< పరమగీతము 2 >

1 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును.
Jaz sem vrtnica Šaróna in dolinska lilija.
2 (ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
Kakor lilija med trnjem, tako je moja ljubezen med hčerami.
3 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. అతని పండు ఎంతో రుచిగా ఉంది.
Kakor jablana med gozdnimi drevesi, tak je moj ljubljeni med sinovi. Z velikim veseljem sem se usedla pod njeno senco in njen sad je bil sladek mojemu okusu.
4 అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.
Privedel me je v hišo gostije in njegov prapor nad menoj je bila ljubezen.
5 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.
Potešite me s flaškoni, tolažite me z jabolki, kajti jaz sem bolna od ljubezni.
6 (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.
Njegova leva roka je pod mojo glavo in njegova desnica me objema.
7 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
Naročam vam, oh ve hčere jeruzalemske, pri srnah in pri poljskih košutah, da ne razvnamete niti ne zbudite moje ljubezni, dokler njemu ugaja.
8 [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
Glas mojega ljubljenega! Glej, prihaja, skače na gorah, poskakuje po hribih.
9 నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
Moj ljubljeni je podoben srni ali mlademu jelenu. Glej, stoji za našim zidom, gleda pri oknih, kaže se skozi mrežo.
10 ౧౦ నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
Moj ljubljeni je spregovoril in mi rekel: »Vstani, moja ljubezen, moja lepotica in odleti.
11 ౧౧ చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
Kajti glej, zima je minila, dež je mimo in je izginil.
12 ౧౨ దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
Cvetlice se pojavljajo na zemlji, prišel je čas petja ptic in glas grlice se sliši v naši deželi,
13 ౧౩ అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
figovo drevo poganja svoje zelene fige in trte z nežnim grozdjem dajejo dober vonj. Vstani, moja ljubezen, moja lepotica in odleti.
14 ౧౪ బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
Oh moja golobica, ki si v skalnih razpokah, na skrivnih krajih stopnic, naj vidim tvoje obličje, naj slišim tvoj glas, kajti tvoj glas je prijeten in tvoje obličje je ljubko.«
15 ౧౫ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
Ujemite nama lisice, majhne lisice, ki plenijo trte, kajti najine trte imajo nežno grozdje.
16 ౧౬ (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
Moj ljubljeni je moj in jaz sem njegova, on pase med lilijami.
17 ౧౭ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.
Dokler se ne zdani in sence [ne] odletijo, se obrni, moj ljubljeni in bodi podoben srni ali mlademu jelenu na gorah Beterja.

< పరమగీతము 2 >