< జెకర్యా 7 >

1 రాజైన దర్యావేషు పరిపాలనలో నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగవ దినాన యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది.
ויהי בשנת ארבע לדריוש המלך היה דבר יהוה אל זכריה בארבעה לחדש התשעי בכסלו׃
2 బేతేలువారు యెహోవాను బతిమాలుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును వారితో బాటు వారి మనుషులను పంపించారు.
וישלח בית אל שר אצר ורגם מלך ואנשיו לחלות את פני יהוה׃
3 మందిరం దగ్గరనున్న యాజకులతో ప్రవక్తలతో “ఇన్ని సంవత్సరాలుగా మేము దుఃఖించినట్టు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించమంటారా” అని మనవి చేశారు.
לאמר אל הכהנים אשר לבית יהוה צבאות ואל הנביאים לאמר האבכה בחדש החמשי הנזר כאשר עשיתי זה כמה שנים׃
4 సేనల ప్రభువు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
ויהי דבר יהוה צבאות אלי לאמר׃
5 “దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి. జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా? నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?
אמר אל כל עם הארץ ואל הכהנים לאמר כי צמתם וספוד בחמישי ובשביעי וזה שבעים שנה הצום צמתני אני׃
6 మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు? మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?
וכי תאכלו וכי תשתו הלוא אתם האכלים ואתם השתים׃
7 యెరూషలేములోనూ, దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశంలోనూ, పడమటి మైదాన భూముల్లోను ప్రజలు విస్తరించి క్షేమంగా ఉన్న కాలంలో పూర్వపు ప్రవక్తల ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకో లేదు గదా?”
הלוא את הדברים אשר קרא יהוה ביד הנביאים הראשנים בהיות ירושלם ישבת ושלוה ועריה סביבתיה והנגב והשפלה ישב׃
8 యెహోవా వాక్కు జెకర్యాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే,
ויהי דבר יהוה אל זכריה לאמר׃
9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
כה אמר יהוה צבאות לאמר משפט אמת שפטו וחסד ורחמים עשו איש את אחיו׃
10 ౧౦ వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
ואלמנה ויתום גר ועני אל תעשקו ורעת איש אחיו אל תחשבו בלבבכם׃
11 ౧౧ అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు.
וימאנו להקשיב ויתנו כתף סררת ואזניהם הכבידו משמוע׃
12 ౧౨ ధర్మశాస్త్రాన్ని గానీ, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సేనల ప్రభువు యెహోవా తన ఆత్మ ప్రేరణచేత తెలియజేసిన మాటలను గానీ, వినకుండా హృదయాలను వజ్రాల వలె కఠిన పరచుకున్నారు. కనుక సేనల ప్రభువు యెహోవా దగ్గర నుండి మహోగ్రత వారి మీదికి వచ్చింది.
ולבם שמו שמיר משמוע את התורה ואת הדברים אשר שלח יהוה צבאות ברוחו ביד הנביאים הראשנים ויהי קצף גדול מאת יהוה צבאות׃
13 ౧౩ కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.
ויהי כאשר קרא ולא שמעו כן יקראו ולא אשמע אמר יהוה צבאות׃
14 ౧౪ వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది. ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”
ואסערם על כל הגוים אשר לא ידעום והארץ נשמה אחריהם מעבר ומשב וישימו ארץ חמדה לשמה׃

< జెకర్యా 7 >