< పరమగీతము 5 >
1 ౧ (యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు). నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు.
Wszedłem do mojego ogrodu, moja siostro, [moja] oblubienico. Zbierałem moją mirrę z moimi wonnościami; zjadłem mój plaster z moim miodem, piję moje wino z moim mlekiem. Jedzcie, przyjaciele, pijcie, a pijcie obficie, moi mili.
2 ౨ [నాలుగవ భాగం] (యువతి మాట్లాడుతూ ఉంది) నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”
Ja śpię, ale moje serce czuwa. [Oto] głos mego umiłowanego, który puka i [mówi]: Otwórz mi, moja siostro, moja umiłowana, moja gołębico, moja nieskalana. Moja głowa bowiem jest pełna rosy, moje kędziory – kropli nocy.
3 ౩ (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?
Zdjęłam już swoją suknię, jakże mam ją wkładać? Umyłam swoje nogi, jakże mam je pobrudzić?
4 ౪ తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.
Mój umiłowany wsunął swoją rękę przez otwór, a moje wnętrze poruszyło się we mnie.
5 ౫ నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.
Wstałam, aby otworzyć mojemu umiłowanemu, a oto z moich rąk kapała mirra, z moich palców mirra spływała na uchwyt zasuwy.
6 ౬ నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.
Otworzyłam mojemu umiłowanemu, lecz mój umiłowany [już] odszedł i zniknął. Moja dusza zasłabła na jego głos. Szukałam go, ale nie znalazłam, wołałam go, ale mi nie odpowiedział.
7 ౭ పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.
Znaleźli mnie strażnicy, którzy obchodzili miasto; pobili mnie i zranili, strażnicy murów zabrali mi zasłonę.
8 ౮ (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Zaklinam was, córki Jerozolimy: Jeśli znajdziecie mojego umiłowanego, to powiedzcie mu, że jestem chora z miłości.
9 ౯ (పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?
Czym przewyższa twój umiłowany [innych] umiłowanych, o najpiękniejsza wśród kobiet? Czym przewyższa twój umiłowany [innych] umiłowanych, że tak nas zaklinasz?
10 ౧౦ (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.
Mój umiłowany jest biały i rumiany, i najznakomitszy spośród dziesięciu tysięcy.
11 ౧౧ అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
Jego głowa jest [jak] najczystsze złoto; jego kędziory faliste, czarne jak kruk.
12 ౧౨ అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.
Jego oczy są jak gołębice nad strumieniami wody, [jakby] umyte w mleku, osadzone w swej oprawie.
13 ౧౩ అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.
Jego policzki jak grządka wonności, [jak] pachnące kwiatki; jego wargi jak lilie ociekające wyborną mirrą.
14 ౧౪ అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.
Jego ręce [jak] złote pierścienie wysadzone berylem; jego tors [jak] jasna kość słoniowa pokryta szafirem.
15 ౧౫ అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి. అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం.
Jego nogi [jak] słupy z marmuru, postawione na szczerozłotych podstawkach; jego oblicze [jak] Liban, wyborne jak cedry.
16 ౧౬ అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం. యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.
Jego usta przesłodkie i jest on cały przepiękny. Taki jest mój umiłowany i taki jest mój przyjaciel, córki Jerozolimy.