< జెకర్యా 14 >
1 ౧ ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. ఆ రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు.
Beholde, the day of the Lord commeth, and thy spoyle shall be deuided in the middes of thee.
2 ౨ ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
For I will gather all nations against Ierusalem to battell, and the citie shall be taken, and the houses spoyled, and the women defiled, and halfe of the citie shall goe into captiuitie, and the residue of the people shall not be cut off from ye citie.
3 ౩ అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
Then shall the Lord goe foorth, and fight against those nations, as when he fought in the day of battell.
4 ౪ ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.
And his feete shall stand in that day vpon the mount of oliues, which is before Ierusalem on the Eastside, and the mount of oliues shall cleaue in the middes thereof: toward the East and toward the West there shalbe a very great valley, and halfe of ye mountaine shall remooue toward the North, and halfe of the mountaine towarde the South.
5 ౫ కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.
And yee shall flee vnto the valley of the mountaines: for the valley of the mountaines shall reache vnto Azal: yea, yee shall flee like as ye fled from the earthquake in the daies of Vzziah King of Iudah: and the Lord my God shall come, and all the Saints with thee.
6 ౬ ఆ రోజున వెలుగు ఉండదు. ప్రకాశించేవన్నీ మసకబారిపోతాయి.
And in that day shall there bee no cleare light, but darke.
7 ౭ అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. ఆ రోజు పగలూ కాదు, రాత్రీ కాదు. సాయంత్రం సమయంలో వెలుగు ఉంటుంది.
And there shall bee a day (it is knowen to the Lord) neither day nor night, but about the euening time it shall be light.
8 ౮ ఆ రోజున జల ప్రవాహాలు యెరూషలేము నుండి ప్రవహిస్తాయి. వాటిలో సగం తూర్పు సముద్రంలోకి, సగం పడమర సముద్రంలోకి ప్రవహిస్తాయి. వేసవికాలంలో, చలికాలంలో కూడా అలాగే జరుగుతుంది.
And in that day shall there waters of life goe out from Ierusalem, halfe of them towarde the East sea, and halfe of them towarde the vttermost sea, and shall be, both in sommer and winter.
9 ౯ ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
And the Lord shall bee King ouer all the earth: in that day shall there bee one Lord, and his Name shalbe one.
10 ౧౦ అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది.
All the lande shall bee turned as a plaine from Geba to Rimmon, towarde the South of Ierusalem, and it shall be lifted vp, and inhabited in her place: from Beniamins gate vnto the place of the first gate, vnto the corner gate, and from the towre of Hananiel, vnto the Kings wine presses.
11 ౧౧ ప్రజలు దానిలో నివసిస్తారు. ఇకపై శాపం వారి పైకి రాదు. యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు.
And men shall dwell in it, and there shall bee no more destruction, but Ierusalem shall bee safely inhabited.
12 ౧౨ యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.
And this shall bee the plague, wherewith the Lord will smite all people, that haue fought against Ierusalem: their flesh shall consume away, though they stand vpon their feete, and their eyes shall consume in their holes, and their tongue shall consume in their mouth.
13 ౧౩ ఆ రోజున యెహోవా వారి మధ్య భయంకరమైన అయోమయం పుట్టిస్తాడు. వాళ్ళంతా ఒకరికొకరు శత్రువులై ఒకరినొకరు చంపుకుంటారు.
But in that day a great tumult of the Lord shall be among them, and euery one shall take the hande of his neighbour, and his hande shall rise vp against the hand of his neighbour.
14 ౧౪ యూదా ప్రజలు యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలందరి నుండి బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు కొల్లసొమ్ముగా దోచుకుంటారు.
And Iudah shall fight also against Ierusalem, and the arme of all the heathen shall be gathered rounde about, with golde and siluer, and great abundance of apparell.
15 ౧౫ అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి.
Yet this shall be the plague of the horse, of the mule, of the camell and of the asse and of all the beasts that be in these tents as this plague.
16 ౧౬ యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.
But it shall come to passe that euery one that is left of all the nations, which came against Ierusalem, shall goe vp from yere to yere to worship the King the Lord of hostes, and to keepe the feast of Tabernacles.
17 ౧౭ లోకంలో ఉన్న అన్య జాతుల ప్రజల్లో ఎవరైనా సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికి యెరూషలేముకు రాని పక్షంలో వారి ప్రాంతాల్లో వాన కురవదు.
And who so will not come vp of all the families of the earth vnto Ierusalem to worship the King the Lord of hostes, euen vpon them shall come no raine.
18 ౧౮ ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు.
And if the familie of Egypt goe not vp, and come not, it shall not raine vpon them. This shall be the plague wherewith the Lord will smite all the heathen, that come not vp to keepe the feast of Tabernacles.
19 ౧౯ ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.
This shall be the punishment of Egypt, and the punishment of all the nations that come not vp to keepe the feast of Tabernacles.
20 ౨౦ ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు.
In that day shall there be written vpon the bridles of the horses, The holinesse vnto the Lord, and the pottes in the Lords house shall be like the bowles before the altar.
21 ౨౧ యెరూషలేములో, యూదా దేశంలో ఉన్న పాత్రలన్నీ సేనల ప్రభువు యెహోవాకు ప్రతిష్టితమౌతాయి. బలి అర్పించినవారు వధించిన దానిలో కావలసినదాన్ని తీసుకుని వంట చేసుకుంటారు. ఆ కాలంలో కనాను జాతివాడు ఎవ్వడూ సేనల ప్రభువు యెహోవా మందిరంలో కనిపించడు.
Yea, euery potte in Ierusalem and Iudah shall be holy vnto the Lord of hostes, and all they that sacrifice, shall come and take of them, and seethe therein: and in that day there shall be no more the Canaanite in the House of the Lord of hostes.