< జెఫన్యా 1 >
1 ౧ యూదారాజు ఆమోను కుమారుడు యోషీయా దినాల్లో జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.
A palavra de Javé que veio a Sofonias, filho de Cushi, filho de Gedalias, filho de Amarias, filho de Ezequias, nos dias de Josias, filho de Amon, rei de Judá.
2 ౨ “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు.
Eu varrerei completamente tudo da superfície da terra, diz Yahweh.
3 ౩ మనుషులనేమి పశువులనేమి ఊడ్చివేస్తాను. ఆకాశ పక్షులను, సముద్రంలో చేపలను నాశనం చేస్తాను. దుర్జనులను, వారి శిథిలాలను నేను ఊడ్చివేస్తాను. భూమి మీద ఎవరూ లేకుండా మానవ జాతిని నిర్మూలం చేస్తాను.” ఇదే యెహోవా వాక్కు.
Eu vou varrer o homem e o animal. Varrerei os pássaros do céu, os peixes do mar e os montes de escombros com os ímpios. Eu vou cortar o homem da superfície da terra, diz Yahweh.
4 ౪ “నా హస్తాన్ని యూదా వారి మీద యెరూషలేము నివాసులందరి మీద చాపి, బయలు దేవుడి భక్తుల్లో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులైన వారిని, దాని అర్చకులను నిర్మూలం చేస్తాను.
Estenderei minha mão contra Judá e contra todos os habitantes de Jerusalém. Cortarei o resto de Baal deste lugar - o nome dos padres idólatras e pagãos,
5 ౫ మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.
aqueles que adoram o exército do céu nos telhados, aqueles que adoram e juram por Javé e também juram por Malcam,
6 ౬ యెహోవాను అనుసరించకుండా ఆయన్ని విసర్జించి ఆయన దగ్గర విచారణ చేయని వారిని నేను నిర్మూలం చేస్తాను.”
aqueles que voltaram atrás no seguimento de Javé, e aqueles que não procuraram Javé nem perguntaram por ele.
7 ౭ యెహోవా దినం సమీపించింది. ఆయన బలి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించాడు. యెహోవా ప్రభువు సన్నిధిలో మౌనంగా ఉండండి.
Silêncio perante a presença do Senhor Javé, pois o dia de Javé está próximo. Pois Yahweh preparou um sacrifício. Ele consagrou seus convidados.
8 ౮ “యెహోవాకు బలి అర్పించే దినాన అధిపతులను, రాజకుమారులను విదేశీయుల్లాగా బట్టలు వేసుకునే వారందరినీ నేను శిక్షిస్తాను.
No dia do sacrifício de Iavé acontecerá que castigarei os príncipes, os filhos do rei e todos aqueles que estiverem vestidos com roupas estrangeiras.
9 ౯ ఇళ్ళ గడపలు దాటి వచ్చి యజమాని ఇంటిని మోసంతో బలాత్కారంతో నింపే వారిని ఆ దినాన నేను శిక్షిస్తాను.”
Nesse dia, castigarei todos aqueles que saltarem o limiar, que encherem a casa de seu senhor de violência e engano.
10 ౧౦ ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.
Naquele dia, diz Yahweh, haverá o barulho de um grito do portão do peixe, um lamento do segundo quarto e um grande estrondo das colinas.
11 ౧౧ కనానీయులంతా నాశనమయ్యారు. డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.
Lamento, seus habitantes de Maktesh, pois todo o povo de Canaã está desfeito! Todos aqueles que foram carregados com prata são cortados.
12 ౧౨ ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను.
Acontecerá naquele momento, que eu procurarei Jerusalém com lâmpadas, e castigarei os homens que estão assentados em suas dragas, que dizem em seu coração: “Javé não fará o bem, nem fará o mal”.
13 ౧౩ వారి ఆస్తి దోపుడు సొమ్ముగా అవుతుంది. వారి ఇళ్ళు పాడైపోతాయి. వారు ఇళ్ళు కట్టుకుంటారు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుతారు గాని వాటి రసం తాగరు.
Sua riqueza se tornará um saque, e suas casas, uma desolação. Sim, eles construirão casas, mas não as habitarão. Eles plantarão vinhedos, mas não beberão seu vinho.
14 ౧౪ యెహోవా మహా దినం దగ్గర పడింది. యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.
O grande dia de Yahweh está próximo. Está próximo e se apressa muito, a voz do dia de Yahweh. O homem poderoso chora lá amargamente.
15 ౧౫ ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.
Esse dia é um dia de ira, um dia de angústia e angústia, um dia de angústia e ruína, um dia de escuridão e escuridão, um dia de nuvens e escuridão,
16 ౧౬ ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.
um dia de trombeta e alarme contra as cidades fortificadas e contra as altas ameias.
17 ౧౭ ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.
trarei tanta aflição aos homens que eles caminharão como cegos porque pecaram contra Yahweh. Seu sangue será derramado como pó e sua carne como esterco.
18 ౧౮ యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.
Nem sua prata nem seu ouro poderão entregá-los no dia da ira de Javé, mas toda a terra será devorada pelo fogo de seu ciúme; pois ele acabará, sim, com todos aqueles que habitam na terra.