< రోమీయులకు 6 >
1 ౧ కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా?
Що ж скажемо? чи зостанемось у грісі, щоб благодать помножилась? Нехай не буде (так).
2 ౨ అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం?
Ми, що померли гріхом, як ще жити мем в йому?
3 ౩ క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?
Хиба не знаєте, що скільки нас у Христа Ісуса охрестилось, у смерть Його охрестились?
4 ౪ తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము.
Бо погреблись ми з Ним через хрещеннє у смерть, щоб, як Христос устав із мертвих славою Отця, так і ми в обновленню життя ходили.
5 ౫ ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం.
Коли бо ми з'єднані (з Ним) подобиєм смерти Його, то й (подобиєм) воскресення будемо,
6 ౬ ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది.
знаючи, що давнього нашого чоловіка з Ним розпято, щоб зникло тїло гріховне, щоб не служити нам більш гріху.
7 ౭ చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.
Хто бо вмер, той визволивсь од гріха.
8 ౮ మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము.
Коли ж ми вмерли з Христом, віруємо, що й жити мем з Ним,
9 ౯ చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు.
знаючи, що Христос, уставши з мертвих, уже більш не вмре: смерть над Ним більш не панує.
10 ౧౦ ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు.
Бо що вмер, за гріх вмер Він раз, а що живе, Богові живе.
11 ౧౧ ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
Так само й ви думайте, що ви мертві вже гріху, живі ж Богові, у Христі Ісусі, Господі нашім.
12 ౧౨ కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి.
Нехай же не царює гріх у смертному вашому тїлї, так щоб коритись йому в похотях його;
13 ౧౩ మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి.
анї оддавайте членів ваших гріху, (яко) знаряддє неправді, а оддавайте себе Богові, яко з мертвих оживших, і члени ваші, (яко) знаряддє правди, Богові.
14 ౧౪ మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.
Гріх бо над вами нехай не панує; не під законом бо ви, а під благодаттю.
15 ౧౫ అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు.
Що ж? чи будемо грішити, що ми не під законом, а під благодаттю? Нехай не буде.
16 ౧౬ మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా?
Хиба не знаєте, що кому оддаєте себе в слуги на послух, того ви й слуги, кого слухаєте: чи то гріха на смерть, чи слухання на праведність?
17 ౧౭ దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.
Дяка ж Богові, що ви були слугами гріха, та послухали від серця тої науки, якій і піддались.
18 ౧౮ తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు.
Визволивши ся ж од гріха, зробились ви слугами правди.
19 ౧౯ మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.
По чоловічи глаголю ради немочи тіла вашого: як ви оддавали члени ваші в слуги нечистоті і беззаконню на беззаконнє, так тепер оддайте члени ваші в слуги правді на сьвятість.
20 ౨౦ మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు.
Коли бо ви були слугами гріха, вільні (нагі) були від праведності.
21 ౨౧ అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం.
Який же тоді мали ви овощ з того, чого тепер соромитесь? конець бо того - смерть.
22 ౨౨ అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. (aiōnios )
Тепер ж визволившись од гріха і ставшись слугами Богу, маєте овощ ваш на осьвяченнє, конець же - життє вічне. (aiōnios )
23 ౨౩ ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం. (aiōnios )
Плата бо за гріх смерть, даруваннє ж Боже - життє вічне в Христї Ісусї, Господі нашім. (aiōnios )