< జెకర్యా 2 >
1 ౧ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు చేతిలో కొలనూలు పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు.
Sonra gözlerimi kaldırıp baktım, elinde ölçü ipi tutan bir adam vardı.
2 ౨ “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అతణ్ణి అడిగాను. అతడు “యెరూషలేము పట్టణం పొడవు, వెడల్పు ఎంత ఉందో చూసి కొలవడానికి వెళ్తున్నాను” అని చెప్పాడు.
“Nereye gidiyorsun?” diye sordum. Adam, “Yeruşalim'i ölçmeye, genişliğinin, uzunluğunun ne kadar olduğunu öğrenmeye gidiyorum” diye yanıtladı.
3 ౩ అప్పుడు నాతో మాట్లాడిన దూత బయలుదేరుతున్నప్పుడు మరో దూత అతనికి ఎదురు వచ్చాడు.
Benimle konuşan melek yanımdan ayrılınca başka bir melek onu karşılamaya çıktı.
4 ౪ ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు.
Önceki meleğe şöyle dedi: “Koş, o gence de ki, içinde barınacak sayısız insan ve hayvandan ötürü Yeruşalim sursuz bir kent olacak.
5 ౫ యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను.
RAB, ‘Ben kendim onun çevresinde ateşten sur ve içindeki görkem olacağım’ diyor.”
6 ౬ ఆకాశంలో నాలుగు దిక్కులకు వీచే గాలిలాగా మీరు చెదిరిపోయేలా చేశాను. ఉత్తర దేశాల్లో ఉన్న మీరంతా తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.
RAB, “Haydi! Haydi! Kuzey ülkesinden kaçın!” diyor, “Çünkü sizi göğün dört bucağına dağıttım.” Böyle diyor RAB.
7 ౭ సీయోను ప్రజలారా, బబులోను దేశంలో నివసిస్తున్న మీరు అక్కడ నుండి తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.
“Babil'de oturan Siyon halkı, haydi kaçıp kurtul!”
8 ౮ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మిమ్మల్ని దోచుకొన్న ఇతర దేశాల ప్రజల దగ్గరికి ఆయన నన్ను పంపించాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. అందువల్ల ఆయనకు ఘనత కలిగేలా,
Çünkü Her Şeye Egemen RAB beni onurlandırdı ve sizi yağmalamış uluslara şu haberle gönderdi: “Size dokunan gözbebeğime dokunmuş olur” diyor,
9 ౯ నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.
“Elimi onlara karşı kaldıracağım, köleleri onları yağmalayacak.” O zaman siz de beni Her Şeye Egemen RAB'bin gönderdiğini anlayacaksınız.
10 ౧౦ యెహోవా ఇలా అంటున్నాడు, సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను. సంతోష గీతాలు ఆలపించండి.
RAB, “Ey Siyon kızı, sevinçle bağır! Çünkü aranızda yaşamaya geliyorum” diyor.
11 ౧౧ ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు.
O gün birçok ulus RAB'be bağlanacak, O'nun halkı olacak. O zaman RAB aranızda yaşayacak, siz de beni Her Şeye Egemen RAB'bin gönderdiğini anlayacaksınız.
12 ౧౨ ప్రతిష్ఠితమైన దేశంలో యెహోవా యూదాను తన సొత్తుగా సొంతం చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును మళ్ళీ కోరుకుంటున్నాడు.
RAB kutsal topraklarda Yahuda'yı kendi payı olarak miras edinecek ve Yeruşalim'i yine seçecek.
13 ౧౩ సమస్తమైన ప్రజలారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నాడు. ఆయన ఎదుట మౌనంగా నిలబడి ఉండండి.
Ey insanlar, RAB'bin önünde sessiz durun! RAB kutsal konutundan kalkmış geliyor!