< జెకర్యా 11 >
1 ౧ లెబానోనూ, నీ ద్వారాలు తెరిచి ఉంచు. అగ్నికణాలు వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.
¡Abre, oh Líbano, tus puertas, y devore el fuego tus cedros!
2 ౨ దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.
¡Aúlla, oh abeto, porque ha caído el cedro, porque han sido derribados los (árboles) magníficos! ¡Aullad, encinas de Basán, porque destruido ha sido el bosque inaccesible!
3 ౩ గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.
Se oyen los lamentos de los pastores, por la ruina de lo que era su gloria; retumban los rugidos de los leoncillos, porque ha sido destruida la gloria del Jordán.
4 ౪ నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు.
Así dice Yahvé, mi Dios: “Apacienta las ovejas del matadero;
5 ౫ వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”
cuyos compradores las matan impunemente, y cuyos vendedores dicen: «¡Bendito sea Yahvé, pues me he hecho rico!» y los pastores no les tienen compasión.
6 ౬ ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”
Así tampoco Yo me apiadaré de los habitantes de esta tierra, dice Yahvé. He aquí que entregaré a los hombres, los unos en manos de otros y en poder de su rey; ellos desolarán la tierra, y Yo no (los) libraré de su mano.
7 ౭ కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.
Apacenté las ovejas del matadero, porque eran las ovejas más pobres; y tomé dos cayados; al uno le llamé Gracia, y al otro Unión; y apacenté el rebaño.
8 ౮ నేను ఒక నెలలో ముగ్గురు కాపరులను తొలగించాను. ఎందుకంటే వాళ్ళు నా విషయంలో నీచంగా ప్రవర్తించారు. నేను వారి విషయంలో సహనం కనపరచ లేకపోయాను.
Y di muerte a tres pastores en un mes. Entonces perdí la paciencia con las ovejas, y también ellas estaban cansadas de mí.
9 ౯ కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.
Y dije: “No os apacentaré más; la que debe morir, que muera; la que debe perderse, que se pierda. Y las restantes, que se coman unas a otras.”
10 ౧౦ ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను.
Y tomé mi cayado Gracia, y lo rompí, para anular mi alianza que había hecho con todos los pueblos.
11 ౧౧ దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
Y quedó anulado en aquel día; y así aquellos más pobres del rebaño que hacían caso de mí, conocieron que era palabra de Yahvé.
12 ౧౨ నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.
Y les dije: “Si os parece justo, pagad mi salario; y si no, dejadlo.” Y ellos pesaron mi salario; treinta (monedas) de plata.
13 ౧౩ అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
Entonces Yahvé me dijo: “¡Tira al alfarero ese lindo precio en que me estimaron!” Tomé las treinta (monedas) de plata, y las tiré al alfarero en la Casa de Yahvé.
14 ౧౪ తరువాత నేను యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధానికి భగ్నం కలిగేలా “ఐక్యం” అనే నా రెండవ కర్రను తీసుకుని దాన్ని విరగగొట్టాను.
Luego rompí el otro cayado, Unión, para romper la hermandad entre Judá e Israel.
15 ౧౫ అప్పుడు యెహోవా నాకు చెప్పినదేమిటంటే “మరోసారి కాపరి సామాన్లు తీసుకుని బుద్ధిలేని కాపరి వలే ప్రవర్తించు.
Y Yahvé me dijo: “Toma también el pertrecho de un pastor insensato.
16 ౧౬ ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.
Pues he aquí que suscitaré en la tierra un pastor que no cuidará de las (ovejas) que se pierden, que no buscará las descarriadas; ni curará las heridas, ni alimentará a las que están sanas; sino que comerá la carne de las gordas y les romperá las pezuñas.
17 ౧౭ మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”
¡Ay del pastor inútil, que abandona el rebaño! ¡Espada sobre su brazo, y sobre su ojo derecho! ¡Que se seque completamente su brazo y oscurézcase del todo su ojo derecho!”