< జెకర్యా 11 >

1 లెబానోనూ, నీ ద్వారాలు తెరిచి ఉంచు. అగ్నికణాలు వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.
黎巴嫩哪,开开你的门, 任火烧灭你的香柏树。
2 దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.
松树啊,应当哀号; 因为香柏树倾倒,佳美的树毁坏。 巴珊的橡树啊,应当哀号, 因为茂盛的树林已经倒了。
3 గొర్రెల కాపరుల రోదన శబ్దం వినిపిస్తుంది. ఎందుకంటే వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. కొదమ సింహాల గర్జన వినబడుతున్నది. ఎందుకంటే యొర్దాను లోయలోని అడవులు పాడైపోయాయి.
听啊,有牧人哀号的声音, 因他们荣华的草场毁坏了。 有少壮狮子咆哮的声音, 因约旦河旁的丛林荒废了。
4 నా దేవుడైన యెహోవా ఏమి చెబుతున్నాడంటే “వధకు సిద్ధంగా ఉన్న గొర్రెల మందను మేపు.
耶和华—我的 神如此说:“你—撒迦利亚要牧养这将宰的群羊。
5 వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”
买他们的宰了他们,以自己为无罪;卖他们的说:‘耶和华是应当称颂的,因我成为富足。’牧养他们的并不怜恤他们。
6 ఇదే యెహోవా వాక్కు. “ఇకపై నేను ఈ దేశనివాసులపై కనికరం చూపించను. ఒకరి చేతికి ఒకరిని వశపరుస్తాను. వాళ్ళ రాజుల చేతికి వాళ్ళందరినీ అప్పగిస్తాను. ఆ రాజులు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళ చేతిలోనుండి నేనెవరినీ విడిపించను.”
耶和华说:‘我不再怜恤这地的居民,必将这民交给各人的邻舍和他们王的手中。他们必毁灭这地,我也不救这民脱离他们的手。’”
7 కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.
于是,我牧养这将宰的群羊,就是群中最困苦的羊。我拿着两根杖,一根我称为“荣美”,一根我称为“联索”。这样,我牧养了群羊。
8 నేను ఒక నెలలో ముగ్గురు కాపరులను తొలగించాను. ఎందుకంటే వాళ్ళు నా విషయంలో నీచంగా ప్రవర్తించారు. నేను వారి విషయంలో సహనం కనపరచ లేకపోయాను.
一月之内,我除灭三个牧人,因为我的心厌烦他们;他们的心也憎嫌我。
9 కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.
我就说:“我不牧养你们。要死的,由他死;要丧亡的,由他丧亡;余剩的,由他们彼此相食。”
10 ౧౦ ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను.
我折断那称为“荣美”的杖,表明我废弃与万民所立的约。
11 ౧౧ దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
当日就废弃了。这样,那些仰望我的困苦羊就知道所说的是耶和华的话。
12 ౧౨ నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.
我对他们说:“你们若以为美,就给我工价。不然,就罢了!”于是他们给了三十块钱作为我的工价。
13 ౧౩ అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
耶和华吩咐我说:“要把众人所估定美好的价值丢给窑户。”我便将这三十块钱,在耶和华的殿中丢给窑户了。
14 ౧౪ తరువాత నేను యూదా వారికి, ఇశ్రాయేలు వారికి మధ్య ఉన్న సహోదర బంధానికి భగ్నం కలిగేలా “ఐక్యం” అనే నా రెండవ కర్రను తీసుకుని దాన్ని విరగగొట్టాను.
我又折断称为“联索”的那根杖,表明我废弃犹大与以色列弟兄的情谊。
15 ౧౫ అప్పుడు యెహోవా నాకు చెప్పినదేమిటంటే “మరోసారి కాపరి సామాన్లు తీసుకుని బుద్ధిలేని కాపరి వలే ప్రవర్తించు.
耶和华又吩咐我说:“你再取愚昧牧人所用的器具,
16 ౧౬ ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.
因我要在这地兴起一个牧人。他不看顾丧亡的,不寻找分散的,不医治受伤的,也不牧养强壮的;却要吃肥羊的肉,撕裂它的蹄子。
17 ౧౭ మందను విడిచిపెట్టే పనికిమాలిన కాపరికి బాధ తప్పదు. వాడి చెయ్యి, కుడి కన్ను కత్తివేటుకు గురౌతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిదైపోతుంది.”
无用的牧人丢弃羊群有祸了! 刀必临到他的膀臂和右眼上。 他的膀臂必全然枯干; 他的右眼也必昏暗失明。”

< జెకర్యా 11 >