< రూతు 4 >

1 బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు.
Then Boaz went up to the gate and sat down. Just then the near kinsman of whom Boaz had spoken came along. Boaz said, ‘Hello, So-and-so (calling him by name), come here and sit down.’ So he stopped and sat down.
2 బోయజు ఆ ఊరి పెద్దల్లో పదిమందిని పిలుచుకు వచ్చాడు. వారిని అక్కడ కూర్చోబెట్టాడు.
Boaz also took ten of the town elders and said, ‘Sit down here.’ So they sat down.
3 తరువాత అతడు “మోయాబు దేశంనుండి తిరిగి వచ్చిన నయోమి మన సోదరుడైన ఎలీమెలెకు భార్య. ఆమె తన భర్తకు చెందిన భూమిని అమ్మివేస్తోంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా వినాలని నేను ఒక విషయం చెబుతున్నాను.
Then he said to the near relative, ‘Naomi, who has come back from the country of Moab, is offering for sale the piece of land which belonged to our relative Elimelech,
4 ఈ ఊరి పెద్దల సమక్షంలో, నా కుటుంబ పెద్దల సాక్షిగా నువ్వు ఆ భూమిని విడిపించుకో. ఒకవేళ విడిపించడానికి నువ్వు సిద్ధపడితే నాకు స్పష్టంగా చెప్పు. దాన్ని నువ్వు విడిపించుకోలేకపోతే అది కూడా స్పష్టంగా చెప్పు. నువ్వు కాకపోతే దాన్ని విడిపించే దగ్గర బంధువు వేరే ఎవరూ లేరు. నీ తరువాత దగ్గర బంధువుని నేనే” అని అతనితో చెప్పాడు. అందుకతడు “నేను విడిపిస్తాను” అన్నాడు.
and I thought that I would lay the matter before you, suggesting that you buy it in the presence of these men who sit here and of the elders of my people. If you will buy it and so keep it in the possession of the family, do so; but if not; then tell me, so that I may know; for no one but you has the right to buy it, and I am next to you.’ ‘I will buy it,’ he said.
5 అప్పుడు బోయజు “నువ్వు నయోమి దగ్గర నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ భూమితో పాటుగా చనిపోయిన వాడి భార్యను, మోయాబుకు చెందిన రూతును కూడా స్వీకరించాలి. చనిపోయిన వాడి ఆస్తిపై అతని పేరు నిలబెట్టాలంటే ఇదే మార్గం” అన్నాడు.
Then Boaz said, ‘On the day you buy the field from Naomi, you must also marry Ruth the Moabite, the widow of the dead, in order to preserve the name of the dead in connection with his inheritance.’
6 దానికి ఆ బంధువు “నేను దాన్ని విడిపిస్తే నా సొంత వారసత్వం పాడవుతుంది. కాబట్టి దాన్ని విడిపించే ఆ హక్కు నువ్వే తీసుకో. ఎందుకంటే నేను ఆ భూమిని విడిపించుకోలేను” అన్నాడు.
‘I cannot buy it for myself without spoiling my own inheritance,’ the near relative said. ‘You take my right of buying it as a relative, because I cannot do so.’
7 ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులో ఒక కట్టుబాటు ఉంది. బంధు ధర్మానికీ, క్రయ విక్రయాలకూ ఏదైనా విషయాన్ని ఖరారు చేయడానికీ ఒక సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి తన చెప్పు తీసి అవతలి వాడికివ్వడమే. ఈ పనిని ఇశ్రాయేలీయుల్లో ప్రమాణంగా ఎంచారు.
Now this used to be the custom in Israel: to make valid anything relating to a matter of redemption or exchange, a man drew off his sandal and gave it to the other man; and this was the way contracts were attested in Israel.
8 ఆ బంధువు “నువ్వే దాన్ని సంపాదించుకో” అని బోయజుతో చెప్పి తన చెప్పు తీసివేశాడు.
So when the near relative said to Boaz, ‘Buy it for yourself,’ Boaz drew off the man’s sandal.
9 అప్పుడు బోయజు “ఎలీమెలెకుకు కలిగిన సమస్తం-కిల్యోను, మహ్లోనులకు చెందినదంతా నయోమి దగ్గర నుండి సంపాదించాను అని నేను పలికిన దానికి మీరు ఈ రోజు సాక్షులుగా ఉన్నారు.
Then Boaz said to the elders and to all the people, ‘You are witnesses at this time that I have bought all that was Elimelech’s and all that was Chilion’s and Mahlon’s from Naomi.
10 ౧౦ అలాగే చనిపోయినవాడి పేరట అతని వారసత్వాన్ని స్థిరపరచడానికీ, చనిపోయినవాడి పేరును అతని సోదరుల్లోనుండీ, అతని నివాస స్థలం నుండీ సమసి పోకుండా ఉండటానికి నేను మహ్లోను భార్య రూతు అనే మోయాబీ స్త్రీని సంపాదించుకుని పెళ్ళి చేసుకుంటున్నాను. దీనికీ మీరు ఈ రోజున సాక్షులుగా ఉన్నారు” అని పెద్దలతో, ప్రజలందరితో చెప్పాడు.
Moreover I have secured Ruth the Moabite, the wife of Mahlon, to be my wife, in order to perpetuate the name of the dead in connection with his inheritance, so that his name will not disappear from among his relatives and from the household where he lived. You are witnesses this day.’
11 ౧౧ అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక!
Then all the people who were at the gate and the elders said, ‘We are witnesses. May the Lord make the woman who is coming into your house like Rachel and Leah, who together built the house of Israel. May you do well in Ephrata, and become famous in Bethlehem.
12 ౧౨ ఎఫ్రాతాలో నీకు క్షేమం, అభివృద్ధీ కలిగి బేత్లెహేములో పేరు ప్రఖ్యాతులు పొందుతావు గాక! యెహోవా ఈ యువతి వల్ల నీకు అనుగ్రహించే సంతానం, నీ కుటుంబం తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబంలా ఉండుగాక!” అన్నారు.
From the children whom the Lord will give you by this young woman may your household become like the household of Perez, whom Tamar bore to Judah.’
13 ౧౩ బోయజు రూతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను ప్రేమించాడు. యెహోవా ఆమెను దీవించాడు. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కన్నది.
So Boaz married Ruth, and she became his wife; and the Lord gave to her a son.
14 ౧౪ అప్పుడు అక్కడి స్త్రీలు “ఈ రోజు నీవు బంధువులు లేని దానిగా మిగిలిపోకుండా చేసిన యెహోవాకు స్తుతులు. ఆయన పేరు ఇశ్రాయేలీయుల్లో ప్రఖ్యాతి చెందుతుంది గాక.
Then the women said to Naomi, ‘Blessed be the Lord who has not left you at this time without a near relative, and may his name be famous in Israel.
15 ౧౫ నిన్ను ప్రేమించి ఏడుగురు కొడుకుల కంటే మించిన నీ కోడలు వీణ్ణి కన్నది. ఇతడు నీ ప్రాణాన్ని ఉద్ధరిస్తాడు. వృద్ధాప్యంలో నిన్ను పోషిస్తాడు” అని నయోమితో చెప్పారు.
This child will restore your vigor and nourish you in your old age; for your daughter-in-law who loves you, who is worth more to you than seven sons, has borne a son to Boaz!’
16 ౧౬ అప్పుడు నయోమి ఆ బిడ్డను తన కౌగిట్లోకి తీసుకుని వాడికి సంరక్షకురాలు అయింది.
So Naomi took the child in her arms and cared for him as if he was her own.
17 ౧౭ ఆమె ఇరుగు పొరుగు స్త్రీలు నయోమికి కొడుకు పుట్టాడని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. ఇతడు దావీదు తండ్రి అయిన యెష్షయికి తండ్రి.
The women of the neighbourhood gave him a name, saying, ‘A son is born to Naomi!’ They named him Obed. He became the father of Jesse, who was the father of David.
18 ౧౮ పెరెసు వంశక్రమం ఇది. పెరెసు కుమారుడు హెస్రోను.
This is the genealogy of Perez: Perez was the father of Hezron,
19 ౧౯ హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు.
Hezron of Ram, Ram of Amminadab,
20 ౨౦ అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.
Amminidab of Nashon, Nashon of Salmon,
21 ౨౧ శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు.
Salmon of Boaz, Boaz of Obed,
22 ౨౨ ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.
Obed of Jesse, Jesse of David.

< రూతు 4 >