< రూతు 1 >
1 ౧ న్యాయాధిపతులు పరిపాలించిన కాలంలో దేశంలో కరువు వచ్చింది. అప్పుడు యూదా దేశంలోని బేత్లెహేము నుండి ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కొడుకులను తనతో తీసుకుని మోయాబు దేశానికి వలస వెళ్ళాడు.
Андэ дес, кана визэринас лэ вайды, андо тхэм кэрдилас бокх, ай екх мануш катар Вифлеем, андэ Иудея, традас тэ траий куса пэски ромни ай дуе щявэнца андо тхэм Моав.
2 ౨ అతని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతనికి మహ్లోను, కిల్యోను అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళు యూదా దేశపు బేత్లెహేములో నివసించే ఎఫ్రాతా ప్రాంతం వారు. వాళ్ళు మోయాబు దేశానికి వెళ్లి అక్కడ నివసించారు.
Кадо мануш бущёлас Элимелех, ай лэски ромни — Наоми, ай лэ дуй лэскэ щявэ — Махлон ай Килион. Вон сас катар Эфрата анда Вифлеем, кай сы андэ Иудея. Вон авилэ андо Моав ай траинас котэ.
3 ౩ నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది.
Элимелех, ром ла Наомияко, мулас, ай вой ащилас дуе щявэнца.
4 ౪ వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు.
Вон лынэ ромнян моавиатянкэн — екх лэндар бущёлас Орпа, ай э кавэр Рут. Пала кодо сар вон траисардэ котэ каринг э дэш бэрш,
5 ౫ సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.
Ви Махлон ай Килион мулэ, ай Наоми ащилас би щявэнго ай ви би ромэско.
6 ౬ బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది.
Наоми шундас андо Моав, кэ о Рай Яхва ажутысардас пэскэ манушэнгэ ай дас лэн хабэ, ай Наоми пэскэ боранца гэтосайлас тэ болдэл-пэ кхэрэ.
7 ౭ ఆ దేశం నుండి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో సహా కాలి నడకన యూదా దేశానికి బయలు దేరింది.
Пэскэ боранца вой ащядас тхан, кай траияс, ай гэлас андо дром, саво трубуяс тэ анэл лэн палпалэ андэ пхув Иудаски.
8 ౮ అప్పుడు ఆమె తన ఇద్దరు కోడళ్ళతో ఇలా అంది. “మీరు మీ పుట్టిళ్ళకు తిరిగి వెళ్ళండి. చనిపోయిన నా కొడుకుల విషయంలో, నా విషయంలో మీరు నమ్మకంగా ఉన్నట్టే యెహోవా మీ పట్ల నమ్మకంగా ఉండి దయ చూపిస్తాడు గాక.
Наоми пхэндас пэскэ борангэ: — Болдэн-тумэ сако андо пэска дако кхэр. Мэк о Рай Яхва авэл милошо каринг тумэ, сар ви тумэ санас милоша кай тумарэ мулэ ром ай мандэ.
9 ౯ మీరిద్దరూ చక్కగా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని మీ భర్తల ఇళ్ళల్లో సుఖంగా జీవించే స్థితి ప్రభువు దయచేస్తాడు గాక” అని చెప్పి ఆమె తన కోడళ్ళను ముద్దు పెట్టుకుంది.
Мэк дэл о Рай Яхва саконакэ тумэндар тэ аракхэл пачя андо кхэр кай нэво ром. Вой чюмидас лэн, ай вон зуралэс рутэ
10 ౧౦ అప్పుడు వాళ్ళు గట్టిగా ఏడ్చి “మేము నీతో కూడా నీ ప్రజల దగ్గరకే వస్తాం” అన్నారు.
ай пхэндэ лакэ: — Амэ жяса туса кай тирэ мануш.
11 ౧౧ అప్పుడు నయోమి “నా బిడ్డలారా, మీరు వెనక్కి మళ్ళండి. మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి ఇప్పుడు నా కడుపున కొడుకులు పుట్టరు గదా.
Алом э Наоми пхэндас: — Болдэн-тумэ палпалэ кхэрэ, мурэ щея. Состар тэ жян манца? Мандэ наштык авэн инкэ щявэ, савэ кэрдёна тумарэ ром.
12 ౧౨ అమ్మాయిలూ, తిరిగి వెళ్ళండి. నేను ముసలిదాన్ని. మగ వాడితో ఇప్పుడు కాపురం చెయ్యలేను. ఒక వేళ నేను నమ్మకంతో ఈ రాత్రి నేను ఒక మగ వాడితో గడిపి కొడుకులను కనినప్పటికీ
Болдэн-тумэ кхэрэ, мурэ щея; мэ аба сым пхури, тэ авэл ма кавэр ром. Ви тэ гиндысардэмас, кэ сы ман бизыяла, — ви андэ кады рати тэ авилэмас ромэса, ай котар кэрдэмас щявэн, –
13 ౧౩ వాళ్ళు పెద్దవాళ్లయ్యే వరకూ మీరు వేచి ఉంటారా? పెళ్లి చేసుకోకుండా వాళ్ళకోసం ఎదురు చూస్తూ ఉంటారా? నా బిడ్డలారా, అలా వద్దు. అలాంటి పరిస్థితి మీకంటే నాకే ఎక్కువ వేదన కలిగిస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు విరోధి అయ్యాడు” అని వాళ్ళతో అంది.
сар тумэ жутярна, жи пун вон барона? Шай ли тумэ ащен са кады врама би ромэнго? На, мурэ щея. Мури брига зуралэс пхари тумэнгэ, анда кадо кэ о васт лэ Раско лэ Яхваско болдас-пэ чёрэс каринг мандэ!
14 ౧౪ వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.
Ай атунчи вон палэ зуралэс рутэ. Ай э Орпа чюмидас пэска сокра по палуныпэ, алом э Рут ащилас ласа.
15 ౧౫ అప్పుడు నయోమి “చూడు, నీ తోడికోడలు తిరిగి తన ప్రజల దగ్గరికీ తన దేవుళ్ళ దగ్గరికీ వెళ్ళిపోయింది. నువ్వు కూడా నీ తోడికోడలి వెంటే వెళ్ళు” అని రూతుతో చెప్పింది.
— Дыкх, — пхэндас Наоми, — тири бори болдэл-пэ палпалэ кай пэскэ мануш ай кай пэскэ дэвла. Болдэ-ту ви ту ласа.
16 ౧౬ అందుకు రూతు “నీతో రావద్దనీ, నిన్ను విడిచిపొమ్మనీ నాకు చెప్పొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. ఇకనుండి నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు.
Алом э Рут пхэндас: — На кикидэ пэ мандэ, тэ мэкав тут вай тэ болдав-ма тутар. Кай жяса ту, котэ ви мэ, ай кай ту ащядёса, ащядював ви мэ. Тирэ мануш авна мурэ мануш, ай тиро Дэл авла муро Дэл.
17 ౧౭ నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.
Кай мэрэс ту, мэрав ви мэ, ай котэ аво прахомэ. Фэри о мэрипэ лэл ман тутар. Мэк марэл ман о Рай Яхва зуралэс, тэ авла кавэрэс.
18 ౧౮ తనతో రావడానికే ఆమె నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు ఇక ఆమెతో ఆ విషయం మాట్లాడటం మానుకుంది.
Кана Наоми атярдас, со э Рут щютас-пэ зуралэс тэ жял ласа, вой ащядилас тэ марэл ла тэлэ.
19 ౧౯ కాబట్టి వాళ్ళిద్దరూ బేత్లెహేముకు ప్రయాణం సాగించారు. వాళ్ళు బేత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరు ఊరంతా ఎంతో ఆసక్తిగా గుమిగూడారు. ఊరి స్త్రీలు “ఈమె నయోమి కదా” అని చెప్పుకున్నారు.
Ай солдуй жювля гэлэ май дур, жи пон чи авилэ андо Вифлеем. Кана вон дынэ андрэ, са о форо бугзысайлас анда лэндэ, ай лэ жювля пхэннас: — На кады э Наоми?
20 ౨౦ అప్పుడు నయోమి “నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. అమిత శక్తిశాలి నాకు చాలా వేదన కలిగించాడు.
— На акхарэн ман Наоми, — пхэндас вой лэнгэ. — Пхэнэн мангэ Мара, анда кадо кэ о Май Зурало кэрдас кэрко муро траё.
21 ౨౧ నేను బాగా ఉన్న స్థితిలో ఇక్కడినుండి వెళ్ళాను. యెహోవా నన్ను ఖాళీ చేతులతో తిరిగి తీసుకువచ్చాడు. యెహోవా నాకు వ్యతిరేక సాక్షిగా నిలిచాడు. సర్వ శక్తిశాలి నన్ను బాధ పెట్టాడు. ఇదంతా చూసి కూడా నన్ను నయోమి అని పిలుస్తారెందుకు?” అని వారితో అంది.
Мэ гэлэмтар анда кадо форо барвалы, ай о Дэл болдас ман палпалэ би канческо. Состар тэ пхэнэн мангэ Наоми? О Рай Яхва щюдас ман андэ брига; о Май Зурало мэклас пэ ман бида.
22 ౨౨ ఆ విధంగా నయోమి, మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు తిరిగి వచ్చారు. వారిద్దరూ బార్లీ పంట కోసే కాలం ఆరంభంలో బేత్లెహేము చేరుకున్నారు.
Кадэ Наоми болдас-пэ анда Моав пэска бораса, моавитянкаса ла Рутаса. Вон авилэ андо Вифлеем, кана мануш лынэ тэ кидэн ячмень.