< రూతు 2 >

1 నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు.
There was a man in Bethlehem who belonged to the clan of [Naomi’s dead husband], Elimelech. He was rich and well-known/influential. His name was Boaz.
2 మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది.
[One day] Ruth said to Naomi, “Let me go to the fields and pick up the grain left behind by the workers.” Naomi replied, “Go ahead, my daughter.”
3 ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
So Ruth went to the fields and began to pick up some of the left-over grain. And it happened that she was working in a field that belonged to Boaz, [the man] from the clan of [her dead father-in-law], Elimelech!
4 బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు.
Just then, Boaz arrived from Bethlehem. He greeted the men who were harvesting the grain, saying, “I want Yahweh to bless you!” They replied, “We want Yahweh to bless you, [too]!”
5 అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు.
Then Boaz saw Ruth, and asked the (foreman/man in charge of the other workmen), “Whose [daughter] is that young woman?”
6 అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి.
The foreman replied, “She is the woman from Moab who returned from there with [her mother-in-law] Naomi.
7 ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు.
She said to me, ‘Please let me walk behind the men who are harvesting the grain and pick up some of the grain they leave behind.’ [I gave her permission, and] she went into the field, and she has been working from this morning until now. The only time she did not work was when she rested for a short time in the shelter.”
8 అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు.
So Boaz went over to Ruth and said to her, “Young lady, listen to me. Don’t go and pick up grain in another field. Do not go away from here. Stay here with my servant girls.
9 కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు.
Watch where the men are harvesting, and follow along behind the [servant] girls. I will tell the men [who are working] not to touch/molest you. And whenever you are thirsty, go and get some water to drink from the jars that the men have filled.”
10 ౧౦ అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను.
When he said that, she knelt down in front of him [in respect], with her face touching the ground. She exclaimed, “Why are you acting so kindly toward me, by paying attention to me? [I am not even a Jew; I am] a foreigner!”
11 ౧౧ నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు.
Boaz replied, “People have told me all about what you have done for your mother-in-law. They told me that you left your parents and your homeland, and you came here to live among people whom you did not know before.
12 ౧౨ యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు.
I hope/desire that Yahweh will repay you for what you have done. You have put yourself in the care of Yahweh, [like a little bird puts itself] under [its mother’s] wings [MET]. I desire that he will reward you very greatly.”
13 ౧౩ అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది.
She replied, “Sir, I hope you will continue to act kindly toward me. You have comforted/encouraged me, even though I am lower in status than any of your servant girls.”
14 ౧౪ భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది.
At mealtime, Boaz said to her, “Come over here. Take some bread and dip it in the wine vinegar [and eat it].” Then when she sat down with the men who had been harvesting, he offered her some roasted grain. She ate all the grain she wanted, and had some left over.
15 ౧౫ ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో “ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు.
As she stood up to start gathering grain [again], Boaz ordered his workers, “Even if she gathers some grain near the bundles of grain that have been cut, do not scold her.
16 ౧౬ అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు” అని చెప్పాడు.
Instead, pull out some stalks of grain from the bundles, and leave them on the ground for her to pick up, and do not rebuke her.”
17 ౧౭ కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు బార్లీ గింజలు అయ్యాయి.
So Ruth gathered grain in the field until evening. Then she (threshed/beat with a stick) the barley that she had gathered, [to separate the kernels from the stalks], and the barley filled a large basket.
18 ౧౮ ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది.
She carried it back to town, and showed to her mother-in-law how much she had gathered. Ruth also showed to her the grain [that was left over after] she had eaten enough from [what Boaz had given her at lunchtime].
19 ౧౯ అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది.
Her mother-in-law asked her, “Where did you gather grain today? In whose [field] did you work? [God will] surely bless the man who was kind to you.” Then Ruth told her about the man in whose field she had been working. She said, “The name of the man [who owns the field] where I worked today is Boaz.”
20 ౨౦ దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది.
Naomi said to her daughter-in-law, “I hope/desire that Yahweh will bless him! He has not stopped acting kindly toward [us, who are still] living, and to [our husbands] who have died.” Then she added, “That man is a close relative [of Elimelech]; he is one of those who has a responsibility to help those who are his relatives.”
21 ౨౧ దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది.
Then Ruth said, “He also said to me, ‘Stay with my workers until they have finished harvesting all my grain.’”
22 ౨౨ అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది.
Naomi replied, “My daughter, it will be good for you to go [to his field] with his [servant] girls, because if you go to someone else’s field, someone might harm/molest you.”
23 ౨౩ రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది.
So Ruth stayed close to Boaz’s [servant] girls [while she was working]. She gathered stalks of grain until the barley harvest and the wheat harvest were finished. During that time she lived with Naomi.

< రూతు 2 >