< జెఫన్యా 1 >

1 యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
在阿孟的兒子約史亞為猶大王的時日,上主的話傳給希則克雅的曾孫,革達里雅的孫子,雇史的兒子索福尼亞。
2 “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
我必要由地面上掃除一切──上主的斷語──
3 మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.
我要掃除人和獸,我要掃除天空的鳥和海中的魚;我必使作惡的人倒斃,並由地面上剷除世人──上主的斷語。
4 “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి, బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.
我要伸手懲罰猶大和耶路撒冷所有的居民,我要由這地方剷除巴耳的記念和僧侶[司祭]的名字,
5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.
剷除那在露台上敬拜天象和那敬拜上主而又指米耳公起誓的人,
6 యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”
剷除那背離天主,不尋覓上主,不求問上主的人。
7 యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.
在我主上主面前要肅靜,因為上主的日子臨近了! 上主備辨了祭宴,祝福了衪邀請的人。
8 “యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను, రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.
在祭宴日內,我要懲罰公侯和王室,以及一切穿外邦衣服的人。
9 ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”
在那一天,我要懲罰一切跳過門檻,和使自己主人家充滿殘暴欺詐的人。
10 ౧౦ ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.
在那一天,──上主的斷語──必有喊聲發自魚門,必有哀號出自新區,必有利害的崩潰來自山陵。
11 ౧౧ కనానీయులంతా నాశనమయ్యారు. డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.
居於盆地的居民,你們應哀號! 因為一切商人都已被消滅,一切秤量銀子的人己被剷除。
12 ౧౨ ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.
那時,我必提上燈,搜索耶路撒冷,懲罰那躺臥在酒槽上,心下自謂:「上主不賞善,也不罰惡」的人。
13 ౧౩ వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.
他們的財物必遭擄掠;他們的家園必成廢墟;他們建築房屋,卻不得居住;他們種植葡萄園,卻不得酒飲。
14 ౧౪ యెహోవా మహా దినం దగ్గర పడింది. యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.
上主偉大的日子臨近了,臨近了! 且來的很快。哀哉! 上主火日子是苦的,連壯士那時也要哀號。
15 ౧౫ ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.
那天是憤怒的一天,困苦艱難的一天,破壞摧殘的一天,昏暗幽冥的一天,烏雲陰霾的一天;
16 ౧౬ ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.
是向堅城、碉堡吹號鳴角的一天!
17 ౧౭ ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.
我要使人苦惱,使他們行路有如瞎子,因為他們得罪了上主;他們的血流出有如塵土,他們的屍體有如糞土。
18 ౧౮ యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.
連他們的金銀財寶也不能救拔他們! 上主憤怒的日子,整個大地都要為衪的妒火所吞滅,因為衪要向地上的一切居民,執行徹底而又可怕的毀滅。

< జెఫన్యా 1 >