< తీతుకు 3 >
1 ౧ పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి.
Připomínej bratřím, ať respektují své státní zřízení a ať jsou ochotni ke každé obecně prospěšné práci.
2 ౨ వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి.
O nikom ať nemluví špatně, nehádají se, ale ať jsou mírní a vždycky ke všem vlídní.
3 ౩ ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.
Vždyť i my jsme byli kdysi nerozumní, vzpurní, bloudili jsme bez cíle, otročili všelijakým vášním a v našem srdci sídlil hněv, závist a nenávist.
4 ౪ అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు
Ale Bůh ukázal svou lásku a dobrotu a zachránil nás.
5 ౫ మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు.
Neučinil to kvůli našim kdovíjakým zásluhám, ale ze své laskavosti a soucitu. Očistil nás od všech hříchů a udělil svého Ducha, který v nás zrodil nový život.
Toho Ducha jsme dostali v hojnosti zásluhou Ježíše Krista a pouze z jeho dobroty.
7 ౭ దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు. (aiōnios )
Již nyní smíme mít podíl na věčném životě, který toužebně očekáváme. (aiōnios )
8 ౮ ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
Na všechno, co ti říkám, se můžeš spolehnout. Trvej na těchto slovech, aby se všichni, kdo věří v Boha, snažili vynikat dobrým jednáním. Je to nejen správné, ale i užitečné.
9 ౯ అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు.
Nenech se zatáhnout do debat o neřešitelných otázkách a sporných teologických myšlenkách a nepouštěj se do hašteření o závažnost židovského zákona; není to k ničemu a nikam to nevede, jen k hádkám.
10 ౧౦ మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో.
Toho, kdo si v tom libuje, varuj jednou, nanejvýš dvakrát. Nepomůže-li to, rozejdi se s ním;
11 ౧౧ నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.
takový člověk hřeší vědomě a tím sám sebe odsuzuje.
12 ౧౨ నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి.
Chci k tobě poslat buďto Artemu nebo Tychika. Jakmile dorazí, přijď za mnou co nejdřív do Nikopole; rozhodl jsem se, že zimu přečkám tam.
13 ౧౩ న్యాయవాది జేనానూ అపొల్లోనూ త్వరగా పంపించు. వారికేమీ తక్కువ కాకుండా చూడు.
Právníka Zénu a Apolla vyprav na cestu pečlivě, aby jim nic nechybělo.
14 ౧౪ మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి.
I věřící lidé se musí učit pomáhat potřebným a tak svou víru prokazovat v praxi.
15 ౧౫ నాతో ఉన్నవారంతా నీకు అభివందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారికి మా అభివందనాలు చెప్పు. కృప మీ అందరికీ తోడై ఉండుగాక.
Všichni, co jsou se mnou, tě pozdravují. Pozdravuj také všechny naše přátele ve víře. Tvůj Pavel