< రోమీయులకు 3 >
1 ౧ అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
అపరఞ్చ యిహూదినః కిం శ్రేష్ఠత్వం? తథా త్వక్ఛేదస్య వా కిం ఫలం?
2 ౨ ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి.
సర్వ్వథా బహూని ఫలాని సన్తి, విశేషత ఈశ్వరస్య శాస్త్రం తేభ్యోఽదీయత|
3 ౩ కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?
కైశ్చిద్ అవిశ్వసనే కృతే తేషామ్ అవిశ్వసనాత్ కిమ్ ఈశ్వరస్య విశ్వాస్యతాయా హానిరుత్పత్స్యతే?
4 ౪ కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.
కేనాపి ప్రకారేణ నహి| యద్యపి సర్వ్వే మనుష్యా మిథ్యావాదినస్తథాపీశ్వరః సత్యవాదీ| శాస్త్రే యథా లిఖితమాస్తే, అతస్త్వన్తు స్వవాక్యేన నిర్ద్దోషో హి భవిష్యసి| విచారే చైవ నిష్పాపో భవిష్యసి న సంశయః|
5 ౫ మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను.
అస్మాకమ్ అన్యాయేన యదీశ్వరస్య న్యాయః ప్రకాశతే తర్హి కిం వదిష్యామః? అహం మానుషాణాం కథామివ కథాం కథయామి, ఈశ్వరః సముచితం దణ్డం దత్త్వా కిమ్ అన్యాయీ భవిష్యతి?
6 ౬ అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?
ఇత్థం న భవతు, తథా సతీశ్వరః కథం జగతో విచారయితా భవిష్యతి?
7 ౭ నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
మమ మిథ్యావాక్యవదనాద్ యదీశ్వరస్య సత్యత్వేన తస్య మహిమా వర్ద్ధతే తర్హి కస్మాదహం విచారేఽపరాధిత్వేన గణ్యో భవామి?
8 ౮ మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.
మఙ్గలార్థం పాపమపి కరణీయమితి వాక్యం త్వయా కుతో నోచ్యతే? కిన్తు యైరుచ్యతే తే నితాన్తం దణ్డస్య పాత్రాణి భవన్తి; తథాపి తద్వాక్యమ్ అస్మాభిరప్యుచ్యత ఇత్యస్మాకం గ్లానిం కుర్వ్వన్తః కియన్తో లోకా వదన్తి|
9 ౯ అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
అన్యలోకేభ్యో వయం కిం శ్రేష్ఠాః? కదాచన నహి యతో యిహూదినో ఽన్యదేశినశ్చ సర్వ్వఏవ పాపస్యాయత్తా ఇత్యస్య ప్రమాణం వయం పూర్వ్వమ్ అదదామ|
10 ౧౦ దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
లిపి ర్యథాస్తే, నైకోపి ధార్మ్మికో జనః|
11 ౧౧ గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
తథా జ్ఞానీశ్వరజ్ఞానీ మానవః కోపి నాస్తి హి|
12 ౧౨ అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
విమార్గగామినః సర్వ్వే సర్వ్వే దుష్కర్మ్మకారిణః| ఏకో జనోపి నో తేషాం సాధుకర్మ్మ కరోతి చ|
13 ౧౩ వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది.
తథా తేషాన్తు వై కణ్ఠా అనావృతశ్మశానవత్| స్తుతివాదం ప్రకుర్వ్వన్తి జిహ్వాభిస్తే తు కేవలం| తేషామోష్ఠస్య నిమ్నే తు విషం తిష్ఠతి సర్ప్పవత్|
14 ౧౪ వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
ముఖం తేషాం హి శాపేన కపటేన చ పూర్య్యతే|
15 ౧౫ రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.
రక్తపాతాయ తేషాం తు పదాని క్షిప్రగాని చ|
16 ౧౬ వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
పథి తేషాం మనుష్యాణాం నాశః క్లేశశ్చ కేవలః|
17 ౧౭ వారికి శాంతిమార్గం తెలియదు.
తే జనా నహి జానన్తి పన్థానం సుఖదాయినం|
18 ౧౮ వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
పరమేశాద్ భయం యత్తత్ తచ్చక్షుషోరగోచరం|
19 ౧౯ ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.
వ్యవస్థాయాం యద్యల్లిఖతి తద్ వ్యవస్థాధీనాన్ లోకాన్ ఉద్దిశ్య లిఖతీతి వయం జానీమః| తతో మనుష్యమాత్రో నిరుత్తరః సన్ ఈశ్వరస్య సాక్షాద్ అపరాధీ భవతి|
20 ౨౦ ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
అతఏవ వ్యవస్థానురూపైః కర్మ్మభిః కశ్చిదపి ప్రాణీశ్వరస్య సాక్షాత్ సపుణ్యీకృతో భవితుం న శక్ష్యతి యతో వ్యవస్థయా పాపజ్ఞానమాత్రం జాయతే|
21 ౨౧ ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి.
కిన్తు వ్యవస్థాయాః పృథగ్ ఈశ్వరేణ దేయం యత్ పుణ్యం తద్ వ్యవస్థాయా భవిష్యద్వాదిగణస్య చ వచనైః ప్రమాణీకృతం సద్ ఇదానీం ప్రకాశతే|
22 ౨౨ అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.
యీశుఖ్రీష్టే విశ్వాసకరణాద్ ఈశ్వరేణ దత్తం తత్ పుణ్యం సకలేషు ప్రకాశితం సత్ సర్వ్వాన్ విశ్వాసినః ప్రతి వర్త్తతే|
23 ౨౩ భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
తేషాం కోపి ప్రభేదో నాస్తి, యతః సర్వ్వఏవ పాపిన ఈశ్వరీయతేజోహీనాశ్చ జాతాః|
24 ౨౪ నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు.
త ఈశ్వరస్యానుగ్రహాద్ మూల్యం వినా ఖ్రీష్టకృతేన పరిత్రాణేన సపుణ్యీకృతా భవన్తి|
25 ౨౫ క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.
యస్మాత్ స్వశోణితేన విశ్వాసాత్ పాపనాశకో బలీ భవితుం స ఏవ పూర్వ్వమ్ ఈశ్వరేణ నిశ్చితః, ఇత్థమ్ ఈశ్వరీయసహిష్ణుత్వాత్ పురాకృతపాపానాం మార్జ్జనకరణే స్వీయయాథార్థ్యం తేన ప్రకాశ్యతే,
26 ౨౬ ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
వర్త్తమానకాలీయమపి స్వయాథార్థ్యం తేన ప్రకాశ్యతే, అపరం యీశౌ విశ్వాసినం సపుణ్యీకుర్వ్వన్నపి స యాథార్థికస్తిష్ఠతి|
27 ౨౭ కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
తర్హి కుత్రాత్మశ్లాఘా? సా దూరీకృతా; కయా వ్యవస్థయా? కిం క్రియారూపవ్యవస్థయా? ఇత్థం నహి కిన్తు తత్ కేవలవిశ్వాసరూపయా వ్యవస్థయైవ భవతి|
28 ౨౮ కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
అతఏవ వ్యవస్థానురూపాః క్రియా వినా కేవలేన విశ్వాసేన మానవః సపుణ్యీకృతో భవితుం శక్నోతీత్యస్య రాద్ధాన్తం దర్శయామః|
29 ౨౯ దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
స కిం కేవలయిహూదినామ్ ఈశ్వరో భవతి? భిన్నదేశినామ్ ఈశ్వరో న భవతి? భిన్నదేశినామపి భవతి;
30 ౩౦ దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.
యస్మాద్ ఏక ఈశ్వరో విశ్వాసాత్ త్వక్ఛేదినో విశ్వాసేనాత్వక్ఛేదినశ్చ సపుణ్యీకరిష్యతి|
31 ౩౧ విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.
తర్హి విశ్వాసేన వయం కిం వ్యవస్థాం లుమ్పామ? ఇత్థం న భవతు వయం వ్యవస్థాం సంస్థాపయామ ఏవ|