< రోమీయులకు 5 >
1 ౧ విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము.
Оправдавши се, дакле, вером, имамо мир с Богом кроз Господа свог Исуса Христа,
2 ౨ ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం.
Кроз ког и приступ нађосмо вером у ову благодат у којој стојимо, и хвалимо се надањем славе Божије.
3 ౩ అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం.
Не само, пак, то него се хвалимо и невољама, знајући да невоља трпљење гради;
А трпљење искуство, а искуство надање;
5 ౫ ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
А надање неће се осрамотити, јер се љубав Божија изли у срца наша Духом Светим који је дат нама.
6 ౬ ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు.
Јер Христос још кад слаби бејасмо умре у време своје за безбожнике.
7 ౭ నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు.
Јер једва ко умре за праведника; за доброга може бити да би се ко усудио умрети.
8 ౮ అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు.
Али Бог показује своју љубав к нама што Христос још кад бејасмо грешници умре за нас.
9 ౯ కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం.
Много ћемо, дакле, већма бити кроза Њ спасени од гнева кад смо се сад оправдали крвљу Његовом.
10 ౧౦ ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము.
Јер кад смо се помирили с Богом смрћу Сина његовог док смо још били непријатељи, много ћемо се већма спасти у животу Његовом кад смо се помирили.
11 ౧౧ అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
Не само, пак то, него се хвалимо и Богом кроз Господа свог Исуса Христа, кроз ког сад примисмо помирење.
12 ౧౨ ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది.
Зато, као што кроз једног човека дође на свет грех, и кроз грех смрт, и тако смрт уђе у све људе, јер сви сагрешише.
13 ౧౩ ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు.
Јер грех беше на свету до закона; али се грех не примаше кад не беше закона;
14 ౧౪ అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు.
Него царова смрт од Адама тја до Мојсија и над онима који нису сагрешили преступивши као Адам, који је прилика Оног који хтеде доћи.
15 ౧౫ కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది.
Али дар није тако као грех; јер кад кроз грех једног помреше многи, много се већа благодат Божија и дар изли изобилно на многе благодаћу једног човека, Исуса Христа.
16 ౧౬ పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది.
И дар није као грех једног: јер за грех једног би осуђење, а дар од многих грехова оправдање.
17 ౧౭ మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.
Јер кад за грех једног царова смрт кроз једног, колико ће већма они који примају изобиље благодати и дар правде у животу царовати кроз једног Исуса Христа!
18 ౧౮ కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది.
Зато, дакле, као што за грех једног дође осуђење на све људе, тако и правдом једног дође на све људе оправдање живота.
19 ౧౯ ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది.
Јер као што непослушањем једног човека посташе многи грешни, тако ће и послушањем једног бити многи праведни.
20 ౨౦ ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసుకుని ఏవిధంగా ఏలిందో,
А закон дође уз то да се умножи грех; јер где се умножи грех онде се још већма умножи благодат,
21 ౨౧ అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది. (aiōnios )
Да као што царова грех за смрт, тако и благодат да царује правдом за живот вечни, кроз Исуса Христа Господа нашег. (aiōnios )