< తీతుకు 3 >

1 పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి.
Pvt them in remembrance that they bee subiect to the Principalities and powers, and that they bee obedient, and ready to euery good woorke,
2 వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి.
That they speake euill of no man, that they be no fighters, but soft, shewing all meekenesse vnto all men.
3 ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.
For wee our selues also were in times past vnwise, disobedient, deceiued, seruing the lustes and diuers pleasures, liuing in maliciousnes and enuie, hatefull, and hating one another:
4 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు
But when that bountifulnesse and that loue of God our Sauiour toward man appeared,
5 మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు.
Not by the woorkes of righteousnesse, which we had done, but according to his mercie he saued vs, by the washing of the newe birth, and the renewing of the holy Ghost,
6
Which he shed on vs aboundantly, through Iesus Christ our Sauiour,
7 దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు. (aiōnios g166)
That we, being iustified by his grace, should be made heires according to the hope of eternall life. (aiōnios g166)
8 ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
This is a true saying, and these thinges I will thou shouldest affirme, that they which haue beleeued God, might be carefull to shewe foorth good woorkes. These things are good and profitable vnto men.
9 అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు.
But stay foolish questions, and genealogies, and contentions, and brawlings about the Lawe: for they are vnprofitable and vaine.
10 ౧౦ మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో.
Reiect him that is an heretike, after once or twise admonition,
11 ౧౧ నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.
Knowing that hee that is such, is peruerted, and sinneth, being damned of his owne selfe.
12 ౧౨ నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.
When I shall send Artemas vnto thee, or Tychicus, be diligent to come to mee vnto Nicopolis: for I haue determined there to winter.
13 ౧౩ న్యాయవాది జేనానూ అపొల్లోనూ త్వరగా పంపించు. వారికేమీ తక్కువ కాకుండా చూడు.
Bring Zenas the expounder of the Lawe, and Apollos on their iourney diligently, that they lacke nothing.
14 ౧౪ మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి.
And let ours also learne to shewe foorth good woorkes for necessary vses, that they be not vnfruitfull.
15 ౧౫ నాతో ఉన్నవారంతా నీకు అభివందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారికి మా అభివందనాలు చెప్పు. కృప మీ అందరికీ తోడై ఉండుగాక.
All that are with mee, salute thee. Greete them that loue vs in the faith. Grace bee with you all, Amen. ‘To Titus, elect the first bishoppe of the Church of the Cretians, written from Nicopolis in Macedonia.’

< తీతుకు 3 >