< పరమగీతము 2 >
1 ౧ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును.
나는 사론의 수선화요 골짜기의 백합화로구나
2 ౨ (ఆ వ్యక్తి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు) ప్రేయసీ! నువ్వు నా దేశపు యువతుల మధ్య ముళ్ళ చెట్లలో లిల్లీ లాగా ఉన్నావు.
여자들 중에 내 사랑은 가시나무 가운데 백합화 같구나
3 ౩ (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అడవి చెట్టుల్లో ఆపిల్ వృక్షంలా, యువకుల్లో నా ప్రియుడున్నాడు. ఉప్పొంగి పోతూ నేనతని నీడలో కూర్చున్నాను. అతని పండు ఎంతో రుచిగా ఉంది.
남자들 중에 나의 사랑하는 자는 수풀 가운데 사과나무 같구나 내가 그 그늘에 앉아서 심히 기뻐하였고 그 실과는 내 입에 달았구나
4 ౪ అతడు నన్ను విందుశాలకు తెచ్చాడు. అతని ప్రేమ పతాక స్థాయిలో ఉంది.
그가 나를 인도하여 잔치집에 들어갔으니 그 사랑이 내 위에 기로구나
5 ౫ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రేమ కోసం నేను ఆకలిగా ఉన్నాను. ఎండు ద్రాక్షపళ్ళతో నన్ను తెప్పరిల్లజేయండి, ఆపిల్ పళ్ళతో నన్ను ఉత్తేజ పరచండి.
너희는 건포도로 내 힘을 돕고 사과로 나를 시원케 하라 내가 사랑하므로 병이 났음이니라
6 ౬ (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) అతని ఎడమ చెయ్యి నా తల కింద ఉంది. కుడిచేత్తో అతడు నన్ను కౌగిలించుకున్నాడు.
그가 왼손으로 내 머리에 베게하고 오른손으로 나를 안는구나
7 ౭ (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకల మీద, లేళ్ల మీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
예루살렘 여자들아 내가 노루와 들사슴으로 너희에게 부탁한다 내 사랑이 원하기 전에는 흔들지 말고 깨우지 말지니라
8 ౮ [రెండవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
나의 사랑하는 자의 목소리로구나 보라, 그가 산에서 달리고 작은 산을 빨리 넘어 오는구나
9 ౯ నా ప్రియుడు జింకలాగా, లేడిపిల్లలాగా ఉన్నాడు. చూడు, మన గోడ వెనక నిలబడి ఉన్నాడు. కిటికీలోనుంచి చూస్తున్నాడు. అల్లిక తడికె గుండా తొంగి చూస్తున్నాడు.
나의 사랑하는 자는 노루와도 같고 어린 사슴과도 같아서 우리 벽 뒤에 서서 창으로 들여다 보며 창살 틈으로 엿보는구나
10 ౧౦ నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
나의 사랑하는 자가 내게 말하여 이르기를 나의 사랑, 나의 어여쁜 자야! 일어나서 함께 가자
11 ౧౧ చలికాలం పోయింది. వానలు పడి వెళ్ళిపోయాయి.
겨울도 지나고 비도 그쳤고
12 ౧౨ దేశమంతా పూలు పూశాయి. కొమ్మలను కత్తిరించే కాలం, పక్షులు కోలాహలం చేసే కాలం వచ్చింది. కోకిల కూతలు మన ప్రాంతాల్లో వినబడుతున్నాయి.
지면에는 꽃이 피고 새의 노래할 때가 이르렀는데 반구의 소리가 우리 땅에 들리는구나
13 ౧౩ అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
무화과나무에는 푸른 열매가 익었고 포도나무는 꽃이 피어 향기를 토하는구나 나의 사랑 나의 어여쁜 자야 일어나서 함께 가자
14 ౧౪ బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది.”
바위 틈 낭떠러지 은밀한 속에 있는 나의 비둘기야, 나로 네 얼굴을 보게 하라 네 소리를 듣게 하라 네 소리는 부드럽고 네 얼굴은 아름답구나
15 ౧౫ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో.
우리를 위하여 여우 곧 포도원을 허는 작은 여우를 잡으라! 우리의 포도원에 꽃이 피었음이니라
16 ౧౬ (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుడు నా వాడు. నేను అతని దాన్ని. లిల్లీలు ఉన్నతావుల్లో అతడు మందను చక్కగా మేపుతున్నాడు.
나의 사랑하는 자는 내게 속하였고, 나는 그에게 속하였구나 그가 백합화 가운데서 양떼를 먹이는구나
17 ౧౭ (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ప్రియా, వెళ్ళిపో. ఉషోదయ శీతల పవనాలు వీచే ముందే చీకటి నీడలు పారిపోయే లోపే వెళ్ళిపో. కొండ బాటల్లోని జింక లాగా లేడిపిల్లలాగా ఉండు.
나의 사랑하는 자야! 날이 기울고 그림자가 갈 때에 돌아와서 베데르 산에서의 노루와 어린 사슴 같아여라