< జెఫన్యా 2 >
1 ౧ సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది.
Gather yourselves, gather together, O shameful nation,
2 ౨ విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి.
before the decree takes effect and the day passes like chaff, before the burning anger of the LORD comes upon you, before the Day of the LORD’s anger comes upon you.
3 ౩ దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.
Seek the LORD, all you humble of the earth who carry out His justice. Seek righteousness; seek humility. Perhaps you will be sheltered on the day of the LORD’s anger.
4 ౪ గాజా పట్టణం నిర్జనమై పోతుంది. అష్కెలోను పాడై పోతుంది. మధ్యాహ్నవేళలో అష్డోదువారిని బయటికి తరిమి వేయడం జరుగుతుంది. ఎక్రోను నగరాన్ని దున్నేస్తారు.
For Gaza will be abandoned, and Ashkelon left in ruins. Ashdod will be driven out at noon, and Ekron will be uprooted.
5 ౫ సముద్రప్రాంతాల్లో నివసించే కెరేతీయులారా, మీకు బాధ. ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే నీలో ఒక్కడూ కాపురం ఉండకుండా నేను నిన్ను లయం చేస్తాను.
Woe to the dwellers of the seacoast, O nation of the Cherethites! The word of the LORD is against you, O Canaan, land of the Philistines: “I will destroy you, and no one will be left.”
6 ౬ సముద్రప్రాంతం గొర్రెల కాపరులు విశ్రాంతి తీసుకునే మేత స్థలం అవుతుంది. మందలకు దొడ్లు అక్కడ ఉంటాయి.
So the seacoast will become a land of pastures, with wells for shepherds and folds for sheep.
7 ౭ తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.
The coast will belong to the remnant of the house of Judah; there they will find pasture. They will lie down in the evening among the houses of Ashkelon, for the LORD their God will attend to them and restore their captives.
8 ౮ మోయాబువారు వేసిన నింద, అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి. వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.
“I have heard the reproach of Moab and the insults of the Ammonites, who have taunted My people and threatened their borders.
9 ౯ నా జీవం తోడు మోయాబు దేశం సొదొమ పట్టణం వలె, అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి. అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి. నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు. నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.
Therefore, as surely as I live,” declares the LORD of Hosts, the God of Israel, “surely Moab will be like Sodom and the Ammonites like Gomorrah— a place of weeds and salt pits, a perpetual wasteland. The remnant of My people will plunder them; the remainder of My nation will dispossess them.”
10 ౧౦ వారు అతిశయపడి సేనల ప్రభువు అయిన యెహోవా ప్రజలను దూషించారు గనక వారి గర్వాన్నిబట్టి అది వారికి సంభవిస్తుంది.
This they shall have in return for their pride, for taunting and mocking the people of the LORD of Hosts.
11 ౧౧ ద్వీపాల్లో నివసించే వారంతా తమ స్థలాల నుండి తనకే నమస్కారం చేసేలా లోకంలోని దేవుళ్ళను ఆయన నిర్మూలం చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు.
The LORD will be terrifying to them when He starves all the gods of the earth. Then the nations of every shore will bow in worship to Him, each in its own place.
12 ౧౨ కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు.
“You too, O Cushites, will be slain by My sword.”
13 ౧౩ ఆయన ఉత్తరదేశం మీద తన హస్తం చాపి అష్షూరు దేశాన్ని నాశనం చేస్తాడు. నీనెవె పట్టణాన్ని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారిలాగా చేస్తాడు.
And He will stretch out His hand against the north and destroy Assyria; He will make Nineveh a desolation, as dry as a desert.
14 ౧౪ దానిలో మందలు విశ్రమిస్తాయి. అన్ని జాతుల పశువులు మందలుగా కూడుతాయి. పక్షులు, గుడ్లగూబలు వారి ద్వారాల పైకమ్ముల మీద వాలుతాయి. పక్షుల శబ్దాలు కిటికీల్లో వినబడతాయి. గడపల మీద నాశనం కనిపిస్తుంది. వారు చేసికున్న దేవదారు కర్రపని అంతటిని యెహోవా నాశనం చేస్తాడు.
Herds will lie down in her midst, creatures of every kind. Both the desert owl and screech owl will roost atop her pillars. Their calls will sound from the window, but desolation will lie on the threshold, for He will expose the beams of cedar.
15 ౧౫ “నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే. అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.” అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ, ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.
This carefree city that dwells securely, that thinks to herself: “I am it, and there is none besides me,” what a ruin she has become, a resting place for beasts. Everyone who passes by her hisses and shakes his fist.