< జెకర్యా 6 >

1 నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతాలు ఇత్తడివి.
در یک رؤیای دیگر چهار ارابه دیدم که از میان دو کوه مسی بیرون آمدند.
2 మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,
ارابهٔ اول به‌وسیلۀ اسبهای سرخ، ارابهٔ دوم به‌وسیلۀ اسبهای سیاه،
3 మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలుగల బలమైన గుర్రాలు పూన్చి ఉన్నాయి.
ارابهٔ سوم به‌وسیله اسبهای سفید و ارابهٔ چهارم به‌وسیلۀ اسبهای ابلق کشیده می‌شدند.
4 “స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను.
از فرشته پرسیدم: «ای سرورم، اینها چه هستند؟»
5 అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు.
جواب داد: «اینها چهار روح آسمانی هستند که در حضور خداوند تمامی زمین می‌ایستند و اینک برای انجام فرمان او به حرکت درآمده‌اند.
6 నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.”
اسبهای سیاه به طرف شمال، اسبهای سفید به طرف غرب و اسبهای ابلق به طرف جنوب خواهند رفت.»
7 బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతట సంచరించడానికి సిద్ధంగా ఉండగా “పోయి లోక మంతటా సంచరించండి” అని అతడు చెప్పాడు. అప్పుడు అవి లోకమంతా సంచరించాయి.
اسبهای قوی بیتابی می‌کردند که حرکت کنند و در سراسر زمین بگردند. خداوند فرمود: «بروید و گشت خود را آغاز کنید.» پس آنها راه افتادند و تمام زمین را گشتند.
8 అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు.
آنگاه خداوند مرا احضار کرد و فرمود: «آنهایی که به سرزمین شمال رفتند، حکم مرا اجرا کرده خشم مرا در آنجا فرو نشاندند.»
9 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే
در پیامی دیگر خداوند به من فرمود:
10 ౧౦ చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి
«حلدای، طوبیا و یدعیا از طرف یهودیان تبعید شده در بابِل، هدایایی از طلا و نقره آورده‌اند. هدایا را از آنها بگیر و به خانهٔ یوشیا (پسر صفنیا) برو و با آنها تاجی بساز. سپس تاج را بر سر یهوشع (پسر یهوصادق) کاهن اعظم بگذار.
11 ౧౧ వారినడిగి వెండి బంగారాలు తీసుకుని, కిరీటం చేసి ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి
12 ౧౨ అతనితో ఇలా చెప్పు. “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు. అతడు యెహోవా ఆలయం కడతాడు.
به او بگو که خداوند لشکرهای آسمان چنین می‌فرماید:”تو نمونه‌ای هستی از آن مردی که «شاخه» نامیده می‌شود. او از جایی که هست جوانه خواهد زد و خانهٔ خداوند را بازسازی خواهد کرد.
13 ౧౩ అతడే యెహోవా ఆలయం కడతాడు. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి.
اوست آنکه خانهٔ خداوند را بنا می‌کند و از شکوه پادشاهی برخوردار می‌شود. او در مقام کاهن و پادشاه حکمرانی خواهد کرد، و بین این دو مقام هماهنگی کامل خواهد بود.“
14 ౧౪ ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. హేలెముకు, టోబీయాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడు హేనుకు స్మారక చిహ్నంగా ఉంటుంది.
سپس، این تاج را به عنوان هدیه‌ای از طرف حلدای، طوبیا، یدعیا و یوشیا در خانهٔ خداوند بگذار تا یادگاری باشد.»
15 ౧౫ దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”
مردمی که در جاهای دور دست زندگی می‌کنند، خواهند آمد و در بازسازی خانهٔ خداوند کمک خواهند کرد؛ آنگاه خواهید دانست که خداوند لشکرهای آسمان مرا نزد شما فرستاده است. این هنگامی اتفاق خواهد افتاد که شما از خداوند، خدای خویش کاملاً اطاعت کنید.

< జెకర్యా 6 >