< జెకర్యా 1 >
1 ౧ దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.
達理安二年八月,上主的話傳給依多的孫子,貝勒基雅的兒子匝加利亞說:「
2 ౨ “యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు.
上主曾對你們的祖先大發憤怒;
3 ౩ కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
但是如今你應對他們說:「萬軍的上主這樣說:你們歸向我吧! ──萬軍上主的斷語──我必轉向你們,萬軍的上主說。
4 ౪ మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”
你們不要如同你們的祖先;以前的先知曾對你們宣告說:說:萬軍的上主這樣說:你們轉身離開你們的邪道,和你們的惡行吧! 但是他們不聽,也不理會我──上主的斷語。
5 ౫ “మీ పితరులు ఏమయ్యారు? ప్రవక్తలు కలకాలం జీవిస్తారా?
你們的祖先在哪裏﹖先知難道能永遠生存﹖
6 ౬ అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”
苦我吩咐我的僕人先知們所傳的話和定案,豈不是臨到你們的祖先身上了嗎﹖致使他們翻悔說:萬軍的上主真按照衪的決定,並按照我們的行徑和作為對待了我們。[第一個神視:上主的騎士]
7 ౭ దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది.
達理亞二年十一月,即「舍巴特」月二十四日,上主的話傳給依多的孫子,貝勒基雅的兒子匝加利亞說:
8 ౮ రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి.
夜間我看見一個人騎著栗色的馬,立在地的長春樹中間,他後面尚有栗色、色和白色的馬。
9 ౯ అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు.
遂間說:「我主,這是什麼意思﹖」那與我談話的使者對我說:「我要給你解釋這有什麼意義。」
10 ౧౦ అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు.
但那站在長春樹中間的人卻答說:「這些是上主派遺巡視大地的。」
11 ౧౧ అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు.
他們答覆那站在長春樹中間的上主的使者說:「我們已經巡視了大地,見全地都安寧平靖。」
12 ౧౨ అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు.
上主的使者說:「萬軍的上主! 你拒絕憐恤耶路撒冷和猶大城邑,要到何時呢﹖你向他們發怒,至今已是七十年了! 」
13 ౧౩ నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు.
上主就用鼓舞慰藉的話答覆了那與我談話的使者。
14 ౧౪ అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది.
那與我談話的使者便對我說:「你要宣佈說:萬軍的上主這樣說:我仍要以極度的熱情愛耶路撒冷和熙雍;
15 ౧౫ ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు.
但我極腦怒那些傲慢的異民,因為我對我的百姓稍一發怒,他們便大加虐待。
16 ౧౬ కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు.
為此上主這樣說:我要再以慈悲對待耶路撒冷,我的殿宇必要在其中重建來──萬軍上主的斷語──繩墨必要再拉在耶路撒冷上。
17 ౧౭ నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”
你要再宣佈說:萬軍的上主這樣說:我的城吧必再充滿幸福,上主必再憐恤熙雍,再揀選耶路撒冷。」
18 ౧౮ ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి.
第二個神視:四隻角和四個工匠]我又舉目觀看,望見有四隻角。
19 ౧౯ “ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.
我問那與我談話的使者說:「這是什麼意思﹖」他回答我說:「這就是驅散了猶大、以色列和耶路撒冷的角。」
20 ౨౦ అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు.
此後上主使我看見四個工匠。
21 ౨౧ “వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.
我問說:「這樣人來做什麼﹖」他答說:「那些角驅散了猶大,以致沒有人敢抬頭,這些人來是為恐嚇那些角,因為他們曾對猶大地舉起角來驅散了她。」[第三個神視:手拿繩墨的人] ]