa Israelfo wɔ Onyankopɔn anim se,
3 ౩ “ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడదోశారు. నేనొక్కడినే మిగిలాను. వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.”
“Awurade, wɔakum wʼadiyifo na wɔadwiriw wʼafɔremuka, na me nko na maka a wɔpɛ sɛ wokum me.”
4 ౪ అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”
Mmuae bɛn na Onyankopɔn de maa no? Onyankopɔn kae se, “Mewɔ nnipa mpem ason a wɔnsom ɔbosom Baal.”
5 ౫ అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది.
Saa ara nso na ɛte nnɛ. Nnipa kakraa bi wɔ hɔ a Onyankopɔn nam ne dom so ayi wɔn.
6 ౬ అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు.
Yi a wayi wɔn no gyina nʼadom so na ɛnyɛ wɔn nnwuma so. Na sɛ Onyankopɔn yi a oyi nnipa no gyina wɔn nnwuma so a, ɛno de na adom no nyɛ adom turodoo.
7 ౭ అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
Ɛno de na ɛne dɛn? Nea Israelfo tiw akyi hwehwɛe no, wɔn nsa anka, na mmom kakraa a Onyankopɔn ayi wɔn no de, wɔn nsa kae. Wɔn a wɔaka no pirim wɔn koma
8 ౮ దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.
sɛnea Kyerɛwsɛm no ka se, “Onyankopɔn maa wɔn honhom a ɛyɛ bɔtee, ani a ɛmma wonhu ade aso a ɛmma wɔnte asɛm, de besi nnɛ.”
9 ౯ దీనికి దావీదు ఏమన్నాడంటే, “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక.
Na Dawid ka se, “Ma wɔn didipon a esi wɔn anim nyi wɔn sɛ afiri na wɔnhwehwe ase na wɔntwe wɔn aso!
10 ౧౦ వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక. వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.”
Ma wɔn ani so nyɛ wɔn kusuu na wɔanhu ade; na wɔn akyi nkuntun afebɔɔ.”
11 ౧౧ కాబట్టి నేనడిగేది ఏమిటంటే, వారు పడిపోవడం కోసమే తొట్రుపడ్డారా? అలా కానేకాదు. వారి తొట్రుపాటు వలన యూదేతరులకు పాపవిమోచన కలిగి, అది యూదులు రోషం తెచ్చుకోడానికి కారణమైంది.
Afei mibisa se, bere a Yudafo yɛɛ bɔne no, ɛde wɔn kɔɔ ɔsɛe mu ana? Dabi! Amanamanmufo nam Yudafo no bɔne a wɔyɛɛ no so nyaa nkwagye. Eyi maa Yudafo no twee wɔn ho ninkunu.
12 ౧౨ వారి అపరాధం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుందో!
Yudafo no bɔne a wɔyɛɛ no de nnepa brɛɛ wiase na wɔn honhom mu hia a wodii no nso de ahonya brɛɛ amanamanmufo. Na ɛba sɛ Yudafo no mu bebree bɛka wɔn ho a nhyira mmoroso bɛn na ɛremma?
13 ౧౩ యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను యూదేతరులకు అపొస్తలుడుగా ఉన్నందుకు నా పరిచర్య విషయంలో అతిశయిస్తాను.
Afei merekasa akyerɛ mo amanamanmufo: Esiane sɛ meyɛ amanamanmufo ɔsomafo nti, mehoahoa me ho wɔ adwuma a wɔde ahyɛ me nsa no ho.
14 ౧౪ ఎలాగైనా నా రక్తసంబంధులకు రోషం కలిగించడం ద్వారా వారిలో కొందరినైనా రక్షించాలని నా కోరిక.
Sɛ ebetumi a, mɛma wɔn a wɔyɛ me nuanom Yudafo no kɔn adɔ nea mo amanamanmufo nsa aka yi bi, na wɔnam so agye wɔn mu bi nkwa.
15 ౧౫ వారు తిరస్కారం పొందడం లోకాన్ని దేవునితో సమాధానపరచడం అయితే, వారిని స్వీకరించడం చనిపోయిన వారు సజీవులుగా లేచినట్టే అవుతుంది గదా?
Na sɛ wɔn po a wɔpoo wɔn no ama Onyankopɔn ne wiasefo aka abɔ mu a, ɛno de sɛ Onyankopɔn twe wɔn bata ne ho a ɛbɛyɛ dɛn? Ɛbɛyɛ nkwa ama awufo.
16 ౧౬ ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్దంతా పవిత్రమే. వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.
Sɛ wɔde brodo sin ma Onyankopɔn a, ɛno de, na ne mu nyinaa yɛ ne dea. Saa ara nso na sɛ dua no ntin yɛ kronkron a, ne mman no nyinaa nso yɛ kronkron.
17 ౧౭ అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే,
Wɔapenpan ngodua a wɔahyɛ da adua no mman no bi agu, na wɔde ngodua a wɔanhyɛ da annua no mman abɛhyɛ nʼanan mu. Mo amanamanmufo no te sɛ ngodua a wɔanhyɛ da annua, nanso afei de, mo ne Yudafo no nyinaa nya Onyankopɔn dom a wɔde adom wɔn no pɛ.
18 ౧౮ నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు.
Nanso monhwɛ yiye na moanhoahoa mo ho sɛ wɔde mo asi mman a wɔapenpan no anan mu. Monkae sɛ moyɛ mman kɛkɛ, na monyɛ ntin.
19 ౧౯ అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు.
Na mobɛka se, “Eye, wobubuu mman no sɛ wɔmfa me nsi wɔn anan mu.”
20 ౨౦ నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు.
Yiw, nanso monkae sɛ wɔpenpan saa mman a ɛyɛ Yudafo no, efisɛ wɔannye Onyankopɔn anni, na mugye di nti na mowɔ hɔ. Mommma mo ho so, na mmom munsuro nea ebetumi asi.
21 ౨౧ ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా!
Na sɛ Onyankopɔn amfa Yudafo a wɔte sɛ ngodua pa mman no bɔne ankyɛ wɔn a, mususuw sɛ ɔde mo bɔne bɛkyɛ mo ana?
22 ౨౨ కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.
Enti monhwɛ Onyankopɔn ayamye ne ne denyɛ. Ɔyɛ den wɔ wɔn a wɔyɛɛ asoɔden no so, nanso ne yam ye ma mo wɔ bere a mode mo ho ato nʼayamye so. Na sɛ moamfa mo ho anto no so a, saa ara na wɔbɛpenpan mo.
23 ౨౩ అంతేకాక, వారు తమ అవిశ్వాసంలో కొనసాగకుండా వెనక్కి తిరిగితే వారిని తిరిగి అంటు కడతాడు. దేవుడు వారిని మళ్ళీ అంటు కట్టడానికి సమర్ధుడు.
Na sɛ Yudafo no gye di bio a, Onyankopɔn bɛsan de wɔn ayɛ dua no mman bio. Obetumi ayɛ saa.
24 ౨౪ ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటుకట్టగలడు కదా!
Na sɛ Onyankopɔn pɛɛ sɛ ɔde mo a moyɛ wuram ngodua mman bɛfam dua papa a ɔno ankasa adua ho de, anka ɛmfa ɔkwan mu a, ɛno de, ɔbɛpɛ no mmoroso sɛ ɔde Yudafo no bɛfam dua a ɛyɛ wɔn ankasa de no ho.
25 ౨౫ సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.
Me nuanom, ahintasɛm bi wɔ hɔ a mepɛ sɛ mote ase, sɛnea monnyɛ ahantan na monhoahoa mo ho. Yudafo no mu bi apirim wɔn koma, nanso sɛ amanamanmufo no nyinaa dan ba Kristo nkyɛn a ɛto betwa.
26 ౨౬ “విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.
Enti Israelfo nyinaa benya nkwagye. Mokae nea adiyifo no kaa wɔ eyi ho? “Agyenkwa no befi Sion aba, na obeyi amumɔyɛsɛm nyinaa afi Yakob asefo mu.
27 ౨౭ నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే” అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.
Na medi apam a mene wɔn ayɛ no so na mapepa wɔn bɔne.”
28 ౨౮ సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు.
Yudafo no bebree ayɛ Asɛmpa no atamfo. Na mo, amanamanmufo anya so mfaso, efisɛ Onyankopɔn de nʼakyɛde no ama mo. Nanso Yudafo yɛ ne man a wapaw wɔn ara, esiane bɔ a wahyɛ wɔn nenanom nti,
29 ౨౯ ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు.
efisɛ wɔrennan Onyankopɔn akyɛde ne ne frɛ no ani.
30 ౩౦ గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు.
Na mo amanamanmufo de, bere a atwam no mu, moyɛɛ asoɔden tiaa Onyankopɔn, nanso Yudafo no poo nʼahummɔbɔ no nti Onyankopɔn huu mo mmɔbɔ mmom.
31 ౩౧ అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు.
Saa ara nso na esiane adom a moanya no nti, mprempren, Yudafo no nso ayɛ asoɔden atia Onyankopɔn. Nanso nna bi akyi no wɔn nso benya Onyankopɔn adom no.
32 ౩౨ అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు. (eleēsē )
Onyankopɔn aka nnipa nyinaa ahyɛ wɔn asoɔden ase sɛnea ɔbɛyɛ adom ama obiara. (eleēsē )
33 ౩౩ ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి.
Ao Onyankopɔn ahonya ne nyansa ne nimdeɛ bun a mu dɔ! Hena na obetumi ahu nʼatemmu mu pɛɛpɛe, na wahu nea nʼakwan nenam.
34 ౩౪ “ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు?
“Hena na onim Awurade adwene anaasɛ hena na ɔyɛ ne fotufo?”
35 ౩౫ ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?”
“Hena na wama Onyankopɔn biribi kan a ɛsɛ sɛ Onyankopɔn tua no so ka?”
36 ౩౬ సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్. (aiōn )
Efisɛ ade nyinaa fi ne mu na ɛba, na ɛnam ne so na ɛba, na ɛbɛsan akɔ ne nkyɛn bio. Ɔno na anuonyam wɔ no daa daa. Amen. (aiōn )