< రోమీయులకు 8 >
1 ౧ ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
My, kdo jsme spojeni s Kristem, nemusíme se již obávat žádného odsouzení k smrti.
2 ౨ క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది.
Vždyť způsob života, jak jej při nás uskutečňuje oživující Duch skrze naše spojení s Kristem, nás vymanil ze zákonitosti hříchu a ze smrti. Zákon nás sice mohl před zlem varovat, ale nemohl nás před ním uchránit.
3 ౩ ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.
Proto Bůh poslal svého Syna Ježíše Krista, aby se stal člověkem a byl pokoušen k neposlušnosti. Takto odsoudil hřích tam, kde nejvíce působí, tedy v lidské přirozenosti.
Tak můžeme i my Ježíšovou zásluhou splnit požadavky zákona, když nepodléháme tomu, co chce tělo, ale jsme vedeni Duchem.
5 ౫ శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు.
Jestliže někdo žije podle své přirozenosti, je ovládán sobeckými touhami. Žije-li však v někom Boží Duch, je jím také usměrňován.
6 ౬ శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం.
Vlastní touhy vedou ke smrti. Duch Boží však dává život a pokoj. Ti první nemají Boha příliš v lásce, protože je jim nepříjemný a jeho zákony nepřijatelné. Takoví se Bohu ovšem nemohou líbit.
7 ౭ ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.
8 ౮ కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.
9 ౯ దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీలో ఆత్మ స్వభావమే ఉంది. శరీర స్వభావం కాదు. ఎవరిలోనైనా క్రీస్తు ఆత్మ లేకపోతే అతడు క్రీస్తుకు చెందినవాడు కాడు.
Ale vy, jestliže Boží Duch ve vás působí, jste jím vedeni k docela jinému životu.
10 ౧౦ క్రీస్తులో ఉంటే పాపం కారణంగా మీ శరీరం చనిపోయింది గాని నీతి కారణంగా మీ ఆత్మ జీవం కలిగి ఉంది.
Patříte-li opravdu Kristu, nemůže to být jinak. Z vlivu zla se vaše tělo vyprostilo Kristovou zásluhou; jeho bezúhonnost vám teď zprostředkovává život, vyvěrající z jeho Ducha.
11 ౧౧ చనిపోయిన వారిలో నుండి యేసును లేపిన వాడి ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే, ఆయన చావుకు లోనైన మీ శరీరాలను కూడా మీలో నివసించే తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు.
A tento Duch, jenž vzkřísil z mrtvých Ježíše Krista, vzkřísí i vaše smrtelné tělo, pokud jej v sobě necháte sílit a vládnout.
12 ౧౨ కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము.
Ano, bratři, teď už nejsme podřízeni tomu, k čemu nás dříve naše přirozenost samozřejmě vedla.
13 ౧౩ మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.
Kdo totiž sám sobě ve všem vyhoví, ten sám sebe zničí. Kdo však s Boží pomocí vítězí nad svými slabostmi, ten získá nepomíjející život.
14 ౧౪ దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు.
Kdo se dá vést Božím Duchem, smí se právem pokládat za Božího syna a dceru.
15 ౧౫ ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం.
Bůh nám daroval postavení vlastních dětí, které se k němu smějí obracet jako k milujícímu Otci a jimž patří všechno, co patří jemu. Duch svatý nás o tom ujišťuje.
16 ౧౬ మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్షమిస్తున్నాడు.
17 ౧౭ మనం పిల్లలమైతే వారసులం కూడా. అంటే దేవుని వారసులం. అలాగే క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి ఆయనతో కష్టాలు అనుభవిస్తే, క్రీస్తు తోటి వారసులం.
18 ౧౮ మనకు వెల్లడి కాబోయే మహిమతో ఇప్పటి కష్టాలు పోల్చదగినవి కావని నేను భావిస్తున్నాను.
Stejnou slávu, jakou obdařil Krista, jednou přizná i nám, budeme-li ochotni podstoupit i stejné utrpení. Jsem plně přesvědčen, že všechno pozemské trápení neznamená nic proti slávě, která nás nakonec čeká.
19 ౧౯ దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది.
Vždyť celá příroda dychtivě očekává, kdy se objeví Boží synové v plné slávě.
20 ౨౦ ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి,
Hříchem se porušilo všechno stvořené; přesto však zde zůstává naděje na vysvobození všeho tvorstva. Svým věrným dá Bůh svobodu a slávu a ostatnímu stvoření vrátí neporušenost.
21 ౨౧ నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది.
22 ౨౨ ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.
Jen se podívejte, jak nyní celá příroda úpí a sténá jako v porodních bolestech!
23 ౨౩ అంతే కాదు, ఆత్మ ప్రథమ ఫలాలను పొందిన మనం కూడా దత్తపుత్రత్వం కోసం, అంటే మన శరీర విమోచన కోసం కనిపెడుతూ లోలోపల మూలుగుతున్నాం.
A dokonce i my křesťané, kterým Bůh jako příslib nového života dal svého Ducha, toužebně vyhlížíme viditelný důkaz,
24 ౨౪ ఎందుకంటే మనం ఈ ఆశాభావంతోనే రక్షణ పొందాం. మనం ఎదురు చూస్తున్నది కనిపించినప్పుడు ఇక ఆశాభావంతో పని లేదు. తన ఎదురుగా కనిపించే దాని కోసం ఎవరు ఎదురు చూస్తాడు?
že jsme byli přijati mezi Boží děti, které zachrání k věčnému životu; touto nadějí jsme naplněni. Těšíme se na to, co brzy uvidíme.
25 ౨౫ మనం చూడని దాని కోసం ఎదురు చూసేవారమైతే ఓపికతో కనిపెడతాము.
Čekáme trpělivě, neboť mít naději znamená čekat, i když ještě není nic vidět.
26 ౨౬ అలాగే పరిశుద్ధాత్మ కూడా మన బలహీనతలో సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మనం సరిగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాని, మాటలతో పలకడానికి వీలు లేని మూలుగులతో పరిశుద్ధాత్మ మన పక్షంగా వేడుకుంటున్నాడు.
My sami jsme slabí a často ani nenacházíme slova k modlitbě. Ale Duch Boží nám přichází na pomoc a úpěnlivě volá za nás slovy, která se vymykají našemu jazyku.
27 ౨౭ ఆయన దేవుని సంకల్పం ప్రకారం పవిత్రుల పక్షంగా వేడుకుంటున్నాడు. ఎందుకంటే హృదయాలను పరిశీలించే వాడికి ఆత్మ ఆలోచన ఏమిటో తెలుసు.
A Bůh, který vidí do nejhlubších záhybů lidského srdce, přímluvná volání Ducha přijímá a dobře mu rozumí.
28 ౨౮ దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.
Víme, že vše nakonec slouží k prospěchu těch, kteří Boha milují. Ti jsou podle jeho vůle povoláni, aby získali podobu Božího Syna. Mají se stát jeho rodinou a Ježíš bude nejpřednější. Proč jsou k tomu povoláni?
29 ౨౯ ఎందుకంటే తన కుమారుడు అనేక సోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలని, దేవుడు ముందుగా ఎరిగిన వారిని, తన కుమారుణ్ణి పోలిన రూపం పొందడానికి ముందుగా నిర్ణయించాడు.
30 ౩౦ ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. అంతే కాదు, ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమ పరిచాడు.
Protože je Bůh před věky důvěrně poznal a k tomu vyvolil. Tento cíl dosáhnou, protože je ospravedlní a oslaví.
31 ౩౧ వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?
Co z toho plyne? Je-li Bůh s námi, kdo nás může ohrozit?
32 ౩౨ తన సొంత కుమారుణ్ణి మనకీయడానికి సంకోచించక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోబాటు అన్నిటినీ మనకీయకుండా ఉంటాడా?
Když neváhal vzdát se kvůli nám svého vlastního Syna, co by pro nás ještě neudělal?
33 ౩౩ దేవుడు ఏర్పరచుకున్న వారి మీద నేరారోపణ చేయగల వాడెవడు? నిర్దోషిగా ప్రకటించేవాడు దేవుడే.
Kdo se odváží být naším žalobcem před Božím soudem, když soudcem je ten, kdo nás sám ospravedlnil?
34 ౩౪ ఎవరు శిక్ష విధించ గలిగేది? క్రీస్తు యేసా? చనిపోయినవాడు, మరింత ప్రాముఖ్యంగా చనిపోయిన వారిలో నుండి లేచినవాడు, దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నవాడు, మన కోసం విజ్ఞాపన చేసేవాడు కూడా ఆయనే.
Kdo nás odsoudí, když naším obhájcem je sám Ježíš Kristus?
35 ౩౫ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టాలు, బాధలు, హింసలు, కరువులు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇవి మనలను వేరు చేస్తాయా?
Kdo nás odloučí od jeho lásky? Snad těžkosti nebo strach, pronásledování či hlad, nebezpečí života nebo sama smrt? To vše se nám může přihodit.
36 ౩౬ దీన్ని గురించి ఏమని రాసి ఉందంటే, “నీ కోసం మేము రోజంతా వధకు గురౌతున్నాం. వధ కోసం సిద్ధం చేసిన గొర్రెలుగా మమ్మల్ని ఎంచారు.”
Vždyť už dávný žalmista napsal: „Každou chvíli vedou někoho z nás na smrt kvůli tobě, mají nás za ovce, určené na porážku.“
37 ౩౭ అయినా వీటన్నిటిలో మనలను ప్రేమించినవాడి ద్వారా మనం సంపూర్ణ విజయం పొందుతున్నాం.
Ale s jeho pomocí máme vítězství zajištěno. Vždyť si nás zamiloval!
38 ౩౮ నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా,
A já jsem přesvědčen, že ani smrt, ani život, ani andělé, ani vládci, nic z toho, co se děje nebo teprve má přijít, ani moci světské ani duchovní a vůbec nic z toho, co vyšlo z rukou Stvořitele, nemůže nás odloučit od Boží lásky. Vždyť jsme ji poznali v Ježíši Kristu, když za nás umíral.
39 ౩౯ సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.